మణిపూర్ ఘటనపై దేశానికి నేను జవాబుదారీ
లోక్ సభలో అమిత్ షా
మణిపూర్ హింసపై విచారం
హింసను రాజకీయాలకు ఉపయోగిస్తారా
న్యూ ఢిల్లీ, ఆగస్టు 09 : సింహం ఒక్కసారిగా మేకల మందపై విరుచుకుపడితే ఎలా ఉంటుందో దేశం యావత్తు ఇవాళ చూసింది. పార్లమెంటులో అయితే అధికార పక్ష హర్షధ్వానాలు, చప్పట్లు తప్ప ఏమీ వినిపించలేదు. ప్రతిపక్షం సైలెంటైపోయింది. వారి వద్ద అందుకు సమాధానమే లేకపోయింది.
ఇదంతా ఇవాళ అవిశ్వాస తీర్మానం సందర్భంగా హోమ్ మంత్రి అమిత్ షా ప్రసంగ సమయంలో కనిపించిన దృశ్యం. అమిత్ షా ప్రసంగంలోని ముఖ్య అంశాలు.
- మోడీ ఇచ్చిన క్విట్ ఇండియా పిలుపును అందరూ మన్నించాలి.
- వోట్ బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పేదవారిని ఉపయోగించుకుంది.
- అవినీతి కాంగ్రెస్ క్యారక్టర్.
- దేశీయంగా తయారైన కోవిద్ వాక్సిన్ ను ప్రతిపక్షం వ్యతిరేకించింది.
- ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రతిపక్షం అవిశ్వాసం పెట్టింది.
- అధికారాన్ని రక్షించుకోవడానికి యు.పి.ఏ. కృషి చేసింది.
- యు.పి.ఏ. హయాంలో తీవ్రవాదం పడగా విప్పింది.
- ఎన్.డి.ఏ. హయాంలో అక్కడ హింస 68 % తగ్గింది.
- కాంగ్రెస్ అన్ని విలువలనూ కోల్పోయింది. ఆ పార్టీకి నైతికత లేదు.
- ఈశాన్య రాష్ట్రాల్ని యు.పి.ఏ. పట్టించుకోలేదు..
- మోడీ ఆ రాష్ట్రాలకు యాభై సార్లు వెళ్లారు.
- ప్రధాని మంచి రాజకీయాలను ప్రోత్సహించారు.
- ఉచితాల ఆధారిత రాజకీయాలకు మేము వ్యతిరేకం
- అవినీతి, వారసత్వ రాజకీయాలను మోడీ తుత్తునియలు చేశారు.
మణిపూర్ హింసపై షా విచారం వ్యక్తం చేశారు. హింసను రాజకీయాలకు ఉపయోగించుకుంటారు అంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. మణిపూర్ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మే మూడో తేదీ దాకా మణిపూర్లో కర్ఫ్యూ లేదన్నారు. ఆరేళ్ళ పాలనలో అక్కడ కర్ఫ్యూ లేదని చెప్పారు. మణిపూర్ పై చర్చించకుండా ప్రతిపక్షం పారిపోయిందన్నారు. పది కి.మీ. మేర ఇండో – మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తయ్యిందని చెప్పారు. సరిహద్దులో మౌలిక సౌకర్యాలపై తాము దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. భౌగోళికంగా ఉన్న ఉద్రిక్తల కారణంగానే మణిపూర్లో హింస చెలరేగింది షా తెలిపారు.
1993 లో జరిగిన ఘర్షణల సమయంలో హోమ్ శాఖ సహాయ మంత్రి మణిపూర్ వెళ్లారని… ఇప్పుడు ప్రతిపక్షం ప్రధాని వెళ్లాలని అంటోందని ఎద్దేవా చేశారు. మణిపూర్ ఘటనపై దేశానికి నేను జవాబుదారీ అన్నారు. ఈ అంశంలో దాచిపెట్టిన అంశం ఏదీ లేదన్నారు షా. అక్కడ శాంతి నెలకొల్పడానికి చేయాల్సిందంతా చేస్తున్నామన్నారు. జాతుల మధ్య వైరాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.