ఒప్పించిన అధిష్ఠానం
ఏదైనా రాష్ట్ర ఇన్చార్జి పదవైనా ఇవ్వాలని విన్నపం
న్యూఢిల్లీ, మే 20: మూడు రోజులుగా అధిష్ఠానం పిలుపునకు ఎదురుచూసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డిని సోనియా శుక్రవారం కరుణించారు. ఏపీ పీసీసీ బాధ్యతలను స్వీకరించేందుకు అంగీకరింపచేశారు. వాస్తవానికి ఆయన జాతీయ స్థాయిలో పదవి కోరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ బాధ్యతలు చేపట్టాలని సోనియా ఆయనను కోరారు. కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనేది కిరణ్ కుమార్ ఆకాంక్ష. కానీ అధినేత్రి మాటను ఆయన మన్నించినట్లు తెలుస్తోంది. ఏదైనా రాష్ట్ర ఇన్‌చార్జ్ బాధ్యతలనైనా అప్పగించాలని ఆయన కోరారు. ముందుగా తాను అప్పగించిన పనిని చేపట్టాలని సోనియా సూచించినట్లు తెలుస్తోంది. 2014 తరవాత అధమస్థానానికి పడిపోయిన కాంగ్రెస్ పరిస్థితి ఏపీలో భిన్నంగా ఏమీ లేదు. కకావికలైపోయిన ఏపీ కాంగ్రెస్‌ను, తలో దిక్కుకు వెళ్ళిపోయిన పార్టీనేతలనూ ఒక గాడిన పెట్టగలరా… పార్టీకి పునర్వైభవం సాధించగలరా అనేది శేష ప్రశ్నే. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర విభజన అనంతరం సమైక్యాంధ్ర పేరుతో పార్టీని స్థాపించి, చెప్పు గుర్తుతో పోటీ చేశారు. చివరకు ఆయన తమ్ముడు కూడా గెలవలేకపోయారు.
ఏపీ పీసీసీ అధ్యక్షునిగా నల్లారి?
Date: