సౌర వాతావరణంపై పరిశోధన
పది రోజుల వ్యవధిలో ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండరును సురక్షితంగా దించిన ఇస్రో తాజాగా సూర్యుడిపై పరిశోధనలకు నడుంకట్టింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఆదిత్య ఎల్ 1 ను శనివారం ఉదయం ప్రయోగించింది. ఇది నాలుగు నెలలపాటు ప్రయాణించి సౌర కక్ష్యను చేరుకుంటుంది. అయస్కాంత రేణువులు, ఇతర అంశాలపై ఇది ఐదేళ్లపాటు పరిశోధిస్తుంది. లెగ్రాంజ్ వన్ కక్ష్య లోకి ఆదిత్య ఎల్ 1 ప్రవేశపెడుతుంది. కరోనాగ్రఫీ పరికరంతో ఇది సూర్యుని వాతావరణాన్ని పరిశోధిస్తుంది. పిఎస్ఎల్వి సి 57 రాకెట్ ఎల్ వన్ ను 7 పే లోడ్స్ తో మోసుకెళుతోంది. 15 లక్షల కి.మీ. దూరం ఇది ప్రయాణిస్తుంది. సూర్యునిపై పరిశోధనకు ఇది ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం.
సూర్యునిపైకి ఇస్రో
Date: