సెప్టెంబర్ రెండో వారానికి రుణ మాఫీ పూర్తి

Date:

రైతాంగ సంక్షేమమే ప్రధాన లక్ష్యం
రైతు రుణమాఫీ పునః ప్రారంభం
వచ్చే నెల రెండో వారానికి పూర్తి చేయాలి
తెలంగాణ సిఎం కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 02 :
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సిఎం కేసీఆర్ తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్ లో బుధవారం నాడు సిఎం కేసీఆర్ గారు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సిఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హెచ్ఎండీఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. ‘‘ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల., కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణ కు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ది తో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మీము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సిఎం తెలిపారు. ఈకార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3 వ తేదీనుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలపదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సిఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/