గవర్నరుకు ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖ
సొంత వాహనంలో ఎర్రవల్లికి పయనం
హైదరాబాద్, డిసెంబర్ 03 : కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల కౌంటింగులో పరాజయం ఖరారు కావడంతో ఆయన తన ఫార్మ్ హౌస్ కి పయనమయ్యారు. సంప్రదాయం ప్రకారం ఆయన రాజీనామా లేఖను స్వయంగా గవర్నరుకు అందించాల్సి ఉంది. ఒక దశలో ఆయన రహస్యంగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందించారని ప్రచారం సాగింది. కాదు సాయంత్రం ఇస్తారని కాన్వాయ్ లేకుండానే వెడతారని వార్త చక్కర్లు కొట్టింది. వీటన్నింటికి చెక్ పెడుతూ సి.ఎం. రాజీనామా పత్రాన్ని ఓ.ఎస్.డి. ద్వారా గవర్నరుకు పంపారని తెలిసింది. ప్రగతి భవన్ నుంచి కె.సి.ఆర్. సొంత వాహనంలో ఎర్రవల్లిలో తన ఫార్మ్ హౌస్ కు వెళ్లిపోయారని సమాచారం.
ఫార్మ్ హౌస్ కి కె.సి.ఆర్.
Date: