షూట్ అవుట్లో 4 – 2 బ్రిటన్ పై గెలుపు
పారిస్, ఆగష్టు 04 :
పారిస్, ఆగష్టు 04 : ఒలిపిక్ హాకీ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చూపింది. 1 – 1 తో బ్రిటన్ జట్టుతో డ్రా చేసింది. షూట్ అవుట్లో నాలుగు రెండు తేడాతో గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించింది. భారత గోల్ కీపర్ అద్భుత ప్రదర్శన చూపి రెండు గోల్స్ అడ్డుకోవడంతో భారత విజయం ఖరారైంది. రెండో క్వార్టర్ ఎనిమిది నిముషాల ముప్పై ఐదు సెకండ్ వద్ద లభించిన పెనాల్టీ కార్నరును భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ గోలుగా మలిచారు. వెంటనే మూడో నిముషం వద్ద బ్రిటన్ ఈక్వలైజర్ నమోదు చేసింది. ఈ గోలు ఆటను రసకందాయంగా మార్చింది.
తొలి క్వార్టర్ లో ఆట నువ్వానేనా అన్నట్టు సాగింది… కానీ ఎవరికీ గోలు లభించలేదు. మూడో క్వార్టర్ తొమ్మిది నిముషాల దగ్గర లభించిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని ఇండియా సమర్ధంగా తిప్పికొట్టింది. భారత్ ఆటగాళ్లకు ఒక రెడ్ కార్డు, ఒక గ్రీన్ కార్డు లభించాయి. మ్యాచ్ మొత్తం ఒక ఆటగాడు లేకుండానే భారత్ ఆటను కొనసాగించింది. డ్రా కావడంతో షూట్ అవుట్ తప్పలేదు.