ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
జీ 5 లో నవంబర్ 19న ప్రీమియర్
శంకరాభరణం తులసి స్టార్ అట్రాక్షన్
(వైజయంతి పురాణపండ, 8008551232)
ఈ సినిమా కథ ఒక మధ్య తరగతి కథ.
ఇందులో సీనియర్ నరేశ్, తులసి, రాజీవ్ కనకాల వంటి నటులతో పాటు కొత్తవారు నటించారు. నీహారిక కొణిదల నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. ఓటీటీ చిత్రాలకు సెన్సార్ లేకపోవటం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తోంది. ఇంటిల్లిపాదీ కూర్చుని చూడాలంటే కష్టంగా ఉంటోంది. భాషలో అసభ్యత ఎక్కువగా ఉంటోంది. అదే సహజత్వం అనుకుంటారు.
కొన్ని కొన్ని సంఘటనలను చూపించటానికి ప్రతీకలు చూపటం మన చిత్రాలలో చాలాకాలంగా ఉంది.
కాని ఇప్పుడు మాత్రం పూర్తి సహజత్వం అంటూ ఆయా పాత్రలకు అనుగుణంగా అసభ్య పదాలను ఉపయోగిస్తున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని పేరు పెట్టారు కనుక ఈ చిత్రం సకుటుంబంగా చూసేలా ఉంటుందని ఆశించాలి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవలసింది శంకరాభరణం బాల నటి తులసి గురించి తులసి ఎంతో హుందాగా పెద్దరికం తెచ్చుకుని చాలా చక్కగా నటిస్తూ ఇటీవలి చిత్రాలలో ముందుకు దూసుకుపోతున్నారు. అదేవిధంగా పెద్ద నరేశ్ కూడా మంచి మంచి విలక్షణ పాత్రలు పోషిస్తూ మంచి తండ్రిగా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇక రాజీవ్ కనకాల.
మంచి నటుడు.
ఈ చిత్రానికి వీరు ముగ్గురూ త్రిమూర్తుల్లా నడిపించే అవకాశం ఉంది.
ఇక హీరో విషయానికి వస్తే, అంతగా ఆకట్టుకోలేకపోవచ్చేమో మరి.
హీరోయిన్ బాగానే ఉన్నారు. ఏదైనా నవంబరు 19న ఈ చిత్రం మొత్తం చూసిన తరవాత ఒక నిర్ణయానికి రావాలి. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. ఆగండాగండి ఎవర్‌గ్రీన్ సూపర్ హీరో నాగార్జున అక్కినేని ఈ చిత్ర ప్రోమోను ఆవిష్కరించారు.