ఖతార్‌లో సాక‌ర్ కాసుల వర్షం

Date:

క్రీడాభిమానుల గుండెల్లో ఎడారి దేశం సంద‌డి
1930లో తొలి టోర్నీ…ఉరుగ్వేలో
ఇప్పటి వరకు 21 వ‌ర‌ల్డ్ టోర్నీలు
ఆతిథ్యం ఇస్తున్న అతి చిన్న దేశం ఖతార్
మెగా టోర్నీలో స్థానం దొర‌క‌ని రష్యా
5సార్లు ఛాంపియ‌న్ ఇటలీకి ద‌క్క‌ని స్థానం
యుద్ధ విమానాల ప‌హారాలో ఫిఫా
ఫిఫా మొత్తం ప్రైజ్ మనీ రూ.357 కోట్లు..
(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌, హైద‌రాబాద్‌)
క్రీడా ప్రియులను అలరించేందుకు ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ 22 వ ఎడిషన్ వచ్చేసింది. ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండుగే పండుగ. మెస్సీ , రొనాల్డో వం టి స్టార్ ప్లేయర్స్ ఆట మాయలో పడి మునిగితేలేందుకు అభిమానులు కూడా సిద్ధమైపోయారు. ఆదివారం ఖతార్ వేదికగా సాకర్ మహాసంగ్రామానికి తెరలేవబోతోంది. ఫుట్ బాల్ చరిత్రలోనే తొలిసారిగా ఖతర్ ప్రపంచకప్‌కు ఆతిథ్య మివ్వనుంది. మొత్తం 32 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఆదివారం తొలి మ్యాచ్‌లో ఈక్వె డార్ తో ఆతిథ్య ఖతర్ జట్టు తలపడనుంది. ఫిఫా వరల్డ్ కప్… అతి చిన్న దేశంలో జరుగుతున్న ప్రపంచ కప్‌గానూ రికార్డు సృష్టిస్తోంది. అరబ్బుల దేశం ఖతర్లోని 5 నగరాల్లో 8 వేదికల్లో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ 2022 కొన్ని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయబోతోంది. సాధారణంగా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను వేసవిలో నిర్వహిస్తారు. ఖతర్‌లో వేడి చాలా ఎక్కువ.

ఈశాన్య దేశాల జనాలు, సమ్మర్లో ఖతర్ ఉండే వాతావరణాన్ని ఏ మాత్రం తట్టుకోలేరు. ఈ కారణంగా ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీని చలికాలంలో నిర్వహిస్తున్నారు… ఫుట్‌బాల్ అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఖతార్ చేరుకున్నారు. తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్ల మధ్య రాత్రి 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఎనిమిది స్టేడియాల్లో 64 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూప్లులుగా తలపడతాయి. టోర్నమెంట్లోని 64 మ్యాచ్‌లు 8 వేదికల్లో జరుగుతాయి. అల్ బైట్ స్టేడియం, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ తుమామా మైదానం, అహ్మద్ బిన్ అలీ స్టేడియం, లుసైల్ స్టేడియం, స్టేడియం 974, ఎడ్యుకేషన్ సిటీ మైదానం, అల్ జనోబ్ స్టేడియం లలో ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. తొలి మ్యాచ్ కు ముందు భారీ స్థాయిలో ప్రారంభోత్సవం జరగనుంది. ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ సంగీత బృందం బీటీఎస్ కు చెందిన జంగ్ కూక్ పెర్ఫార్మెన్స్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఓపెనింగ్ సెర్మనీకి దోహా సమీపంలోని బేత్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ప్రపంచ కప్ అధికారిక సౌండ్ ట్రాక్ట్‌ కూడా విడుదలైంది. ఆ పాట ‘హయ్యా హయ్యా’ అంటూ సాగుతుంది. దీనిని ట్రినిడాడ్ కార్డోనా, డేవిడో, అయేషా నిర్మించారు. టోర్నమెంట్ గీతం అనేక పాటల సమాహారం కావడం ఇదే మొదటిసారి.


200 బిలియ‌న్ డాల‌ర్ల ఖ‌ర్చు
ఫిఫా వరల్డ్ క‌ప్ ఆతిథ్య హక్కులు దక్కించుకోవడాన్ని గొప్ప గౌరవంగా దేశాలు భావిస్తాయి. తొలిసారి 2022లో మిడిల్ ఈస్ట్ దేశమైన ఖతార్ ఈ హక్కులు దక్కించుకుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం ఆ దేశం చేసిన ఖర్చు చూస్తే కళ్లు తేలేయాల్సిందే. కనీవినీ ఎరగని రీతిలో ఫిఫా క‌ప్ నిర్వహణ కోసం ఖతార్ చేసిన ఖర్చు అక్షరాలా రూ.16.6 లక్షల కోట్లు (200 బిలియన్ డాలర్లు). ఈ ఖర్చు చూసి ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఫిఫా సంపాదనలో చాలా వరకూ టీవీ హక్కుల అమ్మకం ద్వారానే వస్తుంది. వరల్డ్ క‌ప్, ఇతర ఇంటర్నేషనల్ టోర్నీల టీవీ హక్కులను ఫిఫా భారీ మొత్తానికి అమ్ముతుంది. ఇంతకు ముందు చెప్పినట్లు 640 కోట్ల ఆదాయంలో 460 కోట్లు కేవలం టీవీ హక్కుల ద్వారానే రావడం విశేషం. ఇక మార్కెటింగ్ హక్కుల ద్వారా కూడా ఫిఫా పెద్ద మొత్తమే అందుకుంటుంది. 2018లో వరల్డ్‌క‌ప్ జరిగినప్పుడు ఫిఫాకు వచ్చిన ఆదాయం 460 కోట్ల డాలర్లు.

అంటే మన కరెన్సీలో సుమారు రూ.37500 కోట్లు. అది కూడా టోర్నీ నిర్వహణ కోసం ఎంతో ఖర్చు చేసిన తర్వాత కూడా. ప్రైజ్ మ‌నీ సహా, నిర్వాహక దేశం ఆర్గనైజింగ్ కమిటీకి, రవాణాకు, టీమ్స్, సపోర్ట్ స్టాఫ్ వసతి ఏర్పాట్లకు, ఆతిథ్య దేశంలో ఫుట్ బాల్ క్రీడ అభివృద్ధికి.. ఇలా ఎంతో ఖర్చు చేస్తుంది. అయినా నాలుగేళ్ల కిందటి వరల్డ్ కప్ జరిగినప్పుడు ఫిఫాకు ఈ స్థాయి ఆదాయం రావడం విశేషం. ఇప్పుడు ఖతార్ వరల్డ్ కప్ మొత్తంగా 44 కోట్ల డాలర్ల ప్రైజ్ మ‌నీ ఇస్తోంది. అందులో విజేతకే 4.4 కోట్ల డాలర్లు దక్కుతుంది. అంటే సుమారు మన కరెన్సీలో రూ.358 కోట్లు. నాలుగేళ్లకోసారి ఫిఫా తన ఆదాయ వివరాలను వెల్లడిస్తుంది. ఫిఫా మొత్తంగా 640 కోట్ల డాలర్లు (సుమారు రూ.52 వేల కోట్లు) సంపాదించింది. 32 దేశాల పాల్గొంటున్న ఈ టోర్నీ నిర్వహణకు ఖతార్ చేసిన ఖర్చు వెనుక పెద్ద తతంగమే ఉంది.


అన్నీ కొత్త స్టేడియాలే
ఫిఫా వరల్డ్ క‌ప్ జ‌రిగే 8 స్టేడియాల్లో ఏడు స్టేడియాలను ఈ టోర్నీ కోసమే నిర్మించారు. ఇవ‌న్నీ 5 కిలోమీట‌ర్ల ప‌రిథిలో ఉన్నాయి. 80 వేల మంది కూర్చొని చూసే సామర్థ్యం ఉన్న లూసెయిల్ స్టేడియం కూడా ఒకటి. ఇక్కడే ఫైనల్ జరగనుంది. ఇక అప్పటికే ఉన్న ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియాన్ని కూడా ఫిఫా కోసం పూర్తిగా పున‌ర్నించారు. ఈ టోర్నీకి 12 లక్షల మంది వివిధ దేశాల నుంచి రానున్నారు. కొత్తగా హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి చేశారు. క్రూయిజ్ షిప్స్‌లో మూడు హోటల్స్ ఉన్నాయి. వీటిలో 10 వేల మంది ఉండొచ్చు. దోహా సమీపంలో ప్రత్యేకంగా నిర్మించి వెయ్యి టెంట్లలోనూ అభిమానులు ఉండనున్నారు.ఫుట్బాల్ వరల్డ్కప్లాంటి మెగా ఈవెంట్ నిర్వహిస్తున్న సమయంలో బయట నుంచి వచ్చే లక్షలాది మంది అభిమానుల కోసం అన్నీ కొత్తగా నిర్మించుకోవాల్సి వచ్చింది. తమ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ను కూడా ఖతార్ గణనీయంగా మెరుగు పరచుకుంది. ప్రత్యేకంగా టోర్నీ కోసమే మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వరల్డ్కప్కు ఎంతో ముందుగానే ఇక్కడ ప్రధాన హైవేలు నిర్మించింది. ట్రామ్ వ్యవస్థనూ ఏర్పాటు చేసింది. మిగతా మూడింటికి మెట్రో, షటిల్ బస్ సర్వీసులు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. స్టేడియాల మధ్య అభిమానులను తీసుకెళ్లడానికి ఏకంగా 4 వేల బస్సులను ఏర్పాటు చేశారు. వరల్డ్ కప్ సందర్భంగా రోజుకు 50 వేల మంది ఈ బస్సులను ఉపయోగించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఫిపా వరల్డ్ క‌ప్ కోసం వేల మంది భద్రతా సిబ్బందిని ఖతార్లోకి దింపారు. వివిధ దేశాలతో ఈ భద్రత కోసమే ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. టర్కీ నుంచి పోలీసులు, వివిధ దేశాల నుంచి కూడా భద్రతా సిబ్బంది వచ్చారు. ఇప్పటికే సెక్యూరిటీ రిహార్సల్స్ కూడా చేశారు. ఇందులో 50 వేల మంది పాల్గొనడం గమనార్హం.


అధికారిక మ్యాచ్ బాల్ పేరు అల్ రిహాల్‌
వరల్డ్ 2022 యొక్క అధికారిక మ్యాచ్ బాల్కు అల్ రిహాల్‌ అని పేరు పెట్టారు. అరబిక్‌లో అల్ రిహాల్ అంటే “ది జర్నీ” అడిడాస్ స్పాన్సర్ చేసిన వరల్డ్ కప్‌కు ఇది 14వ అధికారిక మ్యాచ్ బాల్. బంతిపై ముద్రించిన త్రిభుజాకార ప్యానెల్లు గల్ఫ్ దేశాలు ఉపయోగించే సాంప్రదాయ ధోవాల తెరచాపలను సూచిస్తాయి. బంతిపై రంగులు సంస్కృతి, వాస్తుశిల్పం మరియు ఖతార్ జెండా నుండి ప్రేరణ పొందాయి. మునుపటి ఫిఫా కప్ అధికారిక మ్యాచ్ బంతుల కంటే బంతి విమానంలో వేగంగా ప్రయాణిస్తుందని తయారీదారు పేర్కొన్నారు. బంతి లోపల, బంతి యొక్క ఖచ్చితమైన స్థానం మరియు మైదానంలో మొత్తం 22 మంది ఆటగాళ్లను తీసివేయడానికి సెమీ ఆటోమేటెడ్ సిస్టమ్లు ఉంటాయి. బాల్లో ఉన్న కిక్ పాయింట్ ప్రెసిషన్ టెక్నాలజీ మరియు కనెక్ట్ చేయబడిన బాల్ టెక్నాలజీ వీడియో అసిస్టెన్స్ రెఫరర్లకు వారి తీర్పులను మెరుగుపరచడానికి సహాయపడతాయి
గోల్డెన్ బూట్ అవార్డు
గోల్డెన్ బూట్ అవార్డును వరల్డ్ క‌ప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌కు ఇస్తారు. దీనిని అధికారికంగా 1982 వరల్డ్ క‌ప్‌లో ఇవ్వడం ప్రారంభించారు. 2006 వరల్డ్ క‌ప్ వరకూ దీనిని గోల్డెన్ షూ అవార్డుగా పిలిచేవారు. 2010 నుంచి దీనిని గోల్డెన్ బూట్ అవార్డుగా పేరు మార్చారు. ఇప్పటి వరకూ టాప్ గోల్ స్కోరర్స్‌కు గోల్డెన్ బూట్, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వాళ్లకు సిల్వర్, బ్రాంజ్ బూట్లను అందించారు.1982 నుంచి అధికారికంగా ఈ అవార్డు ఇస్తున్నా.. అంతకుముందు తొలి టోర్నీ జరిగిన 1930 నుంచి కూడా అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్స్‌కు ప్రత్యేకమైన అవార్డు ఇస్తున్నారు. తొలి టోర్నీ అర్జెంటీనాకు చెందిన గిల్లెర్మో స్టాబిలే ఈ అవార్డు అందుకున్నాడు. ఆ టోర్నీలో అతడు 8 గోల్స్ చేశాడు. ఇప్పటి వరకూ వరల్డ్‌క‌ప్ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక గోల్స్ రికార్డు ఫ్రాన్స్కు చెందిన జస్ట్ ఫాంటెయిన్ పేరిట ఉంది. అతడు 1958 వరల్డ్కప్లో 13 గోల్స్ చేశాడు.వరల్డ్ క‌ప్ చరిత్రలో ఏ ప్లేయర్ కూడా ఒకటి కంటే ఎక్కువసార్లు గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకోలేదు. అత్యధికంగా బ్రెజిల్ ప్లేయర్స్ ఆరుసార్లు ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డు కింద బంగారం తయారు చేసిన ఓ బూటును ప్లేయర్స్‌కు ఇస్తారు. 2018లో ఇంగ్లండ్‌కు చెందిన హ్యారీ కేన్ గోల్డెన్ బూట్ అవార్డు గెలుచుకున్నాడు. రష్యాలో జరిగిన ఆ టోర్నీలో హ్యారీ కేన్ 6 గోల్స్ చేసాడు. అంతకుముందు 2014లో కొలంబియాకు చెందిన జేమ్స్ రోడ్రిగ్స్ (6 గోల్స్), 2010లో జర్మనీకి చెందిన థామస్ ముల్లర్ (5 గోల్స్) గోల్డెన్ బూట్ అవార్డులను గెలుచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...