హోరాహోరీ పోరులో భారత్ పై గెలుపు
పారిస్, ఆగష్టు 06 : ఒలింపిక్ హాకీ సెమి ఫైనల్లో జర్మనీ భారత్ ని ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. 3 – 2 తేడాతో గెలిచింది. ఆది నుంచి రెండు జట్లు కొదమసింహాల్లా పోరాడాయి. మొదటి ఎనిమిది నిముషాల్లోనే హర్మన్ ప్రీత్ పెనాల్టీ కా ర్నరును గోలుగా మలిచాడు. వరుసగా లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకున్నారు. ఆట మొదలైన తొలి రెండు నిముషాల్లోనే భారత్ కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిని జర్మనీ సమర్థంగా అడ్డుకుంది. ఎనిమిది నిముషాల సమయంలో వరుసగా నాలుగు పెనాల్టీ కార్నర్లు లభించగా ఒక గోలు చేసింది. మణిదీప్ ఇచ్చిన పాస్ ను కెప్టెన్ హర్మన్ ప్రీత్ సునాయాసంగా గోల్ పోస్టులోకి పంపాడు.
రెండో క్వార్టర్ రెండు నిమిషాల 35 సెకన్ల వద్ద లభించిన పెనాల్టీ కార్నరును జర్మనీ గోలుగా మలిచి స్కోరును సమం చేసింది. జర్మనీ శిబిరంలో ఇది ఆనందాన్ని నింపింది. 22 వ నిముషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ ను జర్మనీ గోల్ చేసి, ఆధిక్యాన్ని 2 – 1 కి పెంచుకుంది.
మూడో క్వార్టరు తొలి నిముషంలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను జర్మనీ సమర్ధంగా తిప్పికొట్టడంతో భారత్ నిరాశకు గురైంది. ఆరో నిముషంలో లభించిన పెనాల్టీ కార్నరును హర్మన్ గోలుగా మలిచి స్కోరును సమం చేసి భారత్ ఆశలను సజీవంగా ఉంచాడు.
నాలుగో క్వార్టరు తొలి నిముషంలోనే జర్మనీకి లభించిన పెనాల్టీ కార్నరును శ్రీజేష్, సంజయ్ అడ్డుకున్నారు. ఆరో నిముషంలో మళ్ళీ జర్మనీకి పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని భారత జట్టు అడ్డుకుంది. నాలుగో క్వార్టరు తొమ్మిదో నిముషం వద్ద జెర్మనీ గోల్ చేసి ఆధిక్యాన్ని 3 – 1 కి పెంచుకుంది.
ఈ ఓటమితో భారత్ కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది. వాస్తవానికి ఒలింపిక్స్లో భారత్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. భారత్ ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఒలింపిక్ హాకీ ఫైనల్లో ప్రవేశించింది. అన్ని సార్లు విజేతగా నిలిచి బంగారు పతకాలను సాధించింది. ఫైనల్లోకి ప్రవేశించడం ఇది తొమ్మిదో సారి. 1928 , 1932 , 1936 , 1948 , 1952 , 1956 , 1964 , 1980 ఒలింపిక్స్ ఫైనల్లో చేరి విజేతగా నిలిచింది. ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డ్.