ఇంటికి పరుగులు తీయించిన కంఠం…

Date:

సైన్స్ మాస్టారి చెంప దెబ్బ ఇప్పటికీ గుర్తే…
ఈనాడు – నేను : 8
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
మా నాన్నగారు ఉద్యోగరీత్యా గుంటూరు బదిలీ అయ్యారు 1974లో. అప్పుడు నేను అయిదో తరగతిలోకి చేరాలి. సెంట్రల్‌ టొబాకో రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో ఆయన యూజీసీ. బ్రాడీపేట రెండో లైను 16వ క్రాస్‌ రోడ్డులో ఆయన కార్యాలయం. మొదట మేము ఎ.టి. అగ్రహారంలో ఉండేవాళ్ళం. అక్కడే ఉన్న ఓ గవర్నమెంట్‌ స్కూల్లో ఐదో తరగతి పూర్తి చేశాను. దగ్గరలో హై స్కూలు లేదు. బ్రాడీ పేటలో ఉన్న మాజేటి గురవయ్య హై స్కూలు అయితే నాకూ, నాన్న గారికీ దగ్గరగా ఉంటుందని 14వ క్రాస్‌ రోడ్డులో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. పట్టాభిపురం రైల్వే గేటు దాటి కొంచెం ముందుకొస్తే బ్రాడీ పేటలోకి వచ్చేసేవారం. ఆరో తరగతిలో ఆ స్కూలులో చేరాను. అప్పటి స్నేహితులెవరూ గుర్తులేరు కానీ, ఒక్క ఆంజనేయులు మాస్టారు మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంటారు. ఎందుకంటే ఆయన నన్ను కొట్టిన చెంపదెబ్బ ఇప్పటికీ జ్ఞప్తికి వస్తూనే ఉంటుంది. ఆయన సైన్స్ మాస్టారు. కొంచెం డల్‌గానే ఉండేవాడిని చదువులో. ఓ రోజు ఓ చిన్న ప్రశ్న వేశారు. సమాధానం చెప్పలేకపోయాను. అంతే చెంప ఫెడీలుమంది.

కళ్ళు బైర్లుకమ్మాయి. నీళ్ళు సుడులు తిరిగాయి. నోట మాట రాలేదు. ఎడమ చెంప మీద ఆయన నాలుగు వేళ్ళూ అచ్చులు తేరాయి. కొద్దిసేపటికి తేరుకున్నాను. నిశ్శబ్దంగా ఉండి ఆయన బయటకు వెళ్ళిన తరవాత రీసెస్‌ బెల్‌. హెడ్‌ మాస్టర్‌ వచ్చారు. నన్ను తన గదికి పిలుచుకుని వెళ్ళారు. అక్కడ ఆయా ఐస్‌ నీళ్ళూ మెత్తటి గుడ్డతో సిద్ధంగా ఉంది. ఒక అరగంట సేపు చన్నీటి కాపడం పెట్టింది. అంతసేపు ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. కొద్దిగా నొప్పి నెమ్మదించడం ప్రారంభించింది. వేళ్ళ అచ్చులు కనుమరుగయ్యాయి. అప్పుడు ఆయన అన్నారిలా.. ‘చూడు ఆంజనేయులు కోపిష్టి. కాదనను. నువ్వు కూడా ఆయన పాఠం విని, ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కదా.’ మౌనంగా తలూపాను. ఈలోగా క్లాస్‌ అయిపోయింది. ఆంజనేయులు గారు క్లాసులోకి వచ్చారు. నన్ను దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తున్నట్లుగా చెప్పారు. ‘కావాలని నిన్ను కొట్టలేదు. చేయి అలా లేచిపోయింది నీమీద.’ జాగ్రత్తగా చదువుకో… అంటూ నన్ను బయటకు తీసుకెళ్ళారు. ఆ రోజున ఆయనే నన్ను ఇంటికి సైకిల్‌ మీద దింపారు. ఇంట్లోకి వచ్చి జరిగింది మా అమ్మగారితో చెప్పారు.

మీరు చేసింది కరెక్టేనండి… ఒక దెబ్బ పడితే చదువు వస్తుందంటూ ఆయనతో అన్నారు మా అమ్మగారు. అప్పటికింకా బుగ్గమీద వేళ్ళ అచ్చులు లీలామాత్రంగా కనిపిస్తున్నాయి. ఆయన వెళ్ళిన తరవాత బుగ్గ మీద వెన్నరాస్తూ.. జాగ్రత్తగా చదువుకో.. రోజు రాయడానికి మనింట్లో వెన్నుండదు అంటూ నవ్వారు. నేనూ నవ్వేశాను.

అప్పటి నుంచి స్కూల్లో ఆంజనేయులు గారి క్లాసంటే ఫుల్‌ అటెన్షన్‌. చెప్పింది చెప్పినట్లు బుర్రకెక్కించుకునేవాడిని. ఆ తరవాత జరిగిన స్లిప్‌ టెస్ట్‌లో మొదటి మార్కు నాదే. ఇక నాకు సైన్స్‌ తరగతిలో తిరుగులేకుండా పోయింది. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీలలో కూడా ఆ సబ్జెక్టులో ఎప్పుడూ తక్కువ మార్కులు రాలేదు. పైగా సైన్స్‌ సబ్జెక్టంటే అమితమైన ఆసక్తి ఏర్పడింది. డయాగ్రమ్స్‌ వేయడంలో కూడా నాదే ముందడుగు. ఇదంతా చెప్పి బోరు కొట్టిస్తున్నానా. చిన్ననాటి ముచ్చట్లు ఎంత మధురంగా ఉంటాయో ఇది రాస్తోంటే తెలుస్తోంది. అందుకే ఆగడం లేదు. గుర్తుకు రావేమోననుకున్న అంశాలు కూడా బుర్రలో ప్రవేశిస్తున్నాయి.

1974లో ఓ శనివారం ఇంట్లో ఉన్నాను. మా అమ్మగారు.. మహిళా కార్యక్రమం తప్పకుండా వినేవారు. మరిచిపోతానేమోనని మధ్యాహ్నం ఒకటి పది కల్లా పాడి పంటలు టైముకి రేడియో ఆన్‌ చేసేవారు. తరవాత ప్రాంతీయ వార్తలు.. ఒంటి గంటా ఇరవైకల్లా ఓ కంఠం వినిపించింది. నాగస్వరం విన్న తాచులా నా చెవులు రేడియో వైపు తిరిగాయి. ఏదో పురాణ కథ చెబుతున్నారు. చెప్పే తీరు ఆసక్తిగా ఉండడంతో నేను చెవులు రిక్కించి మరీ విన్నాను. ఆ గొంతులోని మాధుర్యం నన్ను కట్టిపడేసింది. కొద్దిసేపటికి తెలిసింది అది మహాభారతమని. చెప్పే ఆయన పేరు తెలీదు. పదిహేను నిముషాల తరవాత శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిచ్చారాయన. అవి పురాణాలకి సంబంధించినవే కాకుండా కొన్ని లౌకికమైనవి కూడా. ఆయన సమాధానాలు కూడా అంతే ఘుటుగా.. చమత్కారభరితంగా ఉండేవి. మరుసటి రోజు ఆదివారం.. అదే టైముకి రేడియో ఆన్‌ చేశాను. ఛ… ఆ సమయంలో సంక్షిప్త శబ్ద చిత్రంట… మూగ మనసులు అంటూ ప్రకటన. ఎంతో చిరాకేసింది. ఇప్పుడీ సినిమా వేయకపోతే.. ఏం కొంప మునిగింది. నిన్నటి కార్యక్రమం రావచ్చు కదా అనుకున్నాను. అదే అమ్మని అడిగాను. మనలాగే వాళ్ళకి కూడా ఆదివారం సెలవు. సోమవారం నుంచి శనివారం దాకా ఇదే టైముకి వస్తుందని చెప్పింది అమ్మ. ఎంతో హుషారు అనిపించింది.
ఇంటికి పరుగులు తీస్తూ…
మరుసటి రోజు యథా ప్రకారం అన్నం బాక్సు తీసుకుని స్కూలుకి వెళ్ళా. లంచ్‌ బెల్‌ 1.10 నుంచి 1.50దాకా. లెక్కేసుకున్నాను. స్కూలు నుంచి ఇంటికి పరుగెత్తుకు రావడానికి పది నిముషాలు పడుతుంది. అన్నం ఇంట్లోనే తినేస్తూ.. పురాణం వినేసి.. మళ్లీ స్కూలుకు చేరిపోవచ్చని లెక్కేశా. వెంటనే అమలులో పెట్టేశా. పరుగెడుతోంటే.. ఎక్కడికని గేట్‌మేన్‌ అడిగాడు.. బాక్సు తేలేదు.. తినేసి వస్తానంటూ ఆగకుండా పిక్కబలమంతా ప్రయోగించి ఇంటికి చేరా..
నన్ను చూసి అమ్మ కంగారు…ఏమైందని ఏం లేదు.. రేడియో పెట్టు అంటూ బాక్సు బయటకు తీశా. అమ్మకి అర్థమైంది. మంచి విషయమే కదా.. కోప్పడలేదు. నేను వింటుంటే… తను ముద్దలు కలిపి పెట్టింది. తినేసి మళ్ళీ పరుగు.. ఇలా ఏడో తరగతి అంతా…. సాగింది. ఓ రోజు ఆంజనేయులు గారు అడ్డుపడి అడిగారు.. అన్నం ఇంట్లోనే తినొస్తానండి అంటూ చెప్పి తుర్రుమన్నాను. ఆయన సబ్జెక్టులో బాగా చదువుతాను.. పైపెచ్చు ఓసారి దెబ్బ రుచి చూశాను. ఆ అనుభవంతోనో ఏమో ఆయన మారు మాట్లాడలేదు.
అలా వినడం మొదలైన కార్యక్రమాన్ని అది రేడియోలో ముగిసే వరకూ క్రమం తప్పలేదు. ఇంతకీ ఆ కార్యక్రమం పేరు ఊహించారా… ఉంటారు లెండి…

ధ…. ర్మ…. సం….దే….హా….లు

పురాణ కథలను పన్నెండేళ్ళు కూడా లేని బుడతల్ని సైతం పరుగెత్తి మరీ వినిపింపచేసిన ఆయన పేరు…

ఉ….ష….శ్రీ….
అదే పేరును ఇప్పుడు అయ్యగారి శర్మగారి నోట విన్నాను…..
నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.
నేను అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి.
చదివింది కేవలం డిగ్రీ…
ప్రభుత్వోద్యోగం కూడా కాదు…
అంత మహానుభావుడి కుమార్తెను చూసేందుకు రావాలన్నది శర్మగారి సారాంశం.
దీనికంటే ముందు ఈ వార్తను మా నాన్నగారికి చెప్పాలని ఉవ్విళ్ళూరాను.
మరుసటి రోజు ఉదయమే.. నాన్నగారికి ఫోను చేసి.. విషయం చెప్పా…
సరే చూసిరా… నువ్వు ఓకే అంటే మేమిద్దరం వస్తాం… అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ఆ క్షణం నుంచి గుండెలు గబగబా కొట్టుకోవడం మొదలుపెట్టాయి.
వాళ్ళమ్మాయిని చూడ్డానికి కాదు… ఆయన్ను చూడాలని….
ఆయన ఎలా ఉంటారు… ఎలా మాట్లాడతారు.. కంఠం అలాగే ఉంటుందా…
నన్నేమడుగుతారు… ఇలాంటి ప్రశ్నలే…

సరే… శర్మ గారితో ఓ విషయం చెప్పా..
నాకొచ్చే జీతం సంగతి మీకు తెలుసుకదా..
మా కుటుంబం కూడా సామాన్యమైన కుటుంబం..
ఆస్తులేమీ లేవు.. ఈ విషయాన్ని ఆయనకు వివరించండని అడిగాను..
సరేనన్నారు… ఇక వారింటికి వెళ్ళడమే తరువాయి.
ఓ రోజు శర్మ గారు పిలిచి రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా నేను మీ ఇంటికొస్తా..
మా మేనమామ గారింటికి తీసుకెడతా… అక్కడికి ఉషశ్రీగారి దంపతులు వస్తారు.
ముందు మిమ్మల్ని చూస్తారట..
ఆ తరువాత మీరు వారికి నచ్చితే…
వారింటికి రమ్మని వారమ్మాయిని చూపిస్తారని చెప్పారు.

సరేనన్నా.. రాత్రి నిద్ర పట్టలేదు.. ఉషశ్రీ గారిని చూస్తున్నానన్న సంతోషం… ఒక పక్క… ఏం మాట్లాడాలో తెలియనితనం మరో పక్క…
అన్నట్టే ఆయన ఓ పావు గంట ముందు మా ఇంటికొచ్చారు. నన్ను తీసుకుని వారి మేనమామ సత్యప్రసాద్‌ గారింటికి తీసుకెళ్ళారు. ఆ తరవాత ఏం జరిగిందో.. మీకు తెలుసుకోవాలనుంది కదూ! ఎందుకుండదూ.. దానికోసం రేపటి దాకా ఆగండేం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/