ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి
న్యూ ఢిల్లీ, జూన్ 09 : భారత ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ప్రమాణం స్వీకరించారు. 2014 లో ఆయన తొలిసారి ప్రధానిగా ఎంపికయ్యారు. ఇది ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేసిన సందర్భం. రాష్ట్రపతి భవనంలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ఏడు దేశాల అధినేతలు అతిథులుగా హాజరయ్యారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, ఇతర సెలబ్రిటీలు హాజరయ్యారు. వీరిలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, షారుఖ్ ఖాన్, తదితరులు ఉన్నారు.
కేంద్ర మంత్రి వర్గంలో మొత్తం 72 మంది మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ముప్పై మంది కేంద్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురికి ఇండిపెండెంట్ ఛార్జ్, మిత్రపక్షాలకు పదకొండు మంత్రి పదవులు ఇచ్చారు.
27 మంది ఓబీసీలు, పదిమంది ఎస్సీలు, ఐదుగురు ఎస్టీలు, ఐదుగురు మైనార్టీలకు స్థానం కల్పించారు. పార్టీల వారీగా మంత్రి పదవులు ఇలా ఉన్నాయి బిజెపి 61 , ఎస్హెచ్చెస్ 1 , జేడీఎస్ 1, టిడిపి 2 జేడీయూ 2 , శివ సేన (యూ) 2 ఏడీఎల్ 1 , అకాలీదళ్ 1 , ఎజెఎస్ యూ 1.
ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ జయరాం గడ్కరీ, జగత్ ప్రకాష్ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, శ్రీమతి నిర్మల సీతారామన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, మనోహర్లాల్ ఖట్టర్, హెచ్.డి. కుమార స్వామి, పీయూష్ జయప్రకాశ్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జీతన్ రామ్ మాంఝి, రాజీవ్ రంజన్ సింగ్, శర్వానంద్ సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ జోషి, గిరి రాజ్ సింగ్, అశ్వని వైష్ణవ్, జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీమతి అన్నపూర్ణ దేవి, కిరణ్ రిజుజు, హర్దీప్ సింగ్ పూరి, డాక్టర్ మనసుఖ్ మాండవీయ, జి. కిషన్ రెడ్డి, చిరాగ్ పాశ్వాన్, సి.ఆర్. పాటిల్, రావ్ ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతాప్ రావ్ జాదవ్, జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద యశో నాయక్, పంకజ్ చౌదరి, కిషన్ పాల్, రామ్ దాస్ అదవాలె, రామ్ నాథ్ ఠాకూర్, నిత్యానంద రాయ్, శ్రీమతి అనుప్రియ పటేల్, వి. సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్, ఎస్.పి. సింగ్, శోభా కరంద్లాజే, కీర్తివర్ధన్ సింగ్, బి.ఎల్. వర్మ, శంతను ఠాకూర్, సురేష్ గోపి, డాక్టర్ ఎల్. మురుగన్, అజయ్ తంతా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాశ్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, వినీత్ సింగ్, దుర్గాదాస్, రక్షా నిఖిల్ ఖడ్సే, సుకాంత మజుందార్, శ్రీమతి సావిత్రి ఠాకూర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, సాహు, రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, హర్ష మల్హోత్రా, నిముబీన్ బాంబ్నియా, మురళీధర్ మోహోల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరిటా, ఉన్నారు.