తెలుగు హృద‌యాల్లో ఊహ‌ల గుస‌గుస‌లు

Date:

పుల‌కించ‌ని మ‌దిలోనూ పుల‌కింత‌

నాలుగున్నర ద‌శాబ్దాల న‌ట‌నా ప్ర‌స్థానం
జ‌న‌వ‌రి 24 గ్లామ‌ర్ క్వీన్ కృష్ణ‌కుమారి వ‌ర్థంతి
కుమార్తె దీపిక పంచుకున్న జ్ఞాప‌కాల దొంత‌ర‌
(వైజయంతి పురాణపండ)
వగల రాణివి నీవే… అంటూ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ఓ పోయే పోయే చినదానా… నీ తీయని సొగసు నాదేనా అని కుర్రకారు మనసులు దోచారు…
ఊహలు గుసగుసలాడే… నా హృదయము ఊగిసలాడే అంటూ కళ్లతో మాట్లాడారు…
పులకించని మది పులకించు అంటూ మనసును తడి చేశారు.
నీ చెలిమి నేడె కోరితినీ ఈ క్షణమే ఆశ వీడితిని అంటూ హృదయాలను ఆర్ద్రం చేశారు.
గ్లామర్‌ క్వీన్‌గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం కనువిందు చేశారు. ప్రముఖంగా జానపదాలలో ఎక్కువ చిత్రాలలో కాంతారావుతో న‌టించారు. ఒడ్డు పొడుగు, పెద్ద పెద్ద కళ్లు, పొందికైన శరీరం… చిలిపితనంతో పాటు, విషాదాన్ని కూడా పండించారు. కెరీర్‌లో బాగా బిజీగా ఉన్న కృష్ణకుమారి, ఒక అనాధ బాలికను దత్తత తీసుకున్నారు. దీíపిక అని పేరు పెట్టుకున్నారు. సినిమాలకు దూరంగా పెంచారు. ‘తనను కన్న తల్లి కంటె గారంగా పెంచారు’ అని తల్లి గురించి వ్యూస్‌కు తెలిపారు దీపిక. కృష్ణ‌కుమారి 11వ వ‌ర్థంతి సంద‌ర్భంగా కుమార్తె దీపిక తల్లితో త‌న‌ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


న‌ల‌బై ఐదేళ్ళు సినిమాల్లో…
అమ్మ కెరీర్‌ సుదీర్ఘ కాలం నడిచింది. 45 ఏళ్లు నటించాక రిటైర్‌ అయ్యింది. అందువల్ల వివాహం కూడా ఆలస్యంగా అయ్యింది. మా నాన్నగారు ఎన్నడూ సినిమాల వైపుకి రాలేదు. 1978లో నేను మూడు నెలల పసిపిల్లగా ఉన్నప్పుడు, వన్‌శంకరిలో ఉన్న అనాధాశ్రమం నుంచి నన్ను దత్తత తీసుకుంది అమ్మ. నేను అమ్మకి పెంపుడు కూతురిని అయినప్పటికీ, ఎప్పుడూ నన్ను అలా చూడ‌లేదు. నాకు 19 సంవత్సరాల వయసు వచ్చేవరకు అసలు నన్ను దత్తు తీసుకున్నార‌నే విషయమే నాకు తెలియదు. ఈ విషయం తెలిశాక అమ్మ మీద గౌరవం పెరిగింది. మా పెద్దమ్మ షావుకారు జానకి. ఆవిడ తన పిల్లలతో సమానంగా చూస్తారు నన్ను.


నీకు ఇద్ద‌రు అమ్మ‌లు అన్నారు పుట్ట‌ప‌ర్తి సాయిబాబా
‘నీకు ఇద్దరు అమ్మలు’ అని నన్ను శ్రీకృష్ణుడితో పోల్చేవారు పుట్టపర్తి సాయిబాబా.  నేను మా తాతయ్యను ఎప్పుడూ ఒక మాట అడిగేదాన్నట, ‘యశోద, దేవకి… ఇద్దరిలో ఎవరు గొప్ప’ అని. ఆయన నవ్వేసేవారట. నేను పెద్దయ్యాక ఇవన్నీ అమ్మ నాకు చెప్పింది.


మా అమ్మమ్మ మాతోనే…
మా అమ్మమ్మ 20 సంవత్సరాల పాటు మాతోనే ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్లే ముందుగా బెంగళూరు వచ్చారు. ఆ తరవాత వాళ్ల తమ్ముడు, భార్య వచ్చారు. ఆ తరవాత అమ్మ 1976లో చెన్నై నుంచి బెంగళూరు మకాం మార్చేసింది. అమ్మ తాలూకు మిగ‌తా బంధువులంతా 1985 నాటికి ఇక్కడకు వచ్చేశారు. ఇలా మొత్తం 24 మంది బెంగ‌ళూరు చేరుకున్నాం. అందరం బాగా కలిసిమెలిసి ఉండేవాళ్లం. మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నాను. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ వాళ్లతో పచ్చీస్, చింతగింజలు, క్యారమ్‌ బోర్డులాంటివి ఆడేదాన్ని. అమరచిత్ర కథలు, పిల్లల మహాభారతం చదివించేది.


అమ్మ‌ను అమ్మీ అనేదాన్ని…
నా హిందీ టెక్ట్స్‌ చదివి, అమ్మీ చాలా త్వరగా హిందీ నేర్చుకుంది. కుటుంబం కోసం అమ్మీ చదువు ఆపేయవలసి వచ్చింది. అందుకు అమ్మీ అప్పుడప్పుడు బాధపడుతుండేది. అమ్మీకి గార్డెనింగ్‌ అంటే చాలా ఇష్టం. అమ్మను అమ్మీ అని పిలిచేదాన్ని. అమ్మీ షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజు జ‌రిగిన వివరాలతో పాటు, నటీనటులంతా ఒకే కుటుంబంలా ఎంత సరదాగా ఉండేవారో చెప్పేది. ఒక వార్తని మీడియా ఎలా మార్పులు చేసేదో తరచుగా చెబుతుండేది. చిన్నతనంలో అమ్మీ నాకు అన్నం తినిపిస్తూ, తను నటించిన సినిమాలు చూపించేది. అందులో దేవాంతకుడు నాకు బాగా గుర్తుండిపోయింది. నాకు మైథాలజీ, మాయలు-మంత్రాల చిత్రాలంటే చాలా ఇష్టం. దేవాంత‌కుడు నాకు ఇష్ట‌మైన చిత్రం. నేను ఒక సెలబ్రిటీలాగే ఎదిగాను. ఇంట్లో మాత్రం మామూలుగానే ఉండేదాన్ని. న‌న్ను ఒకసారి సినిమాల ఆడిషన్‌కి రమ్మన్నారు. సినిమాల మీద వ్యామోహం లేకపోవడంతో నేను ఆ వైపుకి వెళ్లలేదు.

 
అమ్మీ అన్నీ చేసేది…
నాకు స్నేహితులు చాలా మంది ఉన్నారు. వాళ్లని ఇంటికి తీసుకువస్తే అన్నీ అమ్మీనే స్వయంగా వండి పెట్టేది. వంటలు అమ్మీ చాలా బాగా చేసేది. ఇడ్లీలు చేయడంలో ఎక్స్‌పర్ట్‌. అన్నం దగ్గర నుంచి అన్నీ స్వయంగా చేసేది. నాన్నకి అమ్మీ అంటే చాలా ఇష్టం. అమ్మ సినిమాలు కాదు, అమ్మీ చేతి వంట అంటే ప్రీతి. అమ్మ ప్రతి వంటకం తయారీ ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంది. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. సాంబారు పొడి, రసం పొడి, మున‌గాకు పొడి, చింత చిగురు పప్పు… ఇవన్నీ రాసి పెట్టుకుంది అమ్మీ. మాది పెద్ద ఫామ్‌ హౌస్‌. అన్ని కూరలు అమ్మీ స్వయంగా పండించేది. ఒక్క కూర కూడా బయట నుంచి కొనలేదు మేం. ఇంటికి ఎవరు వచ్చినా మర్యాదగా చూసేది. భోజనాల సమయంలో అతిథులు అనుకోకుండా ఇంటికి వస్తే, తనకు ఉంచుకున్న అన్నం కూడా పెట్టేసేది. ఈ అలవాటు మా అమ్మమ్మ శచీదేవి నుంచి త‌న‌కు వారసత్వంగా వచ్చింద‌ని అమ్మీ చెబుతుండేది. షాపింగ్‌ బాగా చేసేది.


మా అబ్బాయంటే ప్రాణం
నా పెళ్లి అమ్మీ వాళ్లే చేయాలనుకుని, చాలా సంబంధాలే తెచ్చారు, నేను రిజెక్ట్‌ చేశాను. చాలామంది నిర్మాతలు కూడా నన్ను కోడలు చేసుకోవాలని అమ్మని అడిగారట. అందరూ మా డబ్బు కోసం చూసినవారు కావడంతో అమ్మ నిరాకరించింది. నా స్నేహితులే విక్రమ్‌ అనే అబ్బాయిని ఎంపిక చేసి, 2003లో నా వివాహం చేశారు. మా వివాహాన్ని అమ్మీ వాళ్లు అంగీకరించటానికి కొంత‌కాలం ప‌ట్టింది.  2006లో నాకు బాబు పుట్టాడు. పవన్‌ మయ్యా అని పేరు పెట్టుకున్నాం. వాడు పుట్టినప్పుడు ‘ఆపిల్‌ ఆఫ్‌ ద ఐ’ డిజైన్‌లో మాకు ఇల్లు కట్టించారు అమ్మీ వాళ్లు.

మా అబ్బాయిని చాలా ప్రేమగా చూసేది. వాడిని విడిచి ఉండలేకపోయేది. అమ్మ‌తో జీవితం చాలా ఆనందంగా గ‌డిచిపోయింది. అమ్మ క‌న్నుమూశాక ఆ బాధ‌లో నుంచి కోలుకోవ‌టానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఈ రోజు అమ్మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా అమ్మ జ్ఞాప‌కాల‌ను త‌డిసిన‌ గుండె పొర‌ల్లో నుంచి బ‌య‌ట‌కు తీస్తున్నాను.


అమ్మీ చాలా లవింగ్‌ అండ్‌ ఓపెన్‌ హార్టెడ్‌ పర్సన్‌. ఒకే ఒక్క హిందీ సినిమాలో నటించింది. నాన్న వద్దనడంతో మానుకుంది. (కృష్ణ కుమారి వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆమె ద‌త్త‌త కుమార్తె దీపిక వ్యూస్‌కు ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఇది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/