సభ్యత, సంస్కారాలను తగలెట్టేసిన సినిమాకు కొనసాగింపు
(వాసిరెడ్డి అమరనాథ్)
స్త్రీ : తల్లి , అక్క / చెల్లి , భార్య , కూతురు.
పురుషుడు: నాన్న , అన్న / తమ్ముడు , భర్త , కొడుకు.
స్త్రీ లేకపోతే.. పురుషుడు లేడు.
పురుషుడు లేకపొతే స్త్రీ లేదు.
స్త్రీ – పురుషుల మధ్య వైరం, ఘర్షణ వస్తే… మానవ జాతికి మనుగడే లేదు .
ప్రపంచంలో అత్యధిక శాతం సమాజాలు సాంప్రదాయకంగా పురుషాధిక్య సమాజాలు.
అంటే పితృస్వామ్య, పితృ వంశ పారంపర్య , పితృ స్థానిక వ్యవస్థలు ఉన్నాయి.
పదో తరగతి మొదలు అనేక అకాడమిక్ , పోటీ పరీక్షల్లో అమ్మాయిలదే పై చేయి గా ఉంది.
వందేళ్ళనాటి పరిస్థితి వేరు.
చదువుకున్న మహిళ.. ఆర్థిక స్వాతంత్య్రం సాధించింది . ఆత్మ గౌరవాన్ని ఆశిస్తుంది .
సమాజం మారాలి.
లింగ సమానత్వం రావాలి.
ఇంకా పితృ స్వామ్య జన్యువులు మనలో లోతుగా ఉన్న మాట వాస్తవం .
ఈ పోస్ట్ లింగ సమానత్వంపై కాదు.
నేటి ప్రపంచంలో జరుగుతున్న పెద్ద కుట్ర గురించి.
బలమయిన శక్తుల గురించి.
దాని వెనుక ఉన్న మార్కెటింగ్ ప్రయోజనాల గురించి.
సున్నిత మనస్కులు ఈ పోస్ట్ ఇక్కడితో చదవడం ఆపేయ్యండి. “అన్నీ సవ్యంగా ఉన్నాయి” అనుకోవడంలో ఒక రకమయిన హాయి ఉంటుంది.
నిజాలు మహా చేదుగా ఉంటాయి.
భయపెడతాయి.
మనఃశాంతి లోపిస్తుంది.
1 . ఆధునిక సమాజం లింగ సమానత్వం వైపు… కనీసం నెమ్మదిగా అయినా అడుగులు వెయ్యాలి.
యువ పురుషుల్లో మహిళాద్వేషం { మిసోగైని} దావానలంలా వ్యాపిస్తోంది.
ఇన్సల్స్ అనేది ఒక ఆన్లైన్ కమ్యూనిటీ.
ఇది ఉత్తర మెరికా యూరోపులో ప్రధానంగా ఆక్టివ్ గా ఉంది.
దీని సభ్యత్వం మిలియన్స్ లో ఉంది.
పెరుగుతోంది.
వీరు ఆధునిక తాలిబన్లు.
పూర్తి స్థాయి మహిళాద్వేషులు. “ఆడది పుట్టింది మగాడికి సుఖాన్ని ఇవ్వడానికే .. ఈ కాలం మహిళలు తప్పుదారి పడుతున్నారు “… అని వీరు నమ్ముతారు .
వీరు పూర్తి స్థాయి సైకోలు.
వీరిలో ఎనభై శాతానికి ఆత్మ హత్య ఆలోచనలు .
2014 లో ఇలియట్ రొడ్గేర్ అనే ఇన్సల్ సభ్యుడు ఆరుగురు మహిళల్ని చంపాడు .
ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే.
మహిళల్ని హింసించాలి.. చంపాలి… అనేది ఈ సైకోల ఆలోచన.
ప్రపంచ వ్యాపితంగా మహిళా ద్వేష గ్రూప్స్ వీడియోస్ పోస్ట్లు వైరల్ అవుతున్నాయి .
ఇదొక పెద్ద బిజినెస్ .
నేటి ప్రపంచంలో ముగ్గురిలో ఒక మహిళ భౌతిక/ లైంగిక హింసకు గురవుతోంది.
2 . మరో పక్క యువ మహిళల్లో పురుష ద్వేషం దావానలంలా వ్యాపిస్తోంది. మెన్ ఆర్ ట్రాష్ అనే హ్యాష్ట్యాగ్ ఉద్యమం ఒక సంచలనం. లక్షల మంది పాల్గొన్నారు. కొంతమంది మహిళా సంఘాల ముసుగులో పురుష ద్వేషాన్ని వ్యాపింప చేస్తున్నారు. మెన్ ఆర్ ది ప్రాబ్లెమ్, మిసన్డ్రి .. ఇంకా సవా లక్ష గ్రూప్స్ .. వాటి పోస్టులు .. వీడియో లు. కోట్లాది మంది యువ మహిళల్ని ద్వేషంతో నింపేస్తున్నాయి.
పురుషుడికి స్త్రీ కి మధ్య ఘర్షణ జరిగితే?
ఇల్లు , పాఠశాల , కళాశాల , ఆఫీస్ .. మొత్తంగా .. ప్రపంచం యుద్ధ భూమిగా .. మారిపోతుంది.
ఎందుకిలా?
ఇదేదో యాదృచ్చికంగా జరుగుతోందా?
“పోస్ట్ చదవడం ఆపేయ్యండి.. నిజాలు భయపెడుతాయి .. నిద్ర కూడా సరిగా పట్టదు” అని చెప్పాను.

అయినా పోస్ట్ లో… ఇక్కడి దాక మీరు వచ్చారు.
సరే చదవండి.
నన్ను బ్లేమ్ చేయకండి.
నిన్నటి నుంచి ఈ పోస్ట్ పెట్టాలా? వద్దా? అనే తీవ్ర మానసిక ఘర్షణతో ఉన్నాను.
నిజం చెప్పడానికి భయం ఎందుకు అని నన్ను నేను కన్విన్స్ చేసుకొని ఇదిగో .. ఇప్పుడు పెడుతున్నాను.
పోస్ట్ ముందుకు వెళ్లేకొద్దీ… పచ్చిగా మారుతుంది. ముందుగానే చెబుతున్నాను. ఏమీ అనుకోవద్దు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాపై నిన్నటి నా పోస్ట్ వైరల్ అయ్యింది. అది చదివారు కదా.
లింగ సమానత్వం పేరుతో వివాహ పూర్వ లైంగిక సంబంధాలను విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్ల పిజి కోర్స్ లో హీరో హీరోయిన్ వెయ్యి సార్లు లైంగికంగా కలిశారు అని సినిమాలో ఉంది.
ఉన్నత విద్య సంస్థల్లో ఇది సర్వ సాధారణం అయిపోయింది. చాలా క్యాజువల్ గా ఆ పని కి పూనుకొనేవారు .. అటు అమ్మాయిల్లో ఇటు అబ్బాయిల్లో లక్షల్లో .. కోట్ల లో .
రబ్బరు తొడుగుల మాఫియా!
భార్య భర్త .. బెడ్ రూమ్ .. రబ్బరు తొడుగులు వాడుతారా?
మరి కొంత కాలం పిలల్లు వద్దు అనుకొంటే 12 నుంచి 18 రోజు వరకు వాడొచ్చు.
పిల్లలు పుట్టి భార్యాభర్తల్లో ఒకరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొంటే ఆ అవసరం కూడా ఉండదు. ఒప్పుకొంటారు కదా ?

మరి… గర్ల్ ఫ్రెండ్ సినిమాలో.. లా .. క్యాంపస్ హోస్టల్స్ , లివ్ ఇన్ … డేటింగ్ జంటలు?
నూటికి తొంబై మంది రబ్బరు తొడుగులు వాడుతారు.
ప్రపంచ వ్యాపితంగా సంవత్సరానికి 1500 కోట్ల రబ్బరు తొడుగులు అమ్ముడు పోతున్నాయి.
మార్కెట్ విలువ సుమారుగా 70, 000 వేల కోట్లు.
ఇది సంవత్సరానికి పది శాతం చొప్పున పెరుగుతోంది .
సమాజంలో ఎంత విచ్చలవిడితనం వస్తే ఈ తొడుగులు వ్యాపారం అంత పెరుగుతుంది.
ఇలాంటి విచ్చలవిడితనం రెచ్చగొట్టడంలో ఈ వ్యాపారుల పాత్ర ఉందా?
ఆలోచించండి!
“అదొక అవసరం .. రబ్బరు తొడుగులు వాడితే నీకేంటి నష్టం ?”అని ఎవరైనా దబాయించవచ్చు.
అమాయకత్వానికి మించిన సుఖం ఇంకోటి లేదు.
మామోవేటిన్ అనే డేనిష్ వినియోగదారుల సంస్థ 2014 లో ఒక సైంటిఫిక్ స్టడీ చేపట్టింది. PFAS – అనేది ఒక రకమయిన రసాయనం. ఇది ఫరెవర్ కెమికల్. వాటంత అవి బ్రేక్ డౌన్ కావు.
ఈ సంస్థ చేసిన స్టడీలో రబ్బరు తొడుగుల్లో ఈ రసాయనం ఉందని తేలింది. ఇది కాన్సర్ కారకం.
ఈ తొడుగుల్లో ఫ్లోరిన్ కూడా పరిమితికి మంచి ఎక్కువ ఉంది. ఎక్కువ సుఖం కోసం కొన్ని రకాల జెల్స్ కూడా వాడుతారు.
ఈ జెల్ లో అయితే 39 PPM ఫ్లోరిన్ ఉంది. ఇది మహా ప్రమాదం.
“ఎక్కడో డెన్మార్క్ లో ఇది. మనకు ఇండియాలో ఈ పరిస్థితి లేదు “అనుకొంటే మనస్సు హాయిగా ఉంటుంది కదా.
నిజమే దగ్గుమందు తో పిలల్లు చచ్చి పోయే స్థాయి ఫార్మా ఉత్పత్తుల దేశం మనది. ఇక్కడ సమస్యే లేదు అనుకొంటే ప్రాణానికి హాయిగా ఉంటుంది .
నా ఖర్మ కాకపోతే ఈ పోస్ట్ ఎందుకు మొదలెట్టానో … ఎలా ముందుకు పోవాలో అర్థం కావడం లేదు.
సభ్యత సంస్కారం అడ్డొస్తోంది .
అమ్మ లారా .. అయ్యలారా !
వయస్సులో ఉన్నప్పుడు లైంగికంగా స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ అవసరం. ఒప్పుకొంటారు కదా!
మరి ఈ రోజుల్లో ఒకటి రెండు సంవత్సరాల డేటింగ్ మేటింగ్ తరువాత విడిపోతున్నారు.
పెళ్ళొద్దు అంటున్నారు. యాభై దాటితే మహిళల్లో లైంగిక ఇచ్ఛ చాలామటుకు తగ్గిపోతుంది. ఆ వయసు వచ్చిన పురుషులు కొంతమంది వాంఛలు తీరక చిన్న పిల్లల వైపు మళ్లుతున్నారు. ఇదొక హేయమయిన నేరం ఘోరం. ఇది వేరే టాపిక్. దీనిపై నా గత పోస్ట్లు చదవగలరు.
నేడు శారీరక వాంఛ తీర్చుకోవడానికి ఇరవై ముప్పై లలో ఉన్న పురుషులు … స్రీలు … కృతిమ సాధనాల వైపు మళ్లుతున్నారు.
మీ వయస్సు నలబై దాటివుంటే మీకు దీని గురించి తెలిసే అవకాశం తక్కువ .
ఇరవై లలో ఉన్న వారికి ఇది తెలియక పోయే అవకాశం తక్కువ . పీర్ ప్రెజర్ మరి . .
ఇదీ నేటి సమాజం లో డివైడ్ .
ఐదేళ్లు ఎవరెస్టు శిఖరం .. అటు పై పసిఫిక్ మహాసముద్రం మరీనా ట్రెంచ్ !
ఒకప్పుడు .. ఎక్కడో కొన్ని యూరోప్ దేశాల్లో చిన్న చిన్న షాప్స్ లో ఉండేవి.
ఇప్పుడు విచ్చలవిడిగా ఆన్లైన్ లో.
గత పదేళ్లలో వీటి సేల్స్ వందల రెట్లు పెరిగాయి.
ఇది ఇప్పుడు మల్టీ బిలియన్ ఇండస్ట్రీ.
వై బ్రే.. పూర్తి పేరు రాయలేను.
క్షమించండి.
పట్టణాల్లో యువ మహిళల్లో దీని వినియోగం పెరిగిపోతోంది.
ఒక్క సారి దీనికి అలవాటు పడితే .. అటుపై సహజ సిద్ధ పద్ధతులు రుచించవు .
పురుషుడి ని దగ్గరకు రానివ్వని పరిస్థితి.
ఎంతటి మొనగాడయినా… ఈ సాధనాలకు బానిస అయిన మహిళను సంతృప్తి పరచలేడు.
వివాహిత స్త్రీ … దీనికి అలవాటు పడితే అటుపై మొగుడు పస్తులే. చివరిగా విడాకులు.
అంతేనా?
చెప్పడానికి నాకు సిగ్గు ఉండకూడదు… ధైర్యం ఉండాలి .. చాలా విషయాలు వున్నాయి.
ఈ వైబ్ సాధనాలను ఉపయోగిస్తే నరాలు దెబ్బ తినే ప్రమాదం. అప్పుడు ఫార్మాసురులకు పండగే పండుగ!
ఇంకా బాక్టీరియమ్ ఇన్ఫెక్షన్.
అన్నిటికీ మించి ఒకటుంది.
స్త్రీ ఆ క్రీడలో అత్యున్నత సంతృప్తి చెందే దశ .. అన్ని ఆర్గ … అంటారు . పూర్తి పేరు రాయలేను.
సింథటిక్ వస్తువు … అదే వైబ్ వాడే మహిళల్లో ఐదేళ్లకు ఆ ఆర్గ దశ చేరుకొనే అవకాశం పోతుంది.
జీవితంలో ఆ సంతప్తి ఇక తిరిగి రాదు.
దీని వెనుక సైంటిఫిక్ లెక్కలు వున్నాయి.
ఈ వైబ్రే లు 75 నుంచి 100 గాస్ EMF ను ఉత్పత్తి చేస్తాయి.
అంటే ఐదేళ్లు హిమాలయ పర్వతాలు .. అటు పై జీవితం అంతా పసిమిక్ మహా సముద్రం .
ఎవరు చెప్పాలి ?
ఈ విషయాలు ఎందుకు చెబుతారు ?
వీటన్నింటికీ మించి నేడు పెరుగుతున్న మహిళా ద్వేషం పురుష ద్వేషం ఉద్యమాల వెనుక మానవ జనాభా తగ్గించాలి అనే ప్రపంచ కోటీశ్వరుల కుట్ర ఉంది.
మిలియన్ డాలర్స్ పెట్టుబడి ఉంది.
ఇదో పెద్ద మాఫియా.
కంటికి కనిపించని మహా విషాదం .
ఇక్కడి లోకల్ డైరెక్టర్. లోకల్ యూట్యూబ్ వారు .. ఈ ఆటలో చిన్న పావులు మాత్రమే .
జాగ్రత్త .. మీ ఇంటిలో అమ్మాయిని.. అబ్బాయిని .. ఈ విషనాగుల నుంచి కాపాడుకోండి .
చదివే వయస్సు లో బ్రహ్మచర్యం .. చదువు పై దృష్టి.
అటుపై ..
పెళ్లి చేసుకొని .. ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్. ఎల్లరు హాయిగా ఉండాలోయ్.
ప్రతి పేరెంట్… కొడుక్కి చెప్పాలి .. కూతూరుకి చెప్పాలి
స్త్రీకి పురుషుడు… పురుషుడికి స్త్రీ శత్రువు కాదు ..
అసలయిన శత్రువులు గేట్ల తాత లాంటి ప్రపంచ కోటీశ్వరులు… ఫండ్స్ కుమ్మరిస్తున్న రబ్బరు తొడుగులు .. ఎక్స్ టాయ్స్ మాఫియా గాళ్ళు..
ఈ పోస్ట్ ఇక్కడి దాకా చదివాకా కడుపులో తిప్పినట్టు .. వికారంగా ఉంటే నన్ను మన్నించండి.

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త)

