హీరో పురస్కారం అందుకున్న తొలి వైద్యేతరుడు

0
181

నో స్మోకింగ్ ప్లీజ్ అన్నందుకు అవార్డు
మాచన రఘునందన్ కు అనుపమాన గౌరవం
(వ్యూస్ ప్రత్యేక ప్రతినిధి)

అతను “చరిత్ర సృష్టిస్తా.!”అని అనుకోలేదు. అతని కృషి, పట్టుదల అలుపెరగని పోరాటం ఫలితంగా జాతీయ స్థాయిలో ఓ అత్యున్నత అవార్డు అతన్ని వరించింది. “సార్ నో స్మోకింగ్ ప్లీజ్” అని 22 ఏళ్లుగా చేసిన ప్రార్ధనకు యావత్ భారతం అవాక్కయింది.


మిస్టర్ మాచన రఘునందన్ యు ఆర్ ఆ టొబాకో కంట్రోల్ “హీరో” అని పేర్కొంది. రఘునందన్ ఫోటో ను స్టాంప్ గా తీర్చి దిద్ది, ఓ వ్యక్తి హీరో ఎలా అయ్యారు, అంతర్జాతీయ స్థాయిలో ఎందరో టుబాకో కంట్రోల్ హీరో ల తో సరిసమానంగా చేరాడు..అని చెప్పడానికి ఓ అంతర్జాతీయ సంస్థ రఘునందన్ గురించి ఎంతో సమయాన్ని వెచ్చించి ఓ వైద్యేతరుడు వైద్యుల కన్నా మిన్న గా చరిత్ర సృష్టించాడు అని హీరో అవార్డు ప్రదానం చేసింది. యావత్ భారతం లో టొబాకో కంట్రోల్ హీరో అవార్డ్ దక్కడం అంత ఆషా మాషి కాదు. “హి ఈజ్ ఎక్స్ట్రార్డినరీ” అతని కృషి అసాధారణం అని సెలెక్షన్ కమిటి వ్యాఖ్యానించింది అంటే..ఓ సామాన్యుడు తన అసామాన్య కృషి తో సాధించిన నిస్వార్థ సేవా ఫలితం.

కొందరు తమ కష్టంతో చరిత్రలో నిలుస్తారు. నిశ్శబ్దంగా, ఎటువంటి హడావుడి లేకుండా సమాజానికి సేవ చేసే నిజమైన హీరోలు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తిత్వం, ధూమపానం మరియు పొగాకు నియంత్రణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మాచన రఘునందన్. ఒక ఉద్యోగి గా..డిప్యూటీ తాసిల్దార్‌గా నౌకరీ చేస్తున్న వ్యక్తి విలాసవంతమైన జీవితాన్ని కాదని, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమించడం దేశ చరిత్ర లో నే ప్రథమం.

వైద్య వృత్తికి సంబంధం లేకపోయినా, పొగాకు నియంత్రణ కోసం 22 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న ఆయన కృషిని అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ (ఆర్ సి టి సి) గుర్తించి, ఆయనకు దేశం లో పొగాకు నియంత్రణ లో నే అత్యున్నత స్థాయి గౌరవం ఇచ్చింది. “హీరో” అవార్డును ప్రదానం చేసింది. ఇది కేవలం ఒక వ్యక్తికి లభించిన గౌరవం కాదు, ఇది నిస్వార్థ సేవకు, అంకితభావానికి, మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతకు లభించిన గుర్తింపు.

సాధారణంగా, ఈ అవార్డు వైద్యులకు మాత్రమే లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన 15 మంది లో “మాచన” మాత్రమే వైద్యేతరుడు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి.

మాచన రఘునందన్ అనే పేరు ఇకపై ఒక అధికారి పేరు మాత్రమే కాదు, పొగాకు మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవ వీరుడి పేరు. ఆయన పొందిన “హీరో” అవార్డు కేవలం ఒక బహుమతి కాదు, నిస్వార్థ సేవకు లభించిన కిరీటం. ఆయన జీవితం, రేపటి తరం కోసం ఒక ఆదర్శం, ప్రేరణ.

రఘునందన్ సృష్టించిన ఈ “నిశ్శబ్ద విప్లవం” భవిష్యత్ తరాలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. ఆయన చేసిన సేవలు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మంచిగా మార్చడానికి మనలో ప్రతి ఒక్కరూ ఎలా కృషి చేయాలో తెలియజేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here