ఆసియా కప్ ఇండియాదే

1
315

ఫైనల్లో పాక్ చిత్తు
19 . 1 ఓవర్లలోనే ఆలవుట్ : చుక్కలు చూపించిన కులదీప్

అభినందనలు తెలిపిన సీఎం రేవంత్
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ ను ఓడించింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ టోర్నీలో దాయాదిని ఎదురుపడిన ప్రతిసారీ ఓడించింది. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ ను తిలక్ వర్మ, శాంసన్ జోడీ, తిలక్ వర్మ-శివమ్ దూబే జోడీ యాభై, 60 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు.

షహీన్ ఆఫ్రిది వేసిన తొలి ఓవర్లో రెండో బంతిని అభిషేక్ ఫోర్ కొట్టాడు. మొదటి ఓవర్ ముగిసేసరికి స్కోరు ఏడు పరుగులు. రెండో ఓవర్ మొదటి బంతికి అభిషేక్ అవుటయ్యాడు. ఫహీమ్ బౌలింగులో రవూఫ్ క్యాచ్ పట్టాడు. ఓవర్ ముగిసేసరికి స్కోరు వికెట్ నష్టానికి పది పరుగులు. ఆఫ్రిది వేసిన మూడో ఓవర్లో మూడో బంతికి సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. ఓవర్ ముగిసేసరికి ఇండియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి 12 . ఫహీమ్ వేసిన నాలుగో ఓవర్లో ఐదో బంతిని గిల్ ఫోర్ కొట్టాడు. ఓవర్ ముగిసేసరికి స్కోరు మూడు వికెట్ల నష్టానికి 20 పరుగులు. ఫహీమ్ బౌలింగులో గిల్ అవుటయ్యాడు. ఐదో ఓవర్ పూర్తయ్యేసరికి స్కోరు మూడు వికెట్ల నష్టానికి 25 . ఆరో ఓవర్లో తిలక్ వర్మ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టాడు. ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 36 . ఏడో ఓవర్ రెండో బంతిని తిలక్ బౌండరీకి తరలించాడు. ఓవర్ ముగిసేసరికి స్కోరు 42 . రవూఫ్ వేసిన ఎనిమిదో ఓవర్లో భారత్ మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు. పాకిస్తాన్ 6 .1 ఓవర్లకు యాభై పరుగులు చేయగా, ఇందుకు భారత్ 8 .1 ఓవర్లు తీసుకుంది. ఎనిమిదో ఓవర్ ముగిసే సమయానికి 54 పరుగులు. ఈ ఓవర్లో శాంసన్ ఇచ్చిన కాచ్ని పాక్ విడిచిపెట్టింది. పదో ఓవర్లో భారత్ స్కోర్ 58 పరుగులు. పదకొండో ఓవర్ రెండో బంతిని తిలక్ వర్మ సిక్సర్ కొట్టాడు. ఓవర్ ముగిసే సమయానికి స్కోరు మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు. పన్నెండో ఓవర్ ఐదో బంతిని శాంసన్ సిక్సర్ కొట్టాడు. ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు. పదమూడో ఓవర్లో శాంసన్ అబీరార్ బౌలింగులో ఫర్హాన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఓవర్ ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 78 పరుగులు. పద్నాలుగో ఓవర్లో భారత్ స్కోరు 83 పరుగులు. పదిహేనో ఓవర్ మొదటి బంతిని దూబే ఫోరుకు తరలించాడు. మూడో బంతిని తిలక్ ఫోరు కొట్టాడు. ఓవర్ ముగిసేసరికి స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి వంద పరుగులు. పదహారో ఓవర్ మొదటి బంతిని దూబే సిక్సర్ కొట్టాడు. తిలక్ వర్మ 41 బంతుల్లో యాభై పరుగులు(మూడు సిక్సులు, మూడు ఫోరులు) చేసాడు. ఓవర్ ముగిసే సమయానికి భారత స్కోరు 111 పరుగులు. పదిహేడో ఓవర్ ముగిసేసరికి స్కోరు 117 పరుగులు. మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉంది. పద్దెనిమిదో ఓవర్లో చివరి బంతిని దూబే సిక్సర్ కొట్టి స్కోరును 130 పరుగులకు చేర్చాడు. దూబే(28 ) – తిలక్(58 ) మధ్య 36 బంతుల్లో 53 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. రెండు ఓవర్లలో 17 పరుగులు చేయాల్సి ఉంది. ఫహీమ్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో ఏడు పరుగులు చేసింది. చివరి బంతికి దూబే అవుటయ్యాడు. చివరి ఓవర్లో తిలక్ వర్మ సిక్సర్ కొట్టాడు. మొదటి బంతి నో బాల్ అయ్యింది. రెండు పరుగులు తీశారు.

టి 20 లలో ఇప్పటి వరకూ 16 సార్లు పాకిస్తాన్ను ఓడించింది. ఇప్పటివరకూ భారత్ ఎనిమిదిసార్లు ఆసియా కప్ గెలుచుకుంది. ఇది వరసగా నాలుగోసారి. శ్రీలంక ఆరుసార్లు, పాకిస్తాన్ రెండు సార్లు గెలుచుకున్నాయి.

నాలుగు వికెట్లు పడగొట్టిన కులదీప్
టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్య స్థానంలో శివమ్ దూబే బౌలింగ్ ఎటాక్ ను ప్రారంభించాడు. తొలి ఓవర్లో పాక్ నాలుగు పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్ ఐదో బంతిని బౌండరీకి తరలించాడు.

రెండో ఓవర్ను బుమ్రా వేశాడు. మూడో బంతికి ఫర్హాన్ రెండు పరుగులు చేశాడు. ఐదో బంతికి బౌదరీ సాధించాడు. రెండో ఓవర్ ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా పాక్ పదకొండు పరుగులు చేసింది. ఈ ఓవర్లో బుమ్రా ఆరు పరుగులు ఇచ్చాడు.

దూబే వేసిన మూడో ఓవరులో తొలి బంతికి సింగల్ తీశాడు. చివరి బంతికి ఫోర్ కొట్టాడు. స్కోరు 19 . నాలుగో ఓవరులో తొలి బంతిని ఫర్హాన్ బౌండరీకి తరలించాడు. మూడో బంతిని సిక్సర్ గా మలిచాడు. ఈ ఓవరు ముగిసేసరికి స్కోరు 31 . ఐదో ఓవరును వరుణ్ చక్రవర్తి వేసాడు. తొలిబంతిని ఫేకర్ సింగల్ తీశాడు. రెండో బంతికి ఫర్హాన్ సింగల్ తీశాడు. నాలుగో బంతికి ఫేకర్ రెండు పరుగులు తీశాడు. ఓవర్ ముగిసేసరికి స్కోరు వికెట్ నష్టపోకుండా 37 . ఆరో ఓవరును అక్షర్ పటేల్ వేశాడు. నాలుగో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఐదో బంతికి ఒక పరుగు వచ్చింది. చివరి బంతికి ఫోర్ కొట్టారు. ఓవరు ముగిసేసరికి స్కోరు 45 . ఫర్హాన్ 32 , ఫేకర్ 14 పరుగులతో ఉన్నారు. ఏడో ఓవరును కులదీప్ యాదవ్ వేశాడు. 6 . 5 ఓవర్లకు యాభై పరుగులు పూర్తయ్యాయి. చివరి బంతిని సిక్సర్ కొట్టడంతో స్కోరు 57 కు చేరింది. కులదీప్ ఈ ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు. అక్షర్ వేసిన ఎనిమిదో ఓవర్లో పాక్ స్కోరు 64 . తొమ్మిదో ఓవర్ మొదటి బంతిని కులదీప్ వైడ్ వేశాడు. రెండో బంతికి సింగల్ తీశారు. ఫర్హాన్ యాభై పరుగులు (35 ) పూర్తిచేసాడు. ఈ ఓవర్ ముగిసేసరికి స్కోరు వికెట్ నష్టపోకుండా 77 పరుగులు. పదో ఓవర్ మూడో బంతిని ఫర్హాన్ సిక్సర్ గా మలిచాడు. ఈ తరవాత బంతికి 57 పరుగుల వద్ద వరుణ్ బౌలింగులో బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ క్యాచ్ పట్టడంతో ఫర్హాన్ అవుటయ్యాడు.

పాక్ స్కోరు పదో ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టానికి 87 పరుగులు.

పదకొండో ఓవరును దూబే వేశాడు. మూడో బంతిని సయీమ్ ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి కూడా ఫోర్ వచ్చింది. ఈ ఓవర్ ముగిసే సరికి స్కోరు వికెట్ నష్టానికి 98 . తిలక్ వర్మ వేసిన పన్నెండో ఓవరులో స్కోరు వికెట్ నష్టానికి 107 . ఫకర్ 33 , సైన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. కులదీప్ బౌలింగులో సయీమ్ (14 ) 113 పరుగుల వద్ద ఔటయ్యాడు. పదమూడో ఓవరు ముగిసే సరికి స్కోరు రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు. అక్షర్ పటేల్ వేసిన 14 వ ఓవర్లో హారిస్ ఔటయ్యాడు. ఈ క్యాచ్ ని రింకు సింగ్ పట్టాడు. తరవాత బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ అలీ అఘా సింగల్ తీశాడు. ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 118 . 15 వ మూడో బంతిని ఫకర్ సిక్సర్ కొట్టాడు. తరవాతి బంతికి 46 పరుగులకు జట్టు స్కోరు 126 వద్ద వరుణ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

ఓవర్ ముగిసే సరికి స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 128 .
అక్షర్ పటేల్ వేసిన పదహారో ఓవర్ మూడో బంతికి హుస్సేన్ వికెట్ కీపేరుకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అక్షర్ పటేల్ కు ఇది రెండో వికెట్. వరుణ్ చక్రవర్తికి కూడా రెండు వికెట్లు దక్కాయి. పాక్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 133 . కులదీప్ వేసిన 17 వ ఓవర్ మొదటి బంతికి సల్మాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ ఆరో వికెట్ కోల్పోయింది. ఈ క్యాచ్ కూడా శాంసన్ పట్టాడు. షహీన్ అవుటయ్యాడు. ఈ వికెట్ తో కులదీప్ నాలుగో వికెట్లు పడగొట్టాడు. ఈ ఓవర్ ముగిసే సరికి కులదీప్ మూడు వికెట్లు సాధించాడు. పాక్ స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 134 . బుమ్రా వేసిన 18 వ ఓవర్లో రవూఫ్ ఫోర్ కొట్టి స్కోరును 139 కి చేర్చాడు. 141 పరుగుల వద్ద రవూఫ్ బుమ్రా బౌలింగులో బౌల్డ్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 19 వ ఓవర్లో పాక్ స్కోరు తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులకు చేరింది. బుమ్రా వేసిన ఇరవయ్యవ ఓవర్లో 146 పరుగులకు ఆలవుటయ్యింది. వికెట్ నష్టానికి 113 తో పటిష్ట స్థితిలో ఉన్న పాక్ చకచకా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా 17 వ ఓవర్ పాకిస్తాన్ కు నిద్రపట్టనీయలేదు.

ఈ ఓవర్లో కులదీప్ మూడు వికెట్లు పడగొట్టి, పాక్ జట్టు వెన్ను విరిచాడు. బుమ్రా, వరుణ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు, కులదీప్ నాలుగు వికెట్లు పడగొట్టారు.

రేవంత్ శుభాకాంక్షలు
ఆసియ కప్ విజేత గా నిలిచిన భారత్ టీం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. ఈ అద్భుత విజయం సాధించడం లో కీలక పాత్ర పోషించిన
తిలక్ వర్మ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ లో మన తెలంగాణ రాష్ట్రాని కి గొప్ప పేరు.. గౌరవం తెచ్చారని అభినందనలు తెలిపారు.

1 COMMENT

  1. ఉత్కంట భరిత మైన మ్యాచులో ఉన్నత విజయాన్ని సాధించిన గ్రేట్ ఇండియా టీమ్ కు అభినందనలు 👌 👌👌👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here