15-18మధ్య వయస్కులకు వ్యాక్సిన్
60ఏళ్ళ పైబడిన వారికి వైద్యుల సలహాపై టీకాలు
ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్‌పై యుద్ధానికి భారత్ సన్నద్ధమవుతోంది. భయపడవద్దనీ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సాగాలనీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఈసారి వైరస్ పిల్లలపై ప్రభావం చూపుతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయనీ, దీనిని దృష్టిలో పెట్టుకుని పిల్లలకూ వ్యాక్సినేషన్ చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ళ మధ్య పిల్లలకు జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ చేయనున్నామన్నారు. హెల్త్ వర్కర్లు, కరోనా వారియర్లకు జనవరి 10 నుంచి బూస్టర్ డోస్‌లు ఇస్తామన్నారు. 60ఏళ్ళ పైబడిన వారికి వైద్యుల సలహా మేరకు బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు ప్రధాని వివరించారు. ఒమిక్రాన్‌పై వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ కోరారు. దేశంలో కరోనా బెడద ఇంకా తొలగిపోలేదనీ, ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందనీ, ప్రపంచ దేశాలను వణికిస్తోందనీ అన్నారు. దేశంలో కరోనా వైరస్‌కు మందుల కొరత లేదన్నారు. దేశంలో 18లక్షల పడకలు సిద్ధంగా ఉన్నాయనీ, పిల్లలకోసం 90వేల బెడ్స్ కేటాయించామనీ చెప్పారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ 100శాతం పూర్తయ్యిందన్నారు. తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలనీ, వైరస్ బారినుంచి అది మనల్ని వందశాతం రక్షిస్తుందనీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
ఒమిక్రాన్‌పై ఫైట్‌కు భారత్ సిద్దం
Date: