హీరో టు విలన్… ది జర్నీ ఆఫ్ జగపతిబాబు!

Date:

(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)

హీరోగా ఓ వెలుగు..
మధ్యలో ఓపలేని విరామం..
విలన్ గా ప్రయత్నం..
లెజెండ్ కి ఎదురెళ్లి
సూపర్ సక్సెస్..
శ్రీమంతుడు కి తండ్రిగా
మరో యత్నం..
అడ్ని బతకనివ్వండిరా..
ఆ గొంతులో ఓ మ్యాజిక్..
ఆనక ఆనక
విలనీలోనూ
సరికొత్త లాజిక్..
వరస హిట్లతో
కొత్త ప్రయాణం..
జగపతిబాబు
సినిమా తోరణం
సినిమాతో రణం..!

అతడిలో ఓ వేదాంతి..
ఊహ తెలిసినప్పటి నుంచి
పరిచయం ఉన్న రంగం
అయినా చాలాకాలం
అటెళ్ళని మనసు..
అడవిలో అభిమన్యుడై..
పెద్దరికం తో ముందుకెళ్లి..
మధ్యలో గాయం పాలవుతూ..
ఓ శుభలగ్నం లో తనకుతానే
శుభాకాంక్షలు చెప్పుకుని
పెద్దకెరీరుకు
మావిచిగురు తొడిగి..
హిట్టుల అంతఃపురం..
మహిళాలోకం మెచ్చిన మనోహరం..
జగపతి బాబు ట్రెండు..
చిన్న శోభన్ బాబుగా
కొన్నాళ్ళు బ్రాండు..!

తాజాగా కొత్త గోదా
విలనీకి ఓ హోదా..
పరుగులు పెట్టని ప్రయాణం
మనకు లేక అదో ఏడుపా
పరులకుంటే మరీ ఏడుపా..
ఇది కాదు
జగపతిబాబు టైపు..
ప్రశాంత జీవనమే
అతగాడి కైపు..
ఇప్పుడు విలనీలో
ఫణీంద్రే పెద్ద తోపు..!

జగపతిబాబుకు
జన్మదిన శుభాకాంక్షలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్

దుబాయ్: మెన్ ఇన్ బ్లూ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ కు చేరింది....

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....