Home టాప్-స్టోరీస్ తెలుగు భాష రక్షణకోసం ఏం చేద్దాం ?

తెలుగు భాష రక్షణకోసం ఏం చేద్దాం ?

1
తెలుగు భాష రక్షణకోసం ఏం చేద్దాం ?

తానా సభలో నూర్ బాషా రహ్మతుల్లా సూచనలు

  1. తెలుగు భాష అభిమానులము అనగానే “మీ పిల్లలను ఏ మాధ్యమంలో చదివిస్తున్నారు?” అని ప్రశ్నిస్తారు. తెలుగు పాఠశాలలు అసలు ఉంటేగా చేర్చటానికి?
    మనమంతా తెలుగులో రాస్తూ ఉంటేనే తెలుగు లిపి నిలబడుతుంది. తెలుగులో మాట్లాడుతుంటేనే భాష బ్రతుకుతుంది. 2018 లోతెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఇచ్చిన జీవో ప్రకారం:
  • సచివాలయం స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు, ఉత్తర్వులు అన్నీ తెలుగులోనే ఉండాలి. తెలుగు అమలును నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్య తీసుకునే అధికారం ప్రాధికార సంస్థకు కల్పించాలి.
  • తెలుగు మాధ్యమ విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగపరీక్షలలో 5 శాతం ప్రోత్సాహక మార్కులు ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.
  • అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాలి.
  • ఆంగ్ల మాధ్యమంలో తెలుగును, తెలుగు మాధ్యమంలో ఆంగ్లాన్ని ఒక బోధనాంశంగా ఉంచాలి. డిగ్రీ స్థాయిలో అన్ని సెమిస్టర్లలో తెలుగును తప్పనిసరిగా బోధించాలి.
  • ఇంటర్మీడియట్‌, డిగ్రీల స్థాయిల్లో తెలుగు, సంస్కృతం మిశ్రమ బోధనా విధానాన్ని పాటించాలి.
  • హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పరిచి, న్యాయపాలనలో తెలుగు అమలు కోసం సత్వర చర్యలు తీసుకోవాలి. తెలుగులో తీర్పులు వెలువరించేలా న్యాయమూర్తులను ప్రోత్సహించాలి.
  • ఆన్‌లైన్‌లో ఈ-తెలుగు పద్ధతిలో తెలుగు బోధన, అంతర్జాలంలో తెలుగు సాహిత్యం, శాస్త్ర సాంకేతిక గ్రంథాల వ్యాప్తి, శాసనాల డిజిటలీకరణ, వెబ్‌సైట్ల నిర్వహణ, కంప్యూటర్లలో తెలుగు ఉపకరణాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
  1. తమిళనాడు ప్రభుత్వం జీవో ఎం ఎస్ నంబర్ 145 P & AR (S) డిపార్ట్ మెంట్ తేదీ. 30.09.2010 ద్వారా తమిళ మీడియంలో డిగ్రీ వరకు చదివిన అభ్యర్దులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రిజర్వేషన్ ఇస్తున్నారు. చెన్నై హైకోర్టు కూడా 23.2.2016 న ఈ చట్టాన్ని సమర్ధించింది. తమిళ మాధ్యమంలో చదివిన అభ్యర్దులకు 20% ఉద్యోగాలు రిజర్వు చేయడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చేసింది. రాజ్యాంగంలోని 345 ఆర్టికిల్ ప్రకారం ఎవరి భాషను వాళ్ళు కాపాడుకోవాలని,ఆయా రాష్ట్రాలలో పాలనాభాషగా అధికార భాషగా అభివృద్ధి చేసుకోవాలని కూడా తెలియ జేసింది. ఈ జీవో కష్టపడి సాధించి పంపిన తోటకూర ప్రసాద్ గారికి వందనాలు.
    తెలుగు భాషకు ఆశాదీపాలు తెలుగు సాంకేతిక నిపుణులే
    తెలుగులో ఐటీ ఉద్యోగాలు సాధించే నెల్లూరు శివకుమార్ రెడ్డి లాంటి వారు, గారపాటి, కొలిచాల, వీవెన్, రహమానుద్దీన్ లాంటి సాంకేతిక నిపుణులు ఇంకా ఎందరో రావాలి
    మళ్ళీ పై కోర్కెలతో ప్రభుత్వానికి విన్నవించాలని తెలుగు అభిమాన సభ్యులందరికీ మనవి.

1 COMMENT

  1. మంచి సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు భాష అమలు ప్రగతి నివేదిక పంపడం వరకు మాత్రమే పరిమితం అయ్యింది. గత 5 సంవత్సరాలలో అది కూడా లేదు. పాఠశాలల్లో అయితే English Medium పేరు చెప్పి అటు English లేదు. తెలుగు రానేరాదు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here