జగన్నాథస్వామీ నయన పథగామీ

Date:

(మాడభూషి శ్రీధర్)

అందమైన విలాసంగా కట్టిన పట్టు వస్త్రం. ఆనందాన్ని పలికించే వేణువు. మధురమైన అనేకానేక ధ్వనులు వినిపించే వేణుమాధవుడు. తలపై నెమలి పింఛం. కనుకొనకులతో ఆనందాన్ని కల్పించి క్రీగంటి చూపుతో బృందావనంలో ఎప్పుడు విహరించే తీరైన ఓ కృష్ణా!  నాకు జీవిత మార్గదర్శకుడివి  కావూ అంటూ శ్రీ కృష్ణుడు కోరుకుంటున్నాడు.   దాని శ్లోకం ఇది.

భుజే సవ్యే వేణుం… శిరసి శిఖి పింఛం-

కటితటే దుకూలం-నేత్రాంతే సహచర కటాక్షం విదధతే॥

సదా శ్రీమత్ బృందావన వసతిలీలా పరిచయః

జగన్నాథస్వామీ నయన పథగామీ భవతు మే |

అది దర్శన పథం. జగన్నాథస్వామీ నయన పథగామీ అని సందేశం. ఇదీ శ్రీ జగన్నాథాష్టకమ్ నుంచి. మొత్తం అష్టకం స్తోత్రం చేయవలసినది.

నయనపథగామీ, స్వామీ

కదాచిత్కాళిందీ తటవిపినసంగీతకరవో

ముదా గోపీనారీవదనకమలాస్వాదమధుపః

రమాశంభుబ్రహ్మామరపతిగణేశార్చితపదో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే

దుకూలం నేత్రాంతే సహచరకటాక్షం విదధతే సదా

శ్రీమద్భృందావనవసతిలీలాపరిచయో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే

వసత్ప్రసాదాంతః సహజబలభద్రేణ బలినా

సుభద్రామధ్యస్థః సకలసురసేవావసరదో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

కృపాపారావారః సజలజలదశ్రేణిరుచిరో

రమావాణీసౌమ స్ఫురదమలపద్మోద్భవముఖైః

సురేంద్రైరారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

రథారూడో గచ్ఛన్పథి మిళితభూదేవపటలైః

స్తుతిప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః

దయాసింధుర్భంధుః సకలజగతాం సింధుసుతయా

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో

నివాసీ నీలాద్రౌ నిహితచరణో౬నంతశిరసి

రసానందో రాధాసరసవపురాలింగనసుఖో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

న వై ప్రార్థ్యం రాజ్యం న చ కనకతాం భోగవిభవం

న యాచే౬హం రమ్యాం నిఖిలజనకామ్యాం వరవధూమ్

సదా కాలే కాలే ప్రమథపతినా గీతచరితో

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే

హర త్వం సంసారం ద్రుతతరమసారం సురపతే

హర త్వం పాపానాం వితతిమపరాం యాదవపతే

అహో దీనానాథం నిహితమచలం నిశ్చితపదం

జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే 

జగన్నాధాష్టకం పుణ్యం యః పఠేత్ప్రయతః శుచి!

సర్వపాపవిశుధ్ధాత్మా విష్ణులోకం స గచ్ఛతి!!

జగన్నాథస్వామీ నయన పథగామీ అని జై జగన్నాథ అని పూజిస్తారు.  పూరీ జగన్నాథ చక్రాలను తిరిగించే రాబోయే రోజులు ఇవి.

శ్రీ కృష్ణార్జునుల కథ

మహాభారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడుతను దిగకుండా, అర్జునుడిని దిగమన్నాడట. రథి మర్యాదగా సారథి దిగకూడదని లెక్క. ఆ విధంగా అర్జునుడు ఆ విజయమంతా తనదేనని కొద్దిగా అహంకారాన్ని చూపుతాడు.   ఏమీ చెప్పకుండా, అర్జునుడుని దిగిన తరువాత ఆ జెండా మీదున్న ఆంజనేయుణ్ణి కూడా కిందికి రమ్మన్నాడు. ఆంజనేయుడు విన్నగానే వెళ్లిపోయాడు. ఆశ్చర్యం, అంతే అంత దివ్య రథమూ అలా చూస్తూండగానే భస్మమైపోయింది. శ్రీకృష్ణుడికి అర్థమయింది. అహంకారం సంగతీ తెలిసింది. కాలిపోయిన ఆ ధ్వజాన్ని, రథాన్ని, అహంకారాన్ని భస్మాన్నీ చూసిపోయారు. ఆ సంఘటనను ఆలోచించి, ఒక్కసారైనా ఈ కింద శ్లోకాన్ని చదువుకుంటూ ఉంటే జీవితాన్ని సరైన మార్గంలో నడిపించే బుద్ధి అనేదానికి సరైన మార్గం కన్పిస్తుందని చెప్తుంది.  

రధస్థ జగన్నాథుడిని చూస్తే పునర్జన్మ లేదు

ఉత్తరభారతంలో బదిరీనాథునిగా, దక్షిణాన రామేశ్వర రామునిగా, పశ్చిమంలో ద్వారాకా కృష్ణుడుగా, తూర్పున పూరీ జగన్నాథునిగా నిరంతరం సంచరిస్తూనే ఉంటాడు. ఆ ఊరేగుతున్న రథంలో జగన్నాథుణ్ణి చూస్తే మరో జన్మ ఉండదని

రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే

భావించి కేవలం రథంలో చూసి సంతృప్తిపడక శరీరమనే రథంలో హృదయస్థానంలో ఆయన్నిగాని కనులు మూసుకొని దర్శిస్తూ ఉండగలిగితే పునర్జన్మ ఉండదనేది ఈ చూడవలసిందనడంలో దాగిన రహస్యం అని పెద్దలు అంటున్నారు.

జగన్నాథుడు ఎక్కడున్నాడు? ఈయన ఉండేది ‘పూరీ’ కాదు. ‘పురి’లో, పుర మంటే శరీరంలో. ఆ పురంలో ఉండే జగన్నాథుడు.. ‘పురి’ జగన్నాథుడు. ఇంగ్లీషులో కూడా ‘PURI’ అంటారు. ఆ మాట పురీ-పూరి-పూరీ.. అని ఇలా ఎన్ని విధాలుగానై నా అపభ్రంశంగా పలికే అవకాశాన్నిస్తుందీ దేవభాష. ఆ భాషలో ఈ మాటను ఏ విధంగా రాసినా మరో తీరుగా చదివే అవకాశాన్నియ్యదు. ఆ కారణంగా ఈయన ఎవరికి వారికి తమతమ పురాల్లో శరీరాల్లో కన్పించ సిద్ధంగా ఉన్న జగన్నాథుడు కాబట్టే.

ఆ రథాలు మూడూ మనకుండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి సంకేతాలు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ఎక్కవలసిన మెట్లు 22 ఉంటాయి. హేనాథ! నారాయణ! వాసుదేవ! అనే ఈ నామాన్ని మెట్టుకొక్క మారు చొప్పున అనుకుంటూ ఎక్కాలి. పైశ్లోకంలో ఉన్న ఒక్కో పాదంలోనూ అక్షరాల సంఖ్య 11 మాత్రమే. మొత్తం రెండు పాదాల్లోనూ కలిపి 22. ఈ 22 పితృదేవతలకి సంకేతం. తనని కని పెంచి పోషించి ఓ ప్రయోజకుణ్ణి ప్రయోజకురాలిగా తీర్చిదిద్దిన ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందనిదే, నా వద్దకి రా(లే)వని దైవం ఎంతో స్పష్టంగా సూచిస్తున్నాడు. గతించిన తల్లిదండ్రుల్ని స్మరించుకోవాలనే బుద్ధిని ఎంత గొప్పగా సూచిస్తున్నాడో కదా దైవం! కొండ అద్దంలో కొంచెం గానే కన్పించేటట్టు అంత జగత్+నాథుణ్ణి గురించి ఎంత ఎంత ఎంతెంత వివరించుకున్నా అదంతా సశేషం తప్ప ముగింపు ఉండదు – లేదు అని శ్రీమాన్ విజరాఘవాచార్యుల వారు చెప్పారు.

అన్నమాచార్య సంకీర్తన

తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలో జగన్నాథుడిని ఈ విధంగా కీర్తిస్తున్నాడు.                                                                                               

॥పల్లవి॥ త్వమేవ శరణం త్వమేవ శరణం- కమలోదర శ్రీజగన్నాథా

॥చ1॥ వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీసతీశ సరసిజనేత్రా

భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా

॥చ2॥ బలభద్రానుజ పరమపురుష దుగ్ద- జలధినిహార కుంజరవరద

సులభ సుభద్రాసుముఖ సురేస్వర కలిదోషహరణ జగన్నాథా

॥చ3॥ వటపత్రశయన భువనపాలన జంతు ఘటకారకరణ శృంగారాధిపా

పటుతర నిత్యవైభవరాయ తిరువేం-కటగిరినిలయ జగన్నాథా

(రాగము: సింధుభైరవి, రేకు: 0063-02, సంపుటము: 1-323 పాడిన వారు: శ్రీ జి. నాగేశ్వర నాయుడు)

 ‘‘జగన్నాథుని రథచక్రాల్, రథచక్ర ప్రళయ ఘోష, భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను’’, అని శ్రీ శ్రీ అంటూ ‘‘జగన్నాథ, జగన్నాథ, జగన్నాథ రథచక్రాల్, జగన్నాథుని రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్, రథచక్రాల్ రారండో ! రండో ! రండి ! ఈ లోకం మీదేనండి ! మీ రాజ్యం మీ రేలండి’’ అని మహాప్రస్థానంలో శ్రీశ్రీ గర్జించినాడు. పూరీ జగన్నాథుడిని సంభోదించారు శ్రీశ్రీ.  అధికార అహంకారన్ని కూల్చమన్నాడు. మార్గదర్శనం చూపిన జగన్నాథుడు.

మాడభూషి శ్రీధర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/