భారత్ నాలుగో వరుస విజయం
అభిషేక్ ధనాధన్ ఇన్నింగ్స్
కులదీప్ మూడు, బుమ్రా, వరుణ్ రెండేసి వికెట్లు
(Kvs Subrahmanyam)
దుబాయ్: దుబాయిలో బుధవారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్లో భారత్ బంగ్లాను చిత్తు చేసింది. 41 పరుగుల తేడాతో గెలుపొందింది. 127 బంగ్లాదేశ్ పరుగులు మాత్రం చేయగలిగింది.
సూపర్ ఫోర్స్ రెండో మ్యాచ్లో భారత జట్టు ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టాస్ గెలిచినా బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగే అభిషేక్ శర్మ ధాటిగా ఆడి 75 పరుగులు చేసాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శుభమాన్ గిల్ స్కోరు 77 పరుగులుండగా 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. అనంతరం హార్దిక్ పాండ్య 29 బంతుల్లో 38 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ తో కలిసి ఆరో వికెట్ కు 39 పరుగులు జోడించాడు. పవర్ ప్లే లో 72 పరుగులు సాధించిన భారత ఓపెనర్లు మొదటి యాభై పరుగులను ముప్పై బంతుల్లో సాధించారు.
బంగ్లా బౌలర్లలో షకీబ్, రెహ్మాన్, సైఫుద్దీన్ ఒక్కొక్క వికెట్, రిషద్ హుసేన్ రెండు వికెట్లు పడగొట్టారు.
169 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బాంగ్లాదేశ్ మొదటి ఓవర్లో నాలుగు పరుగులు చేసింది. సైఫ్ హాసన్, టాంజిద్ హాసన్ ఇన్నింగ్సును మొదలుపెట్టారు. రెండో ఓవర్ రెండో బంతికి బుమ్రా టాంజిద్ హాసన్ ను పెవీలియన్ దారి పట్టించాడు. రెండు ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు స్కోరు చేసింది. ఇందులో ఐదు పరుగు వైడ్ గా వచ్చాయి. మూడో ఓవర్లో తొలిబంతిని ఫోర్ కొట్టాడు. చివరి బంతిని సైఫ్ బౌండరీకి తరలించడంతో స్కోరు 19 కి చేరింది. నాలుగో ఓవర్ ముగిసే సమయానికి స్కోరు వికెట్ నష్టానికి 22 . ఐదో ఓవరును వరుణ్ చక్రవర్తి వేసాడు. మొదటి రెండు బంతులను ఎమోన్ ఫోరుకు తరలించాడు. నాలుగో బంతిని సైఫ్ ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్ పూర్తయ్యే సరికి స్కోరు 35 . ఎమోన్ పది పరుగులు, సైఫ్ 19 పరుగులు చేశారు. ఆరో ఓవర్లో మూడో బంతిని ఎమోన్ సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో బుమ్రా తొమ్మిది పరుగులిచ్చాడు. స్కోరు 44 కు, ఎమోన్ స్కోరు 19 కు చేరాయి.
ఏడో ఓవరును కులదీప్ వేసాడు. రెండో బంతిని హిట్ చేసిన ఎమోన్ అభిషేక్ శర్మకు చిక్కాడు.
రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులకు చేరింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన హృదయ్ తొలిబంతిని సింగల్ తీసాడు. ఎనిమిదో ఓవర్ ముగిసే సమయానికి స్కోరు 50 .తొమ్మిదో ఓవర్లో బంగ్లా దేశ్ స్కోరు రెండు వికెట్ల నష్టానికి 57 . పదో ఓవర్ రెండో బంతిని హ్రిదయ సిక్స్ కొట్టి మూడో బంతికి అక్షర్ పటేల్ బౌలింగులో అభిషేక్ శర్మ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. స్కోరు మూడు వికెట్ల నష్టానికి 65 .
పదకొండో ఓవర్ రెండో బంతిని సైఫ్ సిక్సర్ కొట్టాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగులో షమీమ్ సున్నా పరుగులకు అవుటయ్యాడు. స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 74 . ఈ దశలో కెప్టెన్ జాకీర్ అలీ బ్యాటింగ్ కు వచ్చాడు. 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సైఫ్ ఇచ్చిన క్యాచ్ ని అక్షర్ పటేల్ డ్రాప్ చేసాడు. అదే ఓవర్ ఐదో బంతిని సైఫ్ సిక్సర్ కొట్టాడు. పన్నెండు ఓవర్లు ముగిసే సమయానికి స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 85 . సైఫ్ స్కోరు 46 . 87 పరుగుల వద్ద జాకీర్ అలీ(4 ) రన్ అవుట్ అయ్యాడు.

14 ఓవర్ మొదటి బంతిని సిక్సర్ కొట్టి సైఫ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మూడో బంతిని మరో సిక్సర్ కొట్టి స్కోరును 62 కి చేర్చాడు. బంగ్లా స్కోరు ఐదు వికెట్ల నష్టానికి వంద పరుగులు.
పదిహేను ఓవర్లు ముగిసే సరికి స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 108 . పదహారో ఓవర్లో సైఫ్ ఇచ్చిన క్యాచ్ ని అభిషేక్ బౌండరీ లైన్ వద్ద జారవిడిచారు. తరవాత బంతి సైఫుద్దీనును తిలక్ వర్మ క్యాచ్ పట్టి పవెలియన్కు పంపాడు. అప్పటికి స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 109 . 16 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 112 . పదిహేడో ఓవర్ హుస్సేన్ కులదీప్ బౌలింగులో అవుటయ్యాడు. తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. వెంటనే మరో బంతికి టాంజిమ్ ను బౌల్ చేశాడు. అప్పటికి స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 112 . పదిహేడో ఓవర్లోనే సైఫ్(69) ఇచ్చిన మరో క్యాచ్ ని అభిషేక్ విడిచిపెట్టాడు. పదిహేడో ఓవర్లోనే సైఫ్ ఇచ్చిన మరో క్యాచ్ ని అభిషేక్ విడిచిపెట్టాడు. తరవాతి ఓవర్లో సైఫ్ ఇచ్చిన కాచ్ని అక్షర్ బౌండరీ దగ్గర పట్టుకున్నాడు. తొమ్మిదో వికెట్ గా అతను వెనుదిరిగాడు.

కులదీప్ మూడు వికెట్లు, బుమ్రా, వరుణ్ రెండు వికెట్లు, అక్షర్ ఒక వికెట్, తీశారు.

