జులై 09 గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి
(రోచిష్మాన్, 9444012279)
ఒకదశలో మొత్తం దక్షిణ భారతదేశ సినిమాలో గొప్ప నటులు తెలుగులోనే ఉండేవారు. అభినయం, వాచికం, గాత్రం ఈ మూడిటి పరంగా తెలుగులో గొప్ప నటులు ఉండేవారు. మంచి గాత్రాలు, గొప్ప గాత్రాలు ఉన్న నటులు తెలుగులోనే ఎక్కువగా ఉండేవారు. ఆ నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు ఒకరు; ప్రముఖులు.
మంచి మొహం, మంచి గాత్రం గుమ్మడివి. ఎస్.వీ. రంగారావు, ఎన్.టీ. రామారావు గాత్రాలలా heavy voices, great baritones కాకపోయినా గుమ్మడి గాత్రం గొప్ప గాత్రం. Clear tone with verve గాత్రం గుమ్మడిది. గుమ్మడి గాత్రంలో light ఉంటుంది. ఆయన వాచికం కూడా చాల గొప్పది. సంభాషణల్ని పలకడంలో కడు నేర్పరి గుమ్మడి. ఆయన అభినయం ఎంత గొప్పదో ఆయన వాచికం అంత గొప్పది.
సాత్వికాభినయంతో, కచ్చితత్వంతో మేలైన నటనను ప్రదర్శించారు గుమ్మడి. గుమ్మడి సరిగ్గా చెయ్యని సన్నివేశాలు లేవు. సన్నివేశాలే కాదు గుమ్మడి చెడగొట్టిన పాట్స్ కూడా లేవు. అల్లు రామలింగయ్య, రమణారెడ్డి వంటి వాళ్లు కూడా సరిగ్గా చెయ్యని షాట్ అంటూ లేకుండా వందలాది సినిమాలు చేశారు.
తన పాత్రను, తన సన్నివేశాన్ని సరిగ్గా ఆకళింపు చేసుకుని గొప్పగా నటించారు గుమ్మడి.
ఎస్.వీ. రంగారావు పాత్రను తనిదిగా చేసుకుంటారు; గుమ్మడి తానే పాత్ర అయిపోతారు. Stylish performance కాదు, గుమ్మడి నటన styleless performance. Styleless performance కూడా విశేషమైందే. ఔను గుమ్మడి ఒక విశేషమైన నటుడు.
గుమ్మడి తెలుగు సినిమాలో వచ్చిన గొప్ప నటుడు. గుమ్మడి హిందీలోనో, బెంగాలీలోనో వచ్చుంటే ఆయన ఎంత గొప్ప నటుడో అంత గొప్ప పరిగణన, ప్రాశస్త్యం దేశ వ్యాప్తంగా వచ్చుండేవి.
తెలుగు సినిమా నటన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే సందర్భంలో మనం గుమ్మడిని గట్టిగా చెప్పాలి; చెబుదాం.

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)
వ్యూస్ ఛానెల్ గుమ్మడి గారి అమ్మాయిలతో నిర్వహించిన వైజయంతి మాటామంతిని ఈ లింక్ తో చూడవచ్చు.

