బ్రిటన్ రాజకీయాలలో హిందూ కెర‌టం

Date:

ప్ర‌ధానిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు
వెయిట‌ర్ నుంచి యుకె అత్యున్న‌త ప‌ద‌వికి
రిషిపై కీల‌క బాధ్య‌త‌లు
(శ్రీధర్ వాడవల్లి, హైదరాబాద్)
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు కాని మనిషి గా వున్న ఈ రిషి తన కృషితో బ్రిటన్ ప్రధాన మంత్రి అయ్యారు. నవతర నాయకులకు మార్గదర్శి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వినా నాప చేనే పండుతుంది. బోరిస్ జాన్సన్, లీజ్ ట్రస్ రాజీనామాల తర్వాత, బ్రిటన్ దేశాన్ని గాడిలో పెట్టేందుకు సమర్త‌మైన, ప్రజ్ఞకలిగిన ప్రజాభిమానం చూరగొనే ఓ నాయకుడి అవసరం ఏర్పడింది. బ్రిటన్ చరిత్రలో ఓ ఆసియా సంతతి వ్యక్తి తొలిసారిగా ప్రధాని పీఠం అధిష్ఠిస్తున్నారు. భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా ఏకగ్రీవమై చరిత్ర సృష్టించారు. పంజాబీ నేపథ్యం, హిందూ మూలాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి కావడం బ్రిటన్ చరిత్రలో ఇదే ప్రథమం. రిషి సునాక్ ప్రధానమంత్రి అయ్యే క్ర‌మంలో అనేక పరిణామాలను చ‌విచూశారు. సరే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ముందు ఉన్న సవాళ్ళు ఏమిటి? వాటి పరిష్కారానికి ఆయన ముందున్న మార్గాలు ఏమిటి?


లిజ్ ట్రస్ చేతిలో ఇటీవ‌ల ఓటమిపాలయిన రిషికి 45 రోజులకే ఆ అవ‌కాశం ద‌క్కింది. లిజ్ ట్రస్ రాజీనామా నేపథ్యంలో, మళ్లీ రేసులోకి వచ్చిన మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రిషి సునాక్ జోరు ముందు నిలవలేకపోయారు. ఈ పరిణామాలపై బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికలు జరపాల్సిందేనంటూ పునరుద్ఘాటించింది. అటు, ఈ నెల 28న రిషి సునాక్ ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రిషి సునాక్ వివరాల్లోకి వెళితే రిషి సునాక్ తల్లిదండ్రులు ఉష, యశ్వీర్. వారి పూర్వీకులు టాంజానియా, కెన్యా వలస వెళ్లినట్టు తెలుస్తోంది. ఉష, యశ్వీర్ టాంజానియా, కెన్యా దేశాల నుంచి బ్రిటన్ కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. రిషి సునాక్ తండ్రి యశ్వీర్ డాక్టర్ కాగా, తల్లి ఉష ఓ మెడికల్ షాపు యజమాని. రిషి సునాక్ 1980 మే 12న ఇంగ్లండ్ లోని సౌథాంప్టన్ నగరంలో జన్మించారు. ఆర్థిక రంగాన్ని తన కెరీర్ గా ఎంచుకున్నారు. ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. ఆక్స్ ఫర్డ్ లో ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టాన్ ఫర్డ్ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నారు. రిషి సునాక్ 2001-04 మధ్యకాలంలో ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్ మన్ సాక్స్ లో అనలిస్ట్ గా పనిచేశారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో వివిధ ఫండ్ మేనేజ్ మెంట్ సంస్థల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో రాజకీయాలపై ఆసక్తితో కన్జర్వేటివ్ పార్టీలోకి వచ్చారు. కొత్త తరం నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రిచ్ మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యారు.


వెయిటర్‌గానూ పనిచేసిన రిషి
సునాక్ తన పాఠశాల విద్యను వించెస్టర్ కళాశాల నుంచి పూర్తి చేశారు. ఇది కనీసం ఆరుగురు ఛాన్సలర్‌లను తయారు చేసిన ప్రైవేట్ పాఠశాల కావడం గమనార్హం. రిషి వేసవి సెలవుల్లో సౌతాంప్టన్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా కూడా పనిచేశారు. తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను అధ్యయనం చేయడానికి ఆయన ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు.
భార‌త్‌కు అల్లుడు
కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుం డి ఎం బీఏ పట్టా పొం దాడు, అక్కడే అతనికి ఇన్ఫోసిస్ సహ వ్య వస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారి పెద్దలను ఒప్పిం చి పెళ్లి చేసుకున్నా రు.. మొత్తం గా.. ఇన్ఫో సిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌ ఇప్పు డు బ్రిటన్‌ ప్రధాని కాబోతున్నా రు.


రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి….
రిషి సునాక్ తొలిసారిగా 2015లో రిచ్‌మండ్ (యార్క్స్) నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017, 2019లో తిరిగి ఎన్నికయ్యారు. రిష.. థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. 2019లో బోరీస్ జాన్సన్ ఆయనను ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఫిబ్రవరి 2020లో ఛాన్సలర్ పదవికి పదోన్నతి పొందారు. . రిషి సునాక్ కరోనా సంక్షోభ సమయంలో ఆర్థికమంత్రిగా విశిష్ట సేవలు అందించి సత్తా చాటుకున్నారు. థెరెస్సా మే, బోరిస్ జాన్సన్ ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు చేపట్టి సమర్థుడిగా గుర్తింపు పొందారు. బ్రిటన్ లోని 250 సంపన్న కుటుంబాల్లో రిషి సునాక్ ఫ్యామిలీ ఒకటి. వీరికి 750 మిలియన్ పౌండ్ల సంపద ఉన్నట్టు అంచనా. ఆయన క్రికెట్, సాకర్, సినిమాలు, ఫిట్ నెస్ పై మక్కువ చూపిస్తారు. బ్రిటన్ ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌డుతున్న అత్యంత పిన్న‌వ‌య‌స్కుడు ఈయ‌న‌. బయట కూడా ఆయన తన మత సంప్రదాయాలను, విశ్వాసాలను ఆచరిస్తూ కనిపిస్తారు. 2015లో తొలిసారి బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికైనప్పుడు భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు.


రిషి జపించాల్సిన మంత్రాలివే…
మొన్నటిదాకా ప్రధాన మంత్రుల మార్పుతో ఇబ్బంది పడిన బ్రిటన్.. ఇప్పుడు రిషి సునాక్ రూపంలో మరో ప్రధానమంత్రిని ఎన్నుకున్నది. ఆయన ముందు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మొన్నటిదాకా సిరి సంపదలతో తులతూగిన బ్రిటన్ ఇప్పుడు సరికొత్త ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ రష్యా యుద్దం నేపథ్యంలో యూరప్ లో నింగిని తాకిన ఇంధన ధరలను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు కట్టడి విధిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే చలికాలానికి ఇంధనం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి తోడు ఏప్రిల్ నుంచి ఇంధన ధరలపై కట్టడి విధిస్తామని లీజ్ ట్రస్ గతంలో నిర్ణయం ఇంధన సంక్షోభానికి కారణం కావచ్చు దీనికి తోడు బడ్జెట్లో కోతలు, ఆర్థిక నిర్ణయాలను తిరగ తోడటం వంటి అపరిపక్వత చర్యల వల్ల సెప్టెంబర్ లోనే బ్రిటన్ మాంద్యం ఒక్కసారిగా 10% ఎగబాకింది. దీనివల్ల ఆహార ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయి. బ్రిటన్ ప్రజలు నిత్యావసర వస్తువులు మాంసం, చికెన్, మైదా, బ్రెడ్, ఇంధన ధరలు చుక్కలను అంటుతున్నాయి. ఇన్ని సమస్యల నేపథ్యంలో రిషి సనక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దాని పై అక్కడి ప్రజలు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. అయితే తాత్కాలిక ఉపశమనం ఇవ్వడం కంటే ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడమే తన తొలి ప్రాధాన్యమని రిషి సునక్ ప్రకటించారు.

ప్రపంచ దేశాలతో దౌత్య ఆర్దిక సంబంధాలను మెరుగుపరచుకుంటూ, సరళీకృత ఆర్దిక విధానాలను అమలు చేస్తూ తటస్ద వైఖరిని అవలంచిస్తూ విదేశీపేట్టుబడులను ఆకర్షించాలి. వివిధ దేశాలలో బ్రిటన్ పెట్టుబడులు పెట్టాలి. ముందుగా నిత్యావసరవస్తువుల ధరలను నియత్రించాలి. క్రూడ్ అయిల్ ఉత్పత్తి చేసే దేశాలతో వాణిజ్య మైత్రి పరిస్దితిని చక్కదిద్దుతుంది. ఉపాధి, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాలి. ప్రపంచ శాంతికి కృషిచేస్తూ, ఐక్యరాజ్య సమితిలో భద్రతామండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వానికి ఇచ్చే విషయంలో మద్దతు ఇవ్వాలి.ఉగ్రవాద నిర్మూలనకు, ఆర్దిక నేరాలు చేసి తలదాచుకొనే వారికి స్దానం కల్పించే విధానంలో మార్పులు తీసుకు రావాలి. ఆదాయపు పన్ను, వాణిజ్య పన్ను , కార్పోరేట్ పన్ను విధానాన్ని సమీక్షించి ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేయ్యలి.ఎగుమతి దిగుమతి సుంకాలని సవరించి వాణిజ్యానికి అనువైన వాతావణం కల్పిస్తే ఆర్దిక వ్యవస్ద గాడిన పడగలదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా మన జాతి నిండుగౌరమును కాపాడాలి . రిషి సునక్ తన అనుభవంతో మంత్రివర్గ సహచరుల సహాయంతో దేశ ప్రజల సహకారంతో బ్రిటన్ అర్దిక సామాజిక, రాజకీయ పరిస్దితులని చక్కచెడతాడని ఆశిద్దాం. దేశాభిమానం, న్యాయబద్ధత, కృషి అనే విలువల ఆధారంగా దేశాన్ని సరైన దిశలో నడిపిస్తానని సునక్ వాగ్దానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...