విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, ఈఓ రామచంద్ర మోహన్ బుధవారం నాడు ఎపి ముఖ్యమంత్రి ఎం. చంద్ర బాబు నాయుడును కలిశారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.
చీఫ్ సెక్రటరీ విజయానంద్, ఎండోమెంట్స్ కమిషనర్ ఎం.వి. సత్యనారాయణను కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కూడా కలిశారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలను అందజేశారు.