సంచలనం సృష్టించాలని ఆకాంక్ష!!
హైదరాబాద్‌లో ప్రి-రిలీజ్ వేడుకలు
64 దేశాల్లోని 18 కోట్ల బంజారాలు
గుండెల్లో పెట్టుకుంటారు!!
తెలుగు-బంజారా-హిందీ భాషల్లో
18న ప్రేక్షకుల ముందుకు!!
హైదరాబాద్, ఫిబ్రవరి 9: శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుక హైద్రాబాద్ లోని ఎ ఎమ్ బి మాల్ లో ఘనంగా జరిగింది.
ఈ చిత్రంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్రలు పోషించిన భానుచందర్, విజయ్ రంగరాజు, గీతాసింగ్, హీరో కె.పి.ఎన్. చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఆలిండియా ఆదివాసీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ చౌహాన్, తెలంగాణ గవర్నమెంట్ సెక్రటరీ భూక్య భారతి, ఐ.ఎ. ఎస్., ఐ.టి.కమిషనర్ పీర్యా నాయక్, లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రంలో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్, భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా సేవాదాస్” చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను.. ఆలిండియా ఆదివాసీ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ బెల్లయ్య నాయక్, లంబాడీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ప్రశంసించారు.
నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ… “సేవాదాస్” రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం” అన్నారు.
వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!