కీలకమైన మ్యాచ్ లో కివీస్ పై ఘన విజయం
నవి ముంబై, అక్టోబర్ 23 : కీలకమైన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. నవి ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. 341 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ మహిళల జట్టు చతికిలబడింది. 53 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 325 పరుగులను 44 ఓవర్లలో సాధించాల్సి వచ్చింది.

రెండు సెంచరీలు, మొదటి వికెట్టుకు రెండువందల పైచిలుకు భాగస్వామ్యం, మరొక హాఫ్ సెంచరీ… ఇదీ మహిళల ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ న్యూజీలాండ్ పై భారత మహిళల ఘనత. నవి ముంబైలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత మహిళలు సత్తా చాటారు. 49 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేశారు. ఇంకా రెండు ఓవర్లు మిగిలిఉండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. ఈ కారణంగా ఆటను 49 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు ప్రతీక రావల్ (13 ఫోర్లు, రెండు సిక్సర్లతో) 122 , స్మృతి మంథని (పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో) 109 , జెమిమా రోడ్రిగ్స్ (11 ఫోర్లతో) 76 పరుగులు చేశారు. తొలివికెట్ కు డబల్ సెంచరీ భాగస్వామ్యం ఇది ప్రపంచ కప్ లో మూడోసారి. అలాగే ఓపెనర్లు సెంచరీలు చేయడం కూడా మూడోసారి కావడం విశేషం. న్యూజీలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ న్యూజిలాండ్ కు 341 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సెమిస్ చేరాలంటే భారత్ కు ఇది చాలా కీలకమైన మ్యాచ్.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ తొలి ఓవర్ మూడో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. క్రాంతి గౌడ్ సుజి బెట్స్ ను ఒక పరుగుకు అవుట్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపింది. రెండో వికెట్ కు ప్లిమ్మెర్, కేర్ 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్లిమ్మెర్ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రేణుక సింగ్ ఠాకూర్ బౌలింగులో అవుటయింది. అనంతరం కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ కేర్ కు జత కలిశారు. 59 పరుగుల వద్ద ఠాకూర్ బౌలింగులో సోఫీ డివైన్ అవుటయ్యారు. కేర్ తో జత కలిసిన హాలిడే జట్టు స్కోరును 100 పరుగులకు 18 వ ఓవర్లో చేర్చారు. కేర్(45 ) 115 పరుగుల వద్ద నాలుగో వికెట్ గా అవుటయ్యారు. శాంతి రానా వేసిన ఇదే ఓవర్లో మందాన ఆమె ఇచ్చిన క్యాచ్ వదిలేశారు. మరుసటి బంతికే మందాన కేర్ ను పెవిలియన్కు పంపారు.
154 పరుగుల వద్ద గ్రీన్ అవుటయ్యారు. ప్రతీక రావల్ బౌలింగ్లో ఆమె ఇచ్చిన క్యాచ్ ని గౌడ్ పట్టారు. ఈ దశలో కివీస్ జట్టు 26 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉంది. ఫోర్త్ డౌన్లో వచ్చిన హాలిడే 59 బంతుల్లో యాభై పరుగులు సాధించారు. ఇందులో నాలుగు ఫోర్లున్నాయి. ఇంకా పది ఓవర్లున్న దశలో కివీస్ 13 .8 పరుగులు చేయాల్సి వచ్చింది. 35 వ ఓవర్లో గేజ్ చెలరేగి ఆది 16 పరుగులు చేసింది. ఇందులో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. బ్రూక్ హాలిడే 81 పరుగులకు శ్రీ బౌలింగులో రానా క్యాచ్ పట్టగా అవుయ్యారు. అప్పటికి స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 226 . గేజ్ 64 (9 fours) పరుగులు చేశారు. క్రాంతి బౌలింగులో జె. కెర్ 18 పరుగులకు అవుటయ్యారు. కివీస్ స్కోరు అప్పటికి ఏడు వికెట్ల నష్టానికి 266 .

