(డా వి.డి. రాజగోపాల్, 9505690690
భారతదేశపు మరో ఆణిముత్యం
మన లాల్ బహదూర్ శాస్త్రి
పొట్టి వానికి పుట్టెడు ఆలోచనలు
అన్న నానుడి నిజం చేశారు
పొట్టివాడైన గట్టివాడని కొనియాడారు
స్వాతంత్య్ర పోరులో తానూ
మహాత్ముని అడుగుజాడల్లో నడచి
జైలు జీవితం చూశాడు
ప్రధమ ప్రధాని నెహ్రూ మరణం
దేశానికి పెద్ద అగాథం
నెహ్రూ స్థానం లో ప్రధానిగా స్థానం సంపాదించుకొన్న ఉద్దండుడు
పటిష్టమైన ఆర్ధికవిధానాలు చేబట్టి
వైట్ రెవల్యూషన్ అంటే పాల ఉత్పత్తికి
నాంది పలికాడు
జైజవాన్ జైకిసాన్ అని నినదించాడు
రైల్వే మంత్రిగా ఉండగా ఓ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఆ పదవికి రాజీనామా చేసిన ఆదర్శవంతుడు
పాకిస్తాన్తో యుద్ధంలో తన సత్తా చూపాడు
భారతీయుల విశ్వాసం పొందాడు
తన కొడుకుకు ప్రమోషన్ తన కారణంగా ఇచ్చారని కొడుకుతో ఆ కంపెనీకి రాజీనామా ఇప్పించారు
ఒక ఫియట్ కారు వాయిదాలలో కొని
ఆ వాయిదాలు కట్ట లేని ఆర్థిక స్థోమత
తాష్కెంట్ ఒప్పందం కొంపముంచింది
అక్కడ గుండె ఆగిపోయిందన్నారు
మరణం ఓ మిష్టరీగా ఉండిపోయింది
మహాత్ముని అడుగు జాడల్లో నడిచారు
హుషారుగా వెళ్ళి శవమైవచ్చారు
అనుమానాలు ఉన్నా
ఎందుకో మౌనమయ్యారు అప్పట్లో
ఈ భారత రత్న వర్దంతి నేడు
వీరికి పలుకుదాం జోహార్లు
(కవిత రచన రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)
ALSO READ: ప్రతిపక్షాల ఐక్యతలో మరో అడుగు