నవీన్ పట్నాయక్, ఎంజీఆర్, మమతా బెనర్జీల సూత్రం ఇదే
ప్రజలకు ఏమి అవసరం….?
పార్టీలు ఏమి చేస్తున్నాయి?
(ఆచార్య అంగలకుదురు దుర్గాప్రసాదరావు, 9885050829)
1) ప్రజలకు ఏమి కావాలి! వారు కోరుకొనేది. ఏమిటి!
2) ఎందులకు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి వరుస విజయాలను ప్రజలు అందిస్తున్నారు.
3) ప్రతిపక్షం లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు ఏమి చెబుతున్నాయి. అధికారం లోకి వచ్చిన తర్వాత ఏమి చేస్తున్నాయి, ఏమి మాట్లాడుతున్నారు.
పై అంశాలను ప్రతి రాజకీయ పార్టీ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజుకీయ నాయకులు ఆలోచించాలి. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుని చుట్టూ ఎవ్వరు ఉంటున్నారు. వీరు ఎవరి గురించి పదే పదే వల్లె వేస్తారు. అధికారం వచ్చిన తర్వాత వీరి చుట్టూ ఎవ్వరిని ఉంచుకుంటున్నారు. మళ్ళీ ప్రజలు ఓటు వేయ వలసి ఉన్నదనే విషయాన్ని ఎందుకు మరిచి పోతున్నారు. ఒకసారి పైన ఉదహరించిన విషయాలపై అధినాయకుడు నిష్ప పక్షపాతంగా సింహావలోకనం చేసుకొంటే వారికే అన్ని సమాధానాలు దొరుకుతాయి. ఒరిస్సాలో ఉన్న నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజు జనతాదళ్ దీర్ఘ కాలంగా విజయాలను సాధిస్తున్నది. అవినీతి, ఆశ్రిత పక్ష పాతం, కుల తత్వం, మేమే వీరికి దిక్కు అన్న విధంగా వ్యవహరించడం లేదు. ఇది ప్రజల మన్నలను పొందడానికి ప్రధాన కారణం. ప్రధానమంత్రి కూడ పార్లమెంటులో నవీన్ పట్నాయక్ నడుచుకొనే విధానాన్ని అభినందించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా బిజూ జనతా దళ్ నాయకులను గట్టిగా విమర్శించే అవకాశం రావటం లేదు. ముఖ్యమంత్రి; సంక్షేమము, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన మొదలగునవి; ప్రజలకు అందిస్తూ వారి మనసును దోచారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ లో జ్యోతి బసు, తమిళనాడు లో యం.జి.ఆర్ అదే విధంగా వరుస విజయాలతో దీర్ఘ. కాలం అధికారం లో ఉన్నారు. నేడు తమిళనాడులో స్టాలిన్ కూడ ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో బి. జే.పి పార్టీ ఎంతో పోరాటం చేసినా మమత మూడో సారి విజయం సాధించారు. ఢిల్లీ లో ఒంటరిగా కేజ్రీవాల్ వరుస విజయాలు అందుకున్నారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహన్ మూడు సార్లు విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. వీరు అధికారం లో ఉన్నప్పుడు కూడా ప్రజలతో మమేకవుతూ, ఎన్నికల ముందు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫేస్టోలో పొందు పరచిన ప్రధాన అంశాలను ముఖ్యంగా ప్రజలకు ఎక్కువ మంది భావోద్వేగము తో అనుసంధాన మైన వాటిని అమలు పరుస్తున్నారు.
ప్రజారోగ్యానికి కేజ్రీవాల్ పెద్దపీట
ఢిల్లీలో కేజ్రివాల్ ఆరోగ్యహక్కు చట్టాన్ని అమలులోనికి తీసుకొని వచ్చి ప్రజా ఆరోగ్యానికి ప్రధానమైన ప్రాధాన్యతను ఇవ్వటంతో పాటు విద్యకు పెద్ద పీట వేశారు. మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం స్థానికంగా కొలుగ చేయుటచే ప్రజాభిమానాన్ని పొందారు. పేదలకు సహితము శాసన సభ కు పోటీ చేయించటము తోపాటు వారిని గెలి పించి శాసన సభలోనికి తీసుకొని రావటం ముదావహం. రాజస్థాన్ ప్రభుత్వం కూడ ఇప్పుడు శాసన సభలో ఆరోగ్య హక్కు చట్టం చేసి రాబోయే ఎన్ని కలలో గెలుపు సాధించాలని ఆరాట పడుతోంది.
ప్రజలు ప్రస్తుతము జీవనశైలి రోగాలైన మధు మేహం, రక్త పోటు తో మొదలైయి గుండె జబ్బులు, అనుబంధ జబ్బులతో బాధ పడుతూన్నారు. వీటికి కారణం ఆహార పదార్ధాలు, నీరు, గాలి మొ.. వానిలో వచ్చిన రసాయన కారకాల మార్పు, శారీరక శ్రమ లో మార్పులు. వీటిపైన సరిఅయిన అవ గాహన లేక దేశ ప్రజలు ఆహార నియమాలు: పాటించిన వలసిన జాగ్రత్తలు తేలియక అనేకరకాలుగా ఆనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్య రంగంలో సరిపడినంతగా మౌలిక వసతులు లేకపోవటం, ఆరోగ్యశ్రీ సౌకర్యం కొందరికే పరిమితమవటం, వ్యాపార ధోరణి అయిన ప్రయివేటు ఆసుపత్రులతో ఎంతో ప్రయాసలకు లోనవుతూన్నారు. వీరికి వెల్ నెస్ కేంద్రలా ద్వారా ఆయుశ్ పద్ధతిలో అవగాహన కలుగ చేస్తూ యోగా, ధ్యానం, ఆహారనియమాలు తెలియచేయటంతో పాటు రెఫరల్ పద్ధతిని పటిష్టంగా ఉండేలా చూడాలి.. 14-17 సం|| వయస్సు ఉన్న పిల్లలకు కూడా యోగా, ధ్యానం, క్రీడలు మొ॥ ప్రతి పాఠశాలలో తప్పని సరిచేయటం ముఖ్యం. అన్నిరకాల వయస్సు వారికి కూడ ఒత్తిడికి గురిఅయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి కౌన్సిలింగ్ ఇవ్వటానికి సౌకర్యాలను ప్రభుత్వ ఆసుపత్రులలో, విద్యాసంస్థలలో ఏర్పాటు చేసినట్లుఅయితే ప్రజలు సంతృప్తి చెందుతారు. వారి ఆరోగ్య అవసరాలను పూర్తిగా ప్రభుత్వాలు తమ భుజాల పైకి తీసుకోవాలి. అలాగే వ్యాపారమయిపోయిన విద్యారంగాన్ని కూడ ప్రభుత్వామే చాలా వరకు అధీనంలోకి తీసుకోవాలి. ఈ రెండు రంగాలను ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తు: పని చేసుకొనే అవకాశాలను (ఉపాధి) కలుగ చేస్తు నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టి (అవసరమయితే దీనికి స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి) రక్షిత తాగునీరు అందిస్తే ప్రజలు ఆనందిస్తారు. కర్షకులకు సాగునీరు, విత్తన-ఎరువుల సమస్యలను తీరుస్తూ, వీలయితే ఒకటి, రెండు నెలలకు ముందస్తూ వాతావరణ సమాచారము తెలియ చేస్తూ వారిని ఆదుకుంటూ, ఆ రంగంపై కూడ ప్రభుత్వము ఎక్కువ శ్రద్ద పెట్టాలి. వీరికీ అవసరమయితే ప్రకృతి వైపరీత్యాల కొరకు ప్రత్యేక నిధి ద్వారా ఆదుకొనే విధానం ఉండాలి. కార్మికులను పూర్తిగా పట్టించుకోవాలి, అప్పుడు ప్రజలు ఇంక పెద్దగా కోరు కొనేది ఏమి ఉండదు. చాలా వరకు సంతృప్తి చెందుతారు. అయితే వాస్తవ పరిస్థితులను వివరిస్తూ, ప్రజలకు ప్రభుత్వ కార్యక్ర మాలలో భాగస్వామ్యం చేస్తు వారిమధ్య ఉంటూ ఎవరయినా ఆకాశంలోని చంద్రుడును- చుక్కలను తెస్తామంటూ అమలు చేయటానికి వీలుకాని విషయాలను ప్రస్తావిస్తుండే వాటిని వివరించాలి. ఇలాంటి అంశాలను ఎన్నికల మ్యాని పెసార్ట్ లో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయక ప్రజలను మోసం (చీటింగ్) చేయటం జరుగుచున్నది.
దీనిపై ఆ మధ్య కాలంలో చెన్నయ్ హైకోర్టు లోను, తర్వాత సుప్రీం కోర్టులో, కేంద్ర ప్రభుత్వము, ఎన్నికల కమీషన్ లలో కూడ చర్చ జరిగినది. ఇలాంటి రాజకీయ పార్టీలను తప్పనిసరిగ్గా భాద్యులను చేసి, శిక్షించాల్సిన అవసరం ఉన్నది. దీనికొరకు సరిఅయిన విధానము, దానిని అమలుపరచు సంబంధిత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
ఆంధ్రప్రదేశ్లో లోని రాజకీయ పార్టీల వ్యవహార శైలి బాధను, విస్మయాన్ని కలుగచేస్తున్నాయి.. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు నడవడికకు అధికారం వచ్చిన తర్వాత నడిచే తిరుకు పోలిక లేక, అందులోని తేడా లను గమనించుట వలన వరుస విజయాలను అందించటములేదు. 1956 సం॥లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ తప్ప చెప్పుకోదగిన పరిశ్రమలు గాని సంస్థలుగాని ఎపి లేవు. ఆ ఒక్కదాన్ని కేంద్రం విక్రయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎవరున్నా తమతోనే ఉంటారు, కాబట్టి రాజకీయ ప్రయోజనము అవసరము లేదనే ధోరణిని బి.జే.పి పాటిస్తున్నది. హైదరాబాదు రాజధాని అన్న పేరుతో అన్ని సంస్థలు వచ్చి అభివృద్ధి జరగటం, తెలంగాణ వెనుక బడిన ప్రాంతము అనే పేరుతో అక్కడ నే ప్రాధాన్యత ఇవ్వటంతో సంపద అక్కడ ఏర్పడి విభజన తర్వాత తెలంగాణ సంపద కలిగిన రాష్ట్రముగా రూపుదిద్దుకొని అక్కడ చెప్పుకో దగిన రీతిలో ఎక్కువ రెవెన్యు – పన్ను లరూపంలో రావటం వలన వారికి ఆర్థిక ఇబ్బంది కలుగ లేదు. కాని ఏమి లేని విభజన ఆంధ్ర రాష్ట్రము లో ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయినను అప్పటి ప్రభుత్వము కొంతవరకు జగ్రత్తగానే బండిని ముందుకు నడిపినది. ఏ వర్గానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూడకలిగినారు. కాని ఇప్పటి పరిస్థితి భిన్నంగా ఉన్నది. ప్రభుత్వము ఇప్పుడు మనము మంచి సంక్షేమము అందిస్తున్నాము. అందరికి మేలు చేస్తు న్నాము అనే ఉహాలలో ఉన్నారు. నేడు వారు సంక్షేమము అనే పులి పైన స్వారీ చేస్తున్నారు. అది వారిని మింగి వేసే పరిస్థితిరి చేరుకుంటున్నది. మీరు వాస్తవాలను జీర్ణించుకొనే స్థితి లో లేరు.
నాడు అయినా నేడు అయినా అధికారము నకు వచ్చిన గిరి గీసుకొని పరిమితముగా వేళ్ళ మీద లెక్కించగలిగిన అనుయాయులతోనే సంబంధాలు కొన సాగిస్తూ అంతామనమే ప్రజలకు మంచి చేస్తున్నాము అనే భావనలో ఉంటున్నారు. వీరు పార్టీ క్యాడర్ లోగాని, ప్రజలతోకాని సరిఅయిన పద్ధతిలో ఫీడ్ బ్యాక్ తీసుకొనక వాస్తవ పరిస్థితికి భిన్నంగా బాగా పాలిస్తున్నామనే భావనలో భ్రమిస్తున్నారు. గత ప్రభుత్వము ఎక్కువగా సాంకేతిక పద్ధతిపైన ఆధార పడి స్మార్ట్ సర్వేద్వారా అంతా అనుకూలంగా ఉన్నదనే భావించారు. అయితే వారు ఊహించిన దానికి భిన్నంగా ఘోర పరాజయము పొందటము జరిగినది. దీనికి ప్రజలలో ఉన్న పాలనా పరమైన అసంతృప్తి, ఆవేదనతోఉన్న పార్టీక్యాడర్ అనే కారణాలతో పాటు వ్యవస్థా పరమైన ఊహాత్మక తప్పిదాలనే ఎక్కువగా చెప్పవచ్చును. ఈ ఓటమిని మూడు కోణాలలో అర్ధము చేసుకోవచ్చును. అ. వి.
- రాజకీయ పరమైన కోణం : టీడిపి పుట్టినదే పూర్తిగా కాంగ్రేసు పార్టీకి వ్యతిరేకంగా; ఫలితంగా ఎన్నికలలో ఎల్లప్పుడు 14-16% ఓట్లు కాంగ్రేసును వ్యతిరేకించేవారు. ప్రతిఎన్నికలలో ప్రజలు టిడిపి పార్టీేకే ఓట్లు వేసి గెలిపించేవారు. కాని పోయిన సారి కాంగ్రెసుకు దగ్గరవ్వడముతో ఆఓట్లు పోవటమేకాక, విభజన ఈ ప్రాంతానికి చెందిన ప్రజల మనో భావాలకు వేతిరేకంగా కాంగ్రేసు చేసినదనే కోపంతో ఆ పార్టీని నిర్విర్యం చేసిన ప్రభావం టీడిపి పైన కూడా పడింది. కాంగ్రెస్ అధిష్టానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా జగన్ మోహన్ రెడ్డి గుర్తింపు పొందారు. కాంగ్రేసు వ్యతిరేక ఓట్ల తో పాటు, కాంగ్రెసు పార్టీ భావ స్వారూప్యతను పొందారు. రాష్ట్రానికి ఇవ్వవలసిన ప్రత్యేక హోదా విషయంలో టిడిపి, బిజెపి తో రాజకీయ విభేదమేకాక ఆ పార్టీ నాయకులను వ్యక్తిగత స్థాయిలో టిడిపి నేతలు విమర్శించడంతో బిజేపి వారు కత్తి గట్టి వారికి ఉన్న కొద్ది శాతం ఓట్లను వై.సి.పికి వేసి టిడిపి వారు ఎక్కువ సీట్లులలో ఓడిపోయే విధంగా చేశారు. కర్ణుడి చావుకు వంద కారణాలుగా తయారు అయినది టిడిపి పరిస్థితి.
- పార్టీ పరమైన కోణంలో : పార్టీ అధికారంలో లేనప్పుడు పూర్తి కాలాన్ని పార్టీకి వెచ్చించి వివిధ స్థాయిలలో ఉన్న నాయకులతో మమేకమవుతూ వారిని ఉత్తేజ పరుస్తూ ప్రజలతో కలిసి తిరుగుతూన్నారు. అధికారంలోకి వచ్చి న తర్వాత పార్టీని విస్మరిస్తున్నారు. పార్టీ క్యాడరికి అధినేత దర్శనము ఏడు కొండల వారి ధర్మ దర్శనము మాదిరి అయినది. వార్డు, గ్రామ, మండల, మున్సిపల్ స్థాయి నాయకులు అసంతృప్తి చెందారు. బయట నుండి వచ్చిన వారికి పెద్ద పీట వేశారు. ప్రజా ప్రతినిధులకు బ్రేక్ దర్శన భాగ్యమయినది. సమయాన్ని పూర్తిగా పాలనకే వినియోగించడంతో పార్టీ పూర్తిగా దూరమయినది. అన్ని తనే చేయాలనే భావన, అన్నిటిలోను మనమే ముందు ఉండాలనే భావనతో పార్టీకి సమయం కేటాయించలేదు. జాతీయ పార్టీలు అధికారంలోకి వస్తే పాలనాపరంగా ఉండే నాయకత్వము, పార్టీని నడిపించే విభాగము వేరు వేరు ఉండుటము వలన ఇబ్బంది ఉండదు. ప్రాంతీయ పార్టీలో పాలనకు, పార్టీకి నాయకత్వము ఒకరే కాబట్టి పార్టీ కొరకు కూడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేటా యించిన దానిలో కనీసం నాల్గోవంతైన సమయాన్ని వినియోగించాలి. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నాయకత్వ ఆధిపత్య సమస్యలు వస్తుంటాయి. అవి అన్నీ సరిచేసుకుంటూ పార్టీ క్యాడర్ తృప్తిగా ఉంచుతూ మళ్ళీ ఎన్నికలలో విజయం సాధించే దిశలో నడిపించుకోవాలి.
- సామాజిక కోణం లో; అధికారంలో లేనప్పుడు నిమ్మ వర్గాలను గురించి మాట్లాడటం, బి.సీ లకు 100 సీట్లు ఇస్తాము అని చెప్పడం. పదేపదే బిసి, యస్సి, యస్ టి, మైనార్టీ, మహిళ, యువత, మేధావులకు అవకాశమంటూ అన్న వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ యం.బి.సి లకు అవకాశము కలుగ చేస్తామంటారు. బి.సి, సాధికార కమిటీలు వేస్తారు. 100 సీట్లు బీ.సీ లకు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాల పరిస్థితి మారిపోతుంది. ఎల్లప్పుడు పెట్టుబడిదారులు, అధికారులు మాత్రమే ఉంటున్నారు. నేడు వీరిలో ఎవ్వరు కూడ దగ్గరలేరు. ఏ వర్గం వారికయినా వారి నైపుణ్యత, ఆయా వర్గంలో వారి శక్తి సామర్థ్యాలను బట్టి అవకాశాలను కలుగచేయాలి. కానీ ఏ వర్గమైన డబ్బు ఉన్న వారికే ప్రాధాన్యము అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశం లో (పంజాబ్, డిల్లీ, ఉత్తరాఖండ్) అత్యంత పేదలు ప్రజా ప్రతినిధులుగా ఎలా ఎన్నికవుతున్నారో ఆలోచించుకోవాలి. ఉన్నత వర్గాలమేధా వులనే కాక నిమ్న వర్గాల మేధావులను కూడ దగ్గరకు చేర్చుకోవాలి. అలా అయితేనే ఆయా వర్గాలలో నుండి వచ్చే ఓట్ల శాతం పెరుగుతాయి.
గత ప్రభుత్వంలో పార్టీకి ఆయా పరిస్థితులను బట్టి ఓట్లు వేసే వర్గాలను దగ్గర చేసుకోవాలనే ఆరాటంలో పార్టీకి దీర్ఘకాలంగా ఎంతో అనుకులంగా ఉన్న సేవా చేతి వృత్తులు వారిని పట్టించుకోక వారిని దూరం చేసుకున్నారు. 2014 సం॥ ఎన్నికల మ్యానిఫెస్టో లో 5 సామాజిక వర్గాలకు సామాజిక హోదా మార్పు అంటూ వారిలో ఆశలను రేపి ఓట్లు వేయించుకోని అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారు. బలమైన ఒక సామాజిక వర్గం ఉద్యమము చేయగా వారి వరకు ఆపని పూర్తి చేసి మిగిలిన బి.సి. వర్గాలైన మత్స్యకారులను, రజకులను, వడ్డెరలకు ఇచ్చిన మాటను గాలికి వదలివేసి ఎన్నికలు వచ్చినప్పుడు కంటి తుడుపు చర్యగా స్టడీ కమిటీ వేసి సరిపుచ్చుకొన్నారు. అందుకే ఆయా వర్గాలకు దూరమయ్యారు. ఫలితంగా వారి ఓట్లు 2019 ఎన్నికలలో దూరమయి పార్టీ ఓటమికి కారకులయ్యారు. వారిలో ఇప్పటికి కొంత మార్పువచ్చినప్పటికి (ప్రభుత్వ వ్యతిరేక వల్ల) 2014 స|| ఎన్నికల మాదిరిగా ఎక్కువ శాతం అనుకూలంగా టిడిపి కి చేరువవ్వలేదు. వీరికి రాజకీయ ప్రయోజనాలను కలుగ చేయాలంటే, వారి వద్ద డబ్బులు ఉండవు. ప్రభుత్వ కాంట్రాక్టులు వీరికి ఇవ్వరు. చేయగలిగిన వారికి వృత్తి పరమయి కాంట్రాక్టులును ప్రభుత్వరంగ సంస్థ లైన దేవాలయాలు, ఆసుపత్రులకు సంబంధించినవి కూడ ఇవ్వనప్పుడు ఏ విధంగా ధనాన్ని కూడా పెట్టగలరు. దశాబ్దాల తరబడి అనుకులం ఉన్న వారికి ఏమయినా చేసి వారిని దూరం కాకుండా పార్టీలు చూసుకొంటూ ఓటు బ్యాంకు కాపాడుకోవాలి.
ఇప్పటికయినా మ్యానిఫెస్టో కమిటీలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని వర్గాలకు వచ్చిన తర్వాత నిజంగా చేయగలిగిన అంశాలను మాత్రమే పొందు పరచాలి, చేయలేని వాటి గురించి చర్చ అనవసరంగా భావపేర్లు కాలంగా పార్టీలో అనుబంధమున్న వారికొరకు, పార్టీ తో సరయిన అనుబంధము లేని వారి ప్రయోజనాలకు వీరిని దూరం చేసుకోకూడదు. అంతి మంగా చూడ వలసిన విషయ ఏమిటంటే చేయగలిగినదీ చెప్పుట – చెప్పినదే చేయుట. దీనితో ప్రజలు నమ్మకాన్ని విశ్వనీయత పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే వరుస విజయాలు వస్తాయి.
(వ్యాస రచయిత Vikram Simhapuri University former Registrar)