విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యం
పాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల మెరుగునకు వీలుగా ఎం.ఎస్.ఎం.ఈ.లను ప్రోత్సహించాలనీ, దీనికోసమే ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ- 2024 ను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. బుధవారంనాడు శిల్పకళా వేదికలో ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు MSME లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర సంపదను పెంపొందించాలనే MSME పాలసీ-2024 ను ఆవిష్కరించాం.
దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దూరదృష్టితో వ్యవహరించారు.
పారిశ్రామిక విధానంలో సరళీకృత విధానాలు తీసుకొచ్చి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టారు.
ప్రపంచంతో పోటీ పడేలా విధి విధానాలు తీసుకొచ్చారు.
సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మంత్రి శ్రీధర్ బాబు గొప్ప ఆలోచన చేయడం అభినందనీయం.
పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి సాధించదు.
అందుకే MSME పాలసీ-2024 ను ప్రభుత్వం తీసుకొచ్చింది.
గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే… కొత్త పాలసీని ముందుకు తీసుకెళతాం.
ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ.. అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజకీయాలు లేవు..
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించింది..
మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగించడానికి మాకు అభ్యంతరం లేదు.
రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలను తొలగించేందుకు మా ప్రభుత్వం వెనక్కు తగ్గదు..
ప్రస్తుతం చదివిన చదువుకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య అంతరం ఏర్పడింది..
అందుకే రాష్ట్రంలోని 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం..
టాటా ఇనిస్టిట్యూట్ తో కలిసి సంయుక్తంగా రూ.2400 కోట్లతో ఆధునీకరిస్తున్నాం.
పూర్తి అధ్యయనం తరువాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం..
ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం అందించేలా యువతకు శిక్షణ ఇందులో శిక్షణ ఇవ్వనున్నాం
యూనివర్సిటీ నిర్వహణకు పారిశ్రామిక వేత్తలు నుంచి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నాం
వీటిని యూనివర్సిటీ నిర్వహణకు ఖర్చు చేసేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది.
ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.
రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి వ్యవసాయం పండగ అని నిరూపించాం..
అయినా వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం రైతు కుటుంబానికి సరిపోవడంలేదు..
తెలంగాణ రైతాంగానికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..
వ్యవసాయాన్ని వదలొద్దు.. అగ్రికల్చర్ అనేది మన కల్చర్..
వ్యవసాయం చేసే వాళ్లు వ్యవసాయం చేస్తూనే ఇతర కుటుంబ సభ్యులను ఉపాధి అవకాశాలవైపు ప్రోత్సహించండి..
వ్యాపారాల్లో రాణించేలా ఎదగాలి..
హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం
ఫ్యూచర్ సిటీలో లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేయబోతున్నాం
మూసీ అంటే మురికి కూపం కాదు… మూసీ ని మ్యాన్ మేడ్ వండర్ గా తీర్చిదిద్దబోతున్నాం..
మా ప్రభుత్వం గత ప్రభుత్వంలా గడీల మధ్య లేదు..
ఇది ప్రజల కోసమే పని చేసే ప్రజా ప్రభుత్వం..
మా ప్రభుత్వంలో తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి..
అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
మా ప్రభుత్వం స్వయంసహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం చేస్తోంది.
శిల్పారామంలో 3ఎకరాల స్థలంలో స్వయం సహాయక మహిళల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం సదుపాయం కల్పిస్తున్నాం..
అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో నిర్వహణ మహిళల చేతుల్లోపెట్టాం..
మహిళా సంఘాలకే స్కూల్ యూనిఫామ్ కుట్టు పని బాధ్యతలు ఇచ్చాం..
యూనిఫామ్ ధరను రూ.25 నుంచి రూ.75 చేసి ఆడబిడ్డలను ఆర్ధికంగా ఆదుకుంటున్నాం..
MSMEలు బలపడితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి..
MSMEలకు మా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.
రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024
Date: