వార్తను వార్తగా ఇస్తే అందులో గొప్ప ఏముంటుంది? ఆ వార్తలో గొప్పతనాన్ని చూపిస్తే కదా గొప్ప.
ఈ వార్త అలాంటిదే. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకుంటే జస్ట్ రిబ్బన్ కట్ చేసి వెళ్లిపోవచ్చు.
ఒక నాలుగు మాటలు మాట్లాడచ్చు. అంటే కదా.. అంతకు మించి చేస్తే అదే గొప్ప. ఎపి సీఎం జగన్ ఈ రెండో పని చేశారు.
ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రోగ్రాం (ఐ.ఎఫ్.పి) ప్రారంభ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఒక క్లాస్ రూంలోకి వెళ్లారు.
పిల్లలతో ముచ్చటించారు. జగనన్న విద్య కానుక కిట్స్ ను అందజేశారు. ప్రోగ్రాంలో భాగంగా పిల్లకు ఇచ్చిన టాబ్ లను పరిశీలించారు.
వారితో సెల్ఫీలు దిగారు. జగనన్న విద్య కానుక బ్యాగ్ తగిలించుకుని పోజ్ ఇచ్చారు. క్లాస్ రూంలో బెంచిపై వారితో కలిసి కూర్చున్నారు.
పిల్లలతో కలిసిపోయారు. పిల్లలతో గడిపితే ఎంత ఆనందంగా ఉంటుందో ఆస్వాదించారు.