కాన్సర్ రాకుండా ఉండాలంటే… ఇవి మానెయ్యండి

Date:

ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లు తాగుతున్నారా?
నిత్యం మద్యం సేవిస్తున్నారా?
ఫిబ్రవరి నాలుగు గ్లోబల్ కాన్సర్ కంట్రోల్ డే
(డాక్టర్ ఖలీల్)
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అనేది క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణను ప్రోత్సహించడానికీ, గ్లోబల్ క్యాన్సర్ మహమ్మారిని పరిష్కరించడానికీ, చర్యను సమీకరించడానికీ ప్రతి ఫిబ్రవరి 4న అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. UICC (The union for cancer control) నేతృత్వంలో ఈ దినోత్సవ నిర్వహణను 2000 సంవత్సరంలో ప్రారంభించారు. UICC ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలు వీక్షించేలా చూస్తోంది. UICC ప్రపంచవ్యాప్తంగా తన సభ్యుల విభిన్న సంస్థాగత ప్రాధాన్యతలను అందించే ప్రచారాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని చేస్తుంది. 

గ్లోబల్ వరల్డ్ క్యాన్సర్ డే సందేశానికి అనుగుణంగా స్థానిక క్యాన్సర్ అవగాహన ప్రచారాలను అమలు చేయడానికి UICC దాని సభ్య సంస్థలను ప్రోత్సహించడానికి సాధనాలనూ, మార్గదర్శకాలను అందిస్తుంది. దేశానికి ఎగువన ఉన్న స్థాయిలో, UICC డిజిటల్, సాంప్రదాయ, సోషల్ మీడియా అవకాశాలను వినియోగించుకుని రోజు ప్రజల్లో అవగాహన పెంచడానికి పనిచేస్తుంది. సభ్యులు, ముఖ్య భాగస్వాముల నిరంతర మద్దతు ద్వారా, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా క్యాలెండర్లలో దృఢంగా స్థిరపడింది.

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025-2027 యొక్క థీమ్ “యునైటెడ్ బై యూనిక్” (United by Unique), ఇది ప్రజల-కేంద్రీకృత క్యాన్సర్ సంరక్షణకు విభిన్న కోణాలనూ, వైవిధ్యాన్నీ సృష్టించే కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. అవగాహన పెంపొందించడం నుండి చర్య తీసుకోవడం వరకూ, సంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పే సమిష్టి వ్యవస్థను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ‘యునైటెడ్ బై యూనిక్’ అనే నినాదం ప్రజలకు ప్రత్యేకమైన కథలు, అవసరాలు, దృక్పథాలు, సంరక్షణ, ఆరోగ్య వ్యవస్థలను రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన పరిస్థితులున్నాయి. క్యాన్సర్ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరూ తమ లక్ష్యంలో ఐక్యంగా ఉన్నారు. ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం, క్యాన్సర్‌పై పోరాటంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తుంది. ఈ రోజు క్యాన్సర్ నివారణ , గుర్తించడం, చికిత్స గురించి అవగాహనను పెంచుతుంది, ముందస్తు రోగ నిర్ధారణ ప్రాముఖ్యతను చాటుతుంది.
క్యాన్సర్ ప్రజల ఆరోగ్యానికి పెద్ద సవాలుగా మారింది. శరీరంలోని కణాలు అనియంత్రితంగా పెరిగి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించడం కాన్సర్ కరకం. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ పై అవగాహన పెంచడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించడం, నివారణ చర్యలు చేపట్టడం చాలా ముఖ్యం.

క్యాన్సర్ అనే పదం వింటే చాలు ఒక రకమైన ఆందోళన మనలో కలుగుతుంది. ఇది ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చాలా మంది భావిస్తుంటారు. కానీ, 1970 కాలం నుంచి ఈ వ్యాధి బారిన పడినవారు కోలుకుంటున్న రేటు మూడింతలు పెరిగింది. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తించడమే దీనికి కారణం. వాస్తవంగా చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం ద్వారా రోగులు ప్రాణాలతో బయటపడుతున్నారు. సమస్యేంటంటే ఈ వ్యాధి సోకిన చాలా మంది డాక్టర్లు చెప్పే మాటలు సరిగా వినిపించుకోవడం లేదు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ రీసెర్చ్ యూకే అనే సంస్థ చేపట్టిన అధ్యయనంలో, బ్రిటన్‌లో సగం కంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉనికిని సూచించే లక్షణాలలో ఒకదానితో బాధపడుతున్నారని తెలిసింది. 2 శాతం మంది మాత్రమే తమకు వ్యాధి ఉన్నట్లు అనుకుంటున్నారని, మూడొంతుల మందికి పైగా ప్రజలు ఈ ప్రమాద సంకేతాలను పట్టించుకోవడం లేదని క్యాన్సర్ రీసెర్చ్ యూకే అధ్యయనం పేర్కొంది. లక్షణాలను పట్టించుకోకుండా ఉండి, డాక్టర్ల వద్దకు వెళ్లడం లేదని తెలిపింది. ఎందుకంటే, వారు డాక్టర్ వద్దకు వెళ్లడాన్ని టైమ్ వేస్ట్‌గా, ఆరోగ్య వ్యవస్థలోని వనరులను వారు అనవసరంగా వాడుతుంటారని భావిస్తుంటారు’’ అని యూనివర్సిటీ కాలేజీ లండన్‌లోని రీసెర్చర్, పరిశోధనా ప్రముఖ రచయిత కత్రినా విటేకర్ అన్నారు.
కాన్సర్ తెలుసుకునే లక్షణాలు ఇవీ…
అతిగా బరువు తగ్గిపోవడం
క్యానర్స్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతుంటారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చు. పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది.

జ్వరం
క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరమనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర్నుంచి ఇతర అవయాలకు, శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో జ్వరం బారిన పడతారు. ముఖ్యంగా క్యాన్సర్, దాని చికిత్సలు రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుంటాయి. ఈ ప్రభావంతో క్యాన్సర్ ఉన్న రోగులు జ్వరం బారిన పడుతూ ఉంటారు. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణం.
అలసట
క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి అలసట. ఇది విపరీతంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు. క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతంగా ఉంటోంది. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే తొలి లక్షణంగా ఉంటోంది. పెద్ద పేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయి. ఆ సమయంలో కూడా అలసట అనేది సాధారణం.
చర్మ క్యాన్సర్లతో పాటు, కొన్ని ఇతర క్యాన్సర్లు కూడా శరీరంలో మార్పులకు కారణమవుతాయి. ఈ సంకేతాలు, లక్షణాల్లో కొన్ని:
శరీర రంగు నల్లగా మారిపోవడం(హైపర్‌పిగ్మెంటేషన్)
శరీర రంగు, కళ్లు పసుపు పచ్చగా మారడం(జాండిస్)
చర్మం ఎర్రగా మారడం, దురద రావడం
బాగా జుట్టు పెరగడం
ప్రేగు, మూత్రాశయ తీరులో మార్పులు మలబద్ధకం, డయేరియా, ఎక్కువ కాలం పాటు మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రాశయ తీరులో మార్పులు అంటే పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం లేదా తక్కువగా వెళ్లడం వంటివి బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించి ఉండొచ్చు.
గాయాలు మానకపోవడం పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్‌ లక్షణాలని చాలా మందికి తెలుసు. కానీ, చిన్న చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతాలని మనం తెలుసుకోవాలి.
నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం చిన్న గాయాలు మానకపోతే వాటిపై దృష్టిపెట్టాలి. నోటి క్యాన్సర్ వల్ల నోట్లో పుండు కూడా త్వరగా మానదు. మీ నోట్లో దీర్ఘకాలం పాటు ఏదైనా మార్పులు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను లేదా డెంటిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. పురుషాంగం లేదా యోనిపై పుండ్లు కూడా ఇన్‌ఫెక్షన్‌కు లేదా ప్రారంభ దశలోని క్యాన్సర్‌కు సంకేతాలు. డాక్టర్ల దగ్గరికి వెళ్లి, వీటిని చూపించుకోవాలి.
రక్తస్రావం ఒకవేళ మలంలో రక్తం పడితే, అది పెద్ద పేగు క్యాన్సర్‌కు లేదా మల క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. ఎండోమెట్రియంకి చెందిన గర్భాశాయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కూడా అవుతుంది. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం. చనుమొనల నుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి.
శరీరంలో ఏదైనా భాగం గట్టిగా మారిపోవడం చర్మంలో మార్పుల ద్వారా మనం చాలా క్యాన్సర్లను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో, వృషణాలు, గ్రంథులు, కణజాలల్లో ఏర్పడుతుంటాయి. క్యాన్సర్‌ను ప్రారంభంలో లేదా చివరి దశలో గుర్తించే సంకేతాల్లో ఒకటి ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోవడం.
మింగడం కష్టమవ్వడం ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, అవి అన్నవాహిక క్యాన్సర్‌కు, కడుపు క్యాన్సర్‌కు లేదా గొంతు క్యాన్సర్‌కు సంకేతంగా చూడొచ్చు.
విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం విపరీతంగా దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం. మూడు వారాలకు మించి దీని వల్ల ఇబ్బంది పడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్‌కు గొంతు బొంగురుపోవడం కూడా ఒక లక్షణంగా ఉంటుంది.

కాన్సర్ కలిగించే ఆహార అలవాట్లలో మార్పులు కలుగుతాయి. అవేంటో తెలుసుకోవాలంటే కింద విషయాలు తెలుసుకోవదం ఉత్తమం..
క్యాన్సర్ రిస్క్ ఫుడ్స్/ఐటమ్స్:
ప్రాసెస్డ్​ మీట్ ప్రాసెస్డ్​ మీట్ తినేవారికి క్యాన్సర్ తప్పక వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాసేజ్‌లు, హాట్‌డాగ్‌, బర్గర్స్, బేకన్ వంటి ప్రాసెస్​ చేసిన మాంసాలు క్యాన్సర్​ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలలో నైట్రేట్లు అధికంగా ఉంటాయని.. ఇవి నైట్రోసమైన్‌లు(Nitrosamines) అని పిలువబడే కార్సినోజెనిక్ (carcinogenic) సమ్మేళనాలను ఏర్పరుస్తాయని అంటున్నారు. క్యాన్సర్‌కు కారణమైన వాటిల్లో ఇది ఒకటి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్ద పేగు క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.
రెడ్​ మీట్స్ అధిక ఉష్ణోగ్రతల వద్ద రెడ్‌ మీట్‌ ఉడికించడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (హెచ్‌సిఎలు-Heterocyclic amines), హైడ్రోకార్బన్‌లు (Hydrocarbons) వంటి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది పెద్దపేగు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
చక్కెర పానీయాలు సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, జ్యూసులు వంటి చక్కెర పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయని.. అలాగే ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి రొమ్ము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌(National Library of Medicine రిపోర్ట్​)తో సహా అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అధిక చక్కెర వినియోగం శరీరంలో మంట,ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ప్రోత్సహిస్తుందని హెచ్చరిస్తున్నారు.2012లో “బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌” (British Journal of Cancer) లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్​స్టిట్యూట్​లో న్యూట్రిషన్ ఎపిడెమియాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుసన్నా సి.లార్సన్ పాల్గొన్నారు.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, చక్కెర తృణధాన్యాలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదానికి దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
వేయించిన ఆహారాలు అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, డోనట్స్‌లు అక్రిలమైడ్ (acrylamide) అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా వివిధ రకాల క్యాన్సర్​ రిస్క్​లను పెంచుతుందని అంటున్నారు.
కృత్రిమ స్వీటెనర్లు ఆర్టిఫీషియల్​ స్వీటెనర్లు కూడా క్యాన్సర్​ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు జీర్ణమయ్యేటప్పుడు పలు రసాయనాలను విడుదల చేస్తాయని.. ఇవి కణాలకు హాని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకేజ్డ్​ ఫుడ్స్​ వంటి అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెరలు కలిగి ఉంటాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని.. తద్వారా క్యాన్సర్​ ప్రమాదాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు.
అధిక సోడియం ఆహారాలు ఇన్​స్టంట్​ సూప్‌లు, ఉప్పగా ఉండే స్నాక్స్ వంటి అధిక సోడియం ఆహారాలు.. అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడానికి దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం సోడియం తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నిత్యం మద్యం తాగడం వల్ల రొమ్ము, కాలేయం, అన్నవాహిక క్యాన్సర్‌తో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్‌లో క్రియాశీలక భాగం అయిన ఇథనాల్.. సెల్యులార్ డ్యామేజ్‌ని కలిగిస్తుందని.. పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు.
Plastics మానవ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు ప్లాస్టిక్‌ల నుండి వచ్చే రసాయనాలు కాలక్రమేణా నీటిలోకి వెళ్లి మీ రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి.
ప్లాస్టిక్ వాటర్ క్యాన్లను ఉపయోగించడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆందోళన, జీర్ణ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి పరిస్థితులు వస్తాయి.
మన రోగనిరోధక వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్‌లోని రసాయనాలు శరీరం రోగనిరోధక చర్యలకు అంతరాయం కలిగిస్తాయి.


సూర్యరశ్మికి ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఉండటం వలన డయాక్సిన్ అనే హానికరమైన టాక్సిన్ విడుదల అవుతుంది. ఇది తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లలో థాలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. వాటి నుండి నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్, తక్కువ స్పెర్మ్ కౌంట్ వస్తుంది.
ప్లాస్టిక్ వాటర్ క్యాన్‌లు ఈస్ట్రోజెన్‌ను అనుకరించే బిస్ఫినాల్ A (BPA) అనే రసాయనాన్ని నిర్మించగలవు. రక్తప్రవాహంలోకి ప్రవేశించగల BPA వంటి పదార్థాలు మీ కణాలకు హాని కలిగించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


నాన్ స్టిక్‌ నాన్ స్టిక్‌పై ఉండే టెఫ్లాన్‌ను కార్బన్, ఫ్లోరిన్‌ను కలిపి తయారు చేస్తారు. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణమవుతుందని పరిశోధనలు రుజువు చేసాయి. అయితే దీనికంతటికీ కారణమయ్యే టెఫ్లాన్ మాత్రం ఆరోగ్యానికి చాలా హానికరమని అంటున్నారు. పురుషుల్లో, స్త్రీలలో సంతానలేమి సమస్యలను కూడా తీసుకొచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, క్రోనిక్ కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధి, వచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

కాలక్రమేణా మరణాల రేటు పెరుగుతున్న దృష్ట్యా క్యాన్సర్ రాకూడదంటే జీవనశైలిలో ఈ మార్పులు తప్పనిసరిగా చేయించుకోవాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
ఆహారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఆహారంలో మూడింట రెండువంతులు శాకాహారం ఉండాలి. ఆహారంలో ఎన్ని రంగుల కూరగాయలు, పండ్లు ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. ఫైటో కెమికల్స్, యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, పైబర్ సమృద్దిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, కారం, బేకింగ్ ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఒత్తిడి నేటికాలంలో చాలామంది ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒత్తిడి తీసుకునే ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు అధికంగా తినడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినాలని అనిపించడం, స్వీట్లు, ఉప్పు, కారం ఎక్కువ తినడం జరుగుతుంది. అదే విధంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి సాధ్యం కాదు. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే అంశం.
మంచి నిద్ర ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. నాణ్యమైన నిద్ర శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, డిప్రెషన్ వంటి సమస్యలు జయించాలంటే 7గంటల నిద్ర తప్పనిసరి. నిద్ర గడియారం పనితీరు దెబ్బతింటే రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ లు తొందరగా వస్తాయి.
శారీరక శ్రమ ప్రతిరోజూ అరగంట పాటూ క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గడానికి, శరీరంలో హార్మోన్లు ఉత్పత్తి ఆరోగ్యంగా ఉండటానికి, మెదడు పనితీరుకు సహకరించే ఎండార్ఫిన్ల విడుదలకు అనువుగా ఉంటుంది. పాజిటివ్ గా ఆలోచించడానికి, ఉల్లాసంగా ఉండటానికి ఇది తోడ్పడుతుంది.

మద్యపానం, ధూమపానం వ్యసనంగా మారి క్యాన్సర్ బారిన పడేలా చేస్తాయి. ఆహారం నుండి నిద్ర, ఒత్తిడి, శారరీక శ్రమ వంటి ఎన్నో విషాలను కేవలం ధూమపానం, మద్యపానం ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

క్యాన్సర్ నిర్ధారణకు తరచుగా వైద్యులు శస్త్రచికిత్స, కిరణ చికిత్స, రసాయన చికిత్స, ఇమ్యూన్ థెరపీ, హార్మోనల్ థెరపీ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. దీనితో, సమయానికి క్యాన్సర్‌ను గుర్తించినట్లయితే, ఈ చికిత్సలు మరింత విజయవంతంగా పని చేస్తాయి. క్యాన్సర్ నివారణ కోసం కొన్ని కీలకమైన మార్గాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమంగా వ్యాయామం చేయడం, ధూమపానం తీయడం, ఆల్కహాల్ పరిమితంగా తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించడం ఇవి ముఖ్యం. ఈ సాధారణ మార్గాలను అనుసరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
చివరి మాటగా…
పూర్తిగా క్యాన్సర్ లేని మానవత్వం అనేది కనీసం మన జీవితకాలంలో అయినా కష్టమైన లక్ష్యం అన్నది నిజం. ముందస్తుగా గుర్తించడం, చికిత్సలు, నివారణ చర్యలలో పురోగతి అద్భుతమైన వేగంతో జరుగుతోంది. క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించలేకపోయినా, ఖచ్చితంగా దాని ప్రభావాన్ని తగ్గించుకోడానికి, మనుగడ రేటును మెరుగుపరచడానికి మనమంతా ప్రయత్నం చేయవచ్చు.
బాధ్యతాయుతంగా జీవించడం-ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా, పరిశోధనకు మద్దతు ఇవ్వడం మరియు సమాజ అవగాహనను పెంపొందించడం-పెద్ద మార్పును కలిగిస్తుంది మరియు అందరినీ ప్రత్యేకంగా ఏకం చేసే పద్ధతిలో మనమంతా చేయి చేయి కలిపి ముందుకు నడుద్దాం.
(వ్యాస రచయిత ఫార్మా రంగ నిపుణుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

విశిష్ఠ పంచమి… వసంత పంచమి

ఆ పేరు ఎలా వచ్చిందంటే….(వాడవల్లి శ్రీధర్)మాఘ శుద్ధ పంచమిని 'వసంత పంచమి'గా...

‘Letter and Spirit’ of Union Budget Must be Sacrosanct

(Vanam Jwala Narasimha Rao) Union Budget for the year 2025-26,...

Seasoned bureaucrat’s lens of imagination

Obtuse Angle Book Review The Book is about a seasoned bureaucrat’s...

సీతమ్మ అష్టపది… మధ్యతరగతికి ఇష్టపది

వేతనం పన్నెండు లక్షలుంటే టాక్స్ నిల్12 లక్షలవరకూ ఆరు స్లాబులు2025 -...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://www.phssrak.sch.ae/https://www.majestkids.com/