హైదరాబాద్, జనవరి 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు మళ్ళీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలు పనిచేయవచ్చని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కరోనా నిబందనలను కఠినంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యాలు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ ఉద్ధృతి పెరగడంతో ఈ నెల 8 నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒమిక్రాన్ కేసులు క్రమేపీ తగ్గుతుండడంతో పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణలో స్కూళ్ళ రీఓపెనింగ్ ఎప్పుడంటే!
Date: