అందరమొకటై చేయి చేయి కలిపి… జై జై గణేశ

Date:

శిల్ప కాలనీలో ఘనంగా గణేశ ఉత్సవాలు
67 వేలకు పెద్ద లడ్డూ, 17 వేలకు చిన్న లడ్డూ పాట
గణపతి హోమంతో ముగిసిన పూజలు
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

గణేశ ఉత్సవాలంటే ఐక్యతకు ప్రతీక. మహారాష్ట్రలో బాలగంగాధర తిలక్ ప్రారంభించిన ఈ ఉత్సవాలు క్రమేపీ దేశమంతా వ్యాపించాయి. కొత్తగా ఏర్పడిన శిల్ప కాలనీలో కూడా ఉత్సవాలను చక్కగా నిర్వహించి, తమ ఐక్యతను చాటారు కాలనీ వాసులు. వచ్చే ఏడాదికి తమ కాలనీలో ఉన్న సమస్యలు, ముఖ్యంగా మంచి నీరు, రోడ్లు సమకూరాలని వినాయకుని ప్రార్ధించారు. ఈ ఏడాది ఉత్సవాలకు శ్వేతా ఆర్కిడ్ నివాసి ఆంజనేయులు విగ్రహాన్ని సమకూర్చారు. వచ్చే ఏడాది తాను విగ్రహాన్ని అందజేస్తానని వంశి రెసిడెన్సీ నివాసి వేగేశ్న సుబ్బరాజు ప్రకటించారు. అందరమొకటై చేయి కలిపితే… జై జై గణేశ అంటూ ఉత్సవాలను నిర్వహించడం చాలా తేలికని శిల్ప కాలనీ వాసులు నిరూపించారు.


అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శిల్ప కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఈ సారి కాలనీ పార్కులో గణేశ మంటపాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ పూజతో పాటు, కుంకుమ పూజ నిర్వహించారు. ఈ నెల 14 న అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చివరి రోజున గణపతి హోమాన్ని నిర్వహించి, గణేశునికి ఉద్యాపన చెప్పారు. పూజారి రవి కిరణ్ పూజాదికాలు నిర్వహించారు.


శిల్ప విలేజ్ రెసిడెంట్స్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ మానేజ్మెంట్ వెల్ఫేర్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ ఉత్సవ కమిటీ ఉత్సవాలను సాఫీగా సాగేలా చూసింది. కమిటీ సభ్యులు శివ మన్నే, కొండాబత్తుల వెంకన్న, శ్రీకాంత్ మత్స, కిష్టారెడ్డి, ఫణి కుమార శర్మ, శశిధర్ బలిజేపల్లి, తదితరులు కార్యక్రమానికి నాయకత్వం వహించారు. తొమ్మిది రోజులపాటు వెంకన్న మంటపాన్ని అంటిపెట్టుకుని, కార్యక్రమాలను పర్యవేక్షించారు.
కాలనీలోని గల్లీ క్రికెట్ టీం అన్నదాన కార్యక్రమానికి నేతృత్వం వహించింది.

శ్వేతా బ్రీజ్ అబోడ్ అపార్ట్మెంట్ నివాసి ఎస్. నరసింహారావు (నాయుడు) అన్నదానానికి అవసరమైన కూరగాయలను అందజేశారు. నిమజ్జనం ఊరేగింపునకు వాహనాన్ని సమకూర్చారు.


కాలనీ ఏర్పడిన తరవాత వరుసగా రెండో సంవత్సరం నివాసులు ఏర్పాటు చేసుకున్న ఉత్సవాలు ఇవి. పార్కులో నిర్వహించిన అన్నదానానికి విశేష స్పందన లభించింది. ఎవ్వరి సహకారమూ లేకుండా, రెసిడెంట్స్ మాత్రమే స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చి, ఉత్సవాలకు సహకరించారు.


ఈ నెల 14 న నిర్వహించిన లడ్డూ వేలంపాటలో పెద్ద లడ్డూను లక్ష్మి శ్రీనివాస అపార్ట్మెంట్ నివాసి కిషోర్ 67 వేల 116 రూపాయలకు దక్కించుకున్నారు. చిన్న లడ్డును వంశి రెసిడెన్సీకి నివాసి వేగేశ్న సుబ్బరాజు 17 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. కలశాన్ని నాలుగు వేల రూపాయలకు పాడారు. నిమజ్జనం రోజున వీటిని ఊరేగింపుగా తీసుకు వెళ్లి వారి ఇంటి వద్ద శిల్ప సొసైటీ అందజేసింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇద్దరి పేరు మీద ఎస్.బి.ఐ.లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, వచ్చే ఏడాది ఉత్సవాలకు దీనిని ఉపయోగించాలని సొసైటీ నిర్ణయించింది.
కార్యక్రమాలు అన్నిటిని కాలనీ వాసి టి. నిరంజన్ స్వలాభాపేక్ష లేకుండా వీడియో చిత్రీకరించడమే కాకుండా, ఛాయా చిత్రాలను కూడా చిత్రీకరించారు. కార్యక్రమంలో సహకరించిన అందరికీ సొసైటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది.

(Pictures Credit: T. Niranjan)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/