నమ్మిన బంటుతో వాణిజ్య ప్రయోగానికి సిద్దం
(శ్రీధర్ వాడవల్లి – హైదరాబాదు)
శ్రీహరికోట, జులై 29 : పి.ఎస్.ఎల్.వీ వాహక నౌకను 1993 సెప్టెబర్ 20న తొలిసారి ప్రయోగించారు. ఎప్పటికప్పుడు ఆధునాత సాంకేతికతను అభివృద్ది చేస్తూ పి.ఎస్.ఎల్.వీ వాహక నౌకను ఇస్రో తన ఉపగ్రహ ప్రయోగాలకు వినియోగిస్తోంది. పి.ఎస్.ఎల్.వీ వాహక నౌక తో ఇప్పటి వరకు 439 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోనికి ప్రవేశపెట్టారు. 111 కు పైగా స్వదేశీ ఉపగ్రహాలు 328 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను మోసుకెళ్ళి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో విజయాశ్వంగా నమ్మిన బంటుగా గురి తప్పని ఆశల అస్త్రంగా సేవలందిస్తోంది.
పి.యస్.ఎల్.వి c- 56
విశ్వసనీయమైన విజయాశ్వం పి.యస్.ఎల్.వి వాహాక నౌకతో లక్ష్యాలవైపు విరామం లేకుండా పరుగు తీస్తోంది. ఈ ఆశల ఆస్త్రం పి.యస్.ఎల్.వి సింగపూర్, ఇస్రాయిల్ దేశాలకు చెందిన హమ్ డీఎస్ -ఎస్ ఏ ర్ అనే 351.9 కేజీలు బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైనది. అదేవిధంగా దీనితో పాటు 23. 58 కేజీలు బరువు ఉన్న ఆర్కేడ్ సాటిలైట్ మరియు 23 కేజీలు బరువు ఉన్న వెలాక్ -ఎ ఎమ్ సాటిలైట్ మరియు 12.8 కేజీలు బరువు ఉన్న ఆర్బు12 స్పైడర్ ఉపగ్రహాలతో పాటు మరో మూడు నానో ఉపగ్రహాలు, గెలుసియా-2 ,స్కూప్-2, మరియు నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.