హైదరాబాద్, డిసెంబర్ 4: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్ను మూశారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. లోబీపీకి గురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక బాధ్యతలను నిర్వహించారు.
డాక్టర్ వైయస్ఆర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. తమిళనాడు గవర్నర్‌గా కూడా పనిచేశారు. టంగుటూరి ప్రకాశం పంతులుకు అంతేవాసి. సమైక్య రాష్ట్రంలో ఆయన ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఆర్థిక మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు.1933 జూన్ 4న రోశయ్య జన్మించారు.