రూ. 6 . 82 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
అమీన్పూర్, జనవరి 23 : మునిసిపల్ కౌన్సిళ్ల కాలవ్యవధి ముగుస్తుండడంతో మిగులు నిధుల వినియోగానికి అవి దారులు తెరిచాయి. వీరి నిర్ణయం కొత్త కాలనీలకు వరప్రదాయినిగా మారింది. కొత్త కాలనీలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తైన పనులను ప్రారంభించారు.
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో గురువారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. వివిధ వార్డులలో 6 కోట్ల 82 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లాలాబావి కాలనీలో నూతనంగా నిర్మించిన రిజర్వాయర్ నుండి మంచినీటి సరఫరాను ప్రారంభించారు. దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న రక్షిత మంచినీటి సమస్యకు పరిష్కరించామని తెలిపారు. ఐదు రిజర్వాయర్లను నిర్మించి ప్రతి ఇంటికి మంచినీటి కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి రోడ్లు వీధిదీపాలు. పార్కుల నిర్మించి.. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
శిల్ప కాలనీలో సి.సి. రోడ్ల నిర్మాణానికి ఎం.ఎల్.ఏ. శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.