తిరుమల ప్రక్షాళనకు వేళాయె

Date:

శ్యామల రావు నియామకం హర్షదాయకం
(వాడవల్లి శ్రీధర్)

“వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి” విశ్వంలో తిరుమలకు సాటియైన చోటు ఏ ఒక్కటీ లేదు. వేంకటేశ్వరునికి సమానమైన దేవుడు లేడు; ఇక ముందు ఉండడు అంటుంది స్కాంద పురాణంలోని వైష్ణవ ఖండం (వేంకటాచల మహాత్మ్యంలో). ఈ శ్లోకం వినగానే.. ఆ వెంకటేశుని నీడలో ఉన్నామన్న భావన ప్రతి భక్తుడికీ కలుగుతుంది.. దర్శించినంతనే సకల పాపాలను పోగొట్టే ఆ దేవదేవుడి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తులు పరితపిస్తుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు పరితపిస్తుంటారు. క్షణకాలం దొరికే ఆ దేవదేవుడి దర్శనభాగ్యం కోసం అనంత భక్త కోటి ఉవ్విళ్లూరుతుంటుంది. ఆపద మొక్కులవాడిని దర్శించుకుని తమ కష్టాలను చెప్పుకోవడానికి లక్షలాది మంది నిత్యం తిరుమల గిరులవైపు అడుగులేస్తుంటారు. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి. కలియుగాన వైకుంఠం శేషగిరులు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి శ్రీవారి ఆలయంలో నిత్యకల్యాణం పచ్చతోరణమే..
ధర్మ రక్షణకు ఎగనామం:
గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి ప్రటిష్ట మసక బారింది. హైందవ ధర్మ రక్షణ కేంద్రంగా భాసిల్లాసిన క్షేత్రం అన్య మత ప్రచారానికి తెర లేపింది . భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించిన ధనం వస్తువులు పెడ దారిన పడ్డాయి స్వామివారి బొక్కసాన్ని చేరకుండా పాలక పక్ష అస్మదీయుల ఆశీర్వాదాల కోసం ఆదాయాన్ని అందించే వనరుగా మారినాయి. శ్రీనివాసుడి పట్ల తరగని భక్తిప్రపత్తులతో ఆబాలగోపాలం సమర్పించిన కానుకల సొమ్మును జగన్ వందిమాగధులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. దేవుడి డబ్బును ఇష్టమొచ్చినట్లు వెచ్చించడానికి వీల్లేదంటూ ఆర్నెల్ల క్రితం ఏపీ హైకోర్టే ఆదేశాలివ్వాల్సి వచ్చేంతగా టీటీడీలో తిష్టవేసిన పెత్తందారులు చెలరేగిపోయారు. ఆగమ శాస్త్ర పద్దతులు స్వామి కైంకర్యాలను వాటిని సైతం నామ మాత్రంగా జరిపిస్తున్నారు అని ఎందరో పీఠాధిపతులు వాటిపై సూచనలు చేసినా పెడ చెవిన పెట్టిన వైనం గత ప్రభుత్వానిది. సిఫార్సు లేఖలతో రద్దీ సమయాలలోసైతం దైవ దర్శనాన్ని కల్పించాలని ఒత్తిడి ఆధికారులను నిస్సహాయులను చేసింది.
ధూర్త రాజకీయ విమర్శలు
పవితమైన కొండపై మాంస భక్షణం మద్యం విక్రయం యద్ధేచ్చగా సాగినాయి. నామ మాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకున్న తిరుమల రక్షణ విభాగం . దేవాలయ పై డ్రోన్ల సంచారం తిరుమల ఆలయ రక్షణ పై సందేహాలు రేకెత్తించినాయి. గోవిందా గోవిందా’ అనే భక్తకోటి శరణుఘోషతో మార్మోగాల్సిన పుణ్యక్షేత్రంలో ధూర్త రాజకీయ విమర్శలు, చిల్లర వ్యాఖ్యలకు దిగారు. తితిదేకు పెద్దదిక్కు వంటి కీలక పోస్టులో గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించేవారు. ఆ సంప్రదాయాన్ని కాలదన్నిన జగన్ సర్కారు- తమకు కావాల్సిన అధికారిని దిల్లీ నుంచి డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి మరీ తితిదే పై సర్వాధికారాలు కట్టబెట్టింది. వెంకన్న స్వామికి కాదు, వైకాపాకు సేవకుడిగా పనిచేసిన ఆయన తన యజమాని చీకటి వ్యవహారాలెన్నింటినో చక్కబెట్టారు. తితిదే పాలకమండలిలో నేరచరితులకు పెద్దపీట వేసిన జగన్- శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచారు జలప్రసాదంలో, వెంగమాంబ అన్నదాన సత్రంలో అందిస్తున్న ఆహారంలో శుచీ శుభ్రతలు లేవని, ఆరోగ్య ప్రమాణాలను పాటించడం లేదని కొద్దినెలల క్రితం కేంద్ర హోంశాఖ నిపుణుల బృందమే తేల్చిచెప్పింది.

ఇఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు

మనోభావాలను రక్షించే సుదర్శన చక్రం కావాలి:
తిరుపతికి పూర్వ వైభవం తీసుకు రావాలి ఆ దిశగా తితిదేను సంపూర్ణంగా సంస్కరిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించటం తితిదే నూతన ఈవోగా జె. శ్యామలరావును నియమించడం ముదావహం.

ఆగమ శాస్తాలను ఆనుసరిస్తూ అన్ని క్రతువులు య్జా యాగాలు ఉత్సవాలు జరగాలి. పురాతన కట్టడాలను పరిరక్షించాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశలో కొత్త నిర్ణాణాలు చేపట్టటానికి వీలుగా మాస్టర్ ప్లాను రూపొందించాలి. ఆధ్యాత్మిక పర్యాతక క్షేత్రంగా తిరుపతిని అభివృద్ధి చెయ్యాలి. పర్యావరణ పరిరక్షణ ఆటవీ సంపదను ఓషష వనాలని అభివృద్ది చెయ్యాలి. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుమలను తిరుపతిని తీర్చిదిద్దాలి. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ను అన్నమాచార్య ప్రాజెక్టు ను పునర్వవస్దీకరించి ధార్మిక గ్రంధాలను అన్నమా చార్య కీర్తనలు ప్రచారం చెయ్యాలి. భక్తులు వేచి వుండే కంపార్టు మెంట్ లో పెద్ద తెరలపై తిరుపతి ప్రాశస్త్యాన్ని తెలియ పరిచే డాక్యు మెంటరీలు భారత రామాయణాలు ప్రసారం చెయ్యాలి. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కార్యక్రమాలను సమీక్షించి భక్తుల అభిష్టంగా తీర్చిదిద్దాలి.

తిరుమల తిరుపతి దేవస్దాన ప్రచురణలు , ప్రసాదం రాష్ట్రంలోని జిల్లా ముఖ్య కేంద్రాలతో పాటు ప్రధాన నగరాలలో అందుబాటులో వుంచాలి విజయవాడ రైల్వే స్టేషన్, విమానాశ్రయంలో సమాచార కేంద్రాలని విక్రయ కౌంటర్లని తెరవాలి. దర్శనానికి ఆర్జిత సేవలకు గదుల కేటాయింపుకు నూతన సంకేతికతను జోడించాలి పారదర్శకంగా నిర్వహించాలి. తిరుమల తిరుపతి పాలక వర్గంలో రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా పరిపాలనా ఆర్ధిక భద్రత నిపుణులను పర్యావరవరణ వేత్తలను అధ్యాత్మిక ప్రతినిధులకు చోటు కల్పించాలి.

తిరుమల తిరుపతి దేవాస్దాన ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలి. వారి జీతభత్యాలు బకాయిలు చెలిస్తే వారు అంకిత భావంతో పనిచేస్తారు. వారికి ఇళ్ళ స్దలాల కేటాయింపు పదవీ విరమణ బకాయిలు సకాలంలో చెల్లించాలి. ఉద్యోగులలో ధార్మిక తత్వం సేవానిరతి , జవాబుదారీ తనాన్ని పెంచాలి. తిరువేంకటాచలంలో చీడపురుగులను ఏరిపారేసే ప్రక్షాళన యజ్ఞం ఇక వేగవంతం కావాలి!
(వ్యాస రచయిత ప్రముఖ విశ్లేషకుడు)

1 COMMENT

  1. ఓం నమో వేంకటేశాయ…
    తిరుమలలో మార్పు మొదలైంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పీవీ తెలుగు ఠీవి

నేడు భారతరత్న పీవీ నరసింహారావు జయంతి (వాడవల్లి శ్రీధర్)చరిత్రకు ఓ చెడ్డపేరుంది- అదెప్పుడూ...

Why BJP faces resistance in some states?

(Dr Pentapati Pullarao) In the 2024 elections, the BJP made...

ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమేఅధికారిక సమాచారంకాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎంహైదరాబాద్, జూన్...

అమరావతి ఆంధ్రుల ఆశల ఆకృతి

(వాడవల్లి శ్రీధర్)అ) అమరావతి (ఆ) ఆంధ్రప్రదేశ్ రెండూ అక్షర క్రమంలో రాజధాని...