(డా విడి రాజగోపాల్, 9505690690)
ఏమి తేజస్సు అది
ఎదుటి వారు ఎంత వారు గాని
నమస్కరించరా ముకుళిత హస్తాలతో!
ముఖవర్చస్సు చాలదా
వీరో అసమాన్యులని భావించటానికి
హిందూ మత విశిష్టత
అమెరికాలో అనర్గళంగా ప్రసంగించిన
ఆజానుబాహుడు
ఆరడుగుల అందానికే నిర్వచనం
బాహ్య సౌదర్యం మెండు
ఆంతరంగిక సౌదర్యమూ నిండు
గర్జించే స్వరం
తడబడని ఉచ్చారణ
పరదేశీయులను పసందుగా చేసిన
ఆ ఉపన్యాసం
భారతావని ఔన్నత్యాన్ని
ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు పెంచిన
భారత మాత ముద్దుబిడ్డడు
భారతీయుడు ఎవరు వారు ఇంకెవరు
మన వివేకానందుడే కదా!
వారి జయంతి నేడు
ఓ మారు స్మరించుకుందాం
మన హిందూ తేజాన్ని
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)
మన హిందూ తేజం
Date: