ప్రకాశం ఫస్ట్…అనంతపురం లాస్ట్
ఫలితాలు విడుదల చేసిన బొత్స
797 స్కూల్స్‌లో సెంట్ పెర్సంట్ రిజల్ట్
విజయవాడ, జూన్ 6: పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం చివరి స్థానంలో నిలిచింది. బాలికలు యథాప్రకారం బాలురపై ఉత్తీర్ణతలో పైచేయి సాధించారు. బాలికలు 70.70శాతం, బాలురు 64.02 శాతం ఉత్తీర్ణులయ్యారు. 78.3 శాతం ఉత్తీర్ణతను ప్రకాశం జిల్లా సాధించగా, అనంతపురం 49.7శాతం సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో 797 స్కూల్స్ పూర్తి ఉత్తీర్ణత సాధించాయి. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడ ఉత్తీర్ణులు కాలేదు. మొత్తం 4లక్షల 14వేల 281 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం ఆరు లక్షల 22 వేల 537మంది పరీక్ష రాశారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్ష ఫీజు రేపటి నుంచి స్వీకరించనున్నారు.
టెన్త్‌లో బాలికలే టాప్
Date: