టెన్షన్ వద్దు… పెన్షన్ కావాలి

Date:

సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి
(మాచన రఘునందన్, 9441252121)
సీ పీ ఎస్ అని క్లుప్తంగా పిలుకుచుకున్నా..
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అర్థం అయ్యేలా చెప్పినా, భాగస్వామ్య పింఛను పథకాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది మాత్రం సెప్టెంబర్ 1 2004 నుంచి.
పంద్రాగస్టు, అక్టోబరు 2 వ తేదీ వీటిని అందరూ గుర్తు పెట్టుకుంటారు. ఆయా రోజుల విశిష్టత అది. అలాగే .. సెప్టెంబర్ 1 కూడా ఉద్యోగులను మరవనివ్వకుండా చేసింది. తమకు ఇక ప్రభుత్వ పెన్షన్ యోగం పోయిందన్న వ్యధ మిగిల్చింది. ఉద్యోగం ఒక యోగం , ప్రజా సేవా అవకాశం మహత్బాగ్యం అని భావించడం పరిపాటి. నౌకరీ ఉన్నదన్న ధీమా తో పాటు సైడ్ ఎఫెక్ట్ లా కాన్ట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిణమించింది.

సీ పీ ఎస్ ఓ కంత్రీ స్కీమ్ అని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు భావించేలా ఆలోచనాగ్నిని రగిలించింది. ఉద్యమాన్నే రాజేసింది. మాకు పింఛను రాదు అని మానసికంగా సర్వీసులో ఉన్నన్నాళ్ళూ జీతం, ఆ తర్వాత పెన్షన్ ఇక జీవితం టెన్షన్ లేని జీవనం అన్నది జన సామాన్యం అభిప్రాయం. పాలకులు, ప్రభుత్వాలు, ఎలా ఆలోచించారేమో కాని, ప్రశాంతంగా ఉన్న ఉద్యోగం లో పెన్షన్ రాదు అన్న టెన్షన్ కు తెర తీసింది 2004 సెప్టెంబర్ 1.
ఆనాటి నుంచి గవర్నమెంటు ఉద్యోగంలో చేరిన వారికి పింఛను భరోసా కు భంగం అసంతృప్తిని కలిగించేలా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడే ఈ సీ పీ ఎస్ కు పాలకులు ఎస్ అన్నపటి నుంచి ఇప్పటి వరకూ ఎప్పుడెపుడు నో అంటారా అని సర్కారు వేతన జీవులు ఆబగా ఎదురు చూస్తున్నారు.
సీ పీ ఎస్ వద్దు ఓ పీ ఎస్ ముద్దు అని నినదిస్తున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పక్షాలు కూడా ఉద్యోగ వర్గాల పక్షాన ఉన్నట్టు ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొనే లా ఉద్యోగం ఉద్యమ రూపం దాల్చింది.

దాముక కమలాకర్ నేతృత్వం లో 2016 లో సీ పీ ఎస్ రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు ఏకం అయ్యేలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయీస్ అసోియేషన్ ( సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్) ఏర్పాటయింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు కూడా సీ పీ ఎస్ రద్దు కోసం ఆలోచించే లా వాతావ”రణం” పరిస్థితి నెలకొంది. సీ పీ ఎస్ ను ఎలాగైనా రద్దు చేస్తారేమో అన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల ఎజెండాలో సీ పీ ఎస్ రద్దు ను ఓ ప్రధాన అంశంగా చేర్చేలా ఆయా పార్టీల కు విజ్ఞాపనలు చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఎన్ని ఉన్నా.. సీ పీ ఎస్ రద్దు ఏకైక ఎజెండా గా అందరినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాలకుల కు కాస్తో..కూస్తో టెన్షన్ కల్గించి, అటెన్షన్ ఇవ్వక తప్పని పరిస్థితి దాపురించేలా చేసిందీ సీ పీ ఎస్సే.
సీ పీ ఎస్ ఉద్యోగి మరణిస్తే అతని ప్రాన్ ఖాతా లో జమ అయి ఉన్న అతి కొద్ది నామ మాత్రపు మొత్తం మాత్రమే కుటుంబానికి అందుతుందన్న పాయింటు ను అర్థం చేయించడానికి హైదరాబాద్ వేదికగా ఎన్నో సమావేశాలు, సభలూ వర్క్ షాపులు జరిగాయి.
అయ్యా..మా మొర ను దయ చేసి ఆలకించరా., మేము ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నమో సోదాహరణంగా చెప్తాం వినండి అని ఖైరతాబాద్ లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ లో ఓ మేధో మథనం వంటి సమావేశాన్ని నిర్వహించాము. మా.. భాధ, వ్యధ ను అర్థం చేసుకోండి సార్ అంటూ వినమ్రంగా విన్నవించడం జరిగింది. సీ పీ ఎస్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల జీవితాల్లో ఆనందం నింపండి ప్రభో.. అంటూ వేడుకున్నాం.

అన్నీ తెలిసిన అంతర్యామికి తెలియని విషయం ఒకటి ఉంటుందా అన్న రీతిన అంతర్యామి.. అలసితీ.. సొలసితీ అంటూ సీ పీ ఎస్ కోసం ఉద్యోగం తో పాటు ఉద్యమం చేసి, చేసి ఇక అంతిమంగా సామాజిక మాధ్యమం ద్వారా విన్నపాలు వినవలే అంటూ కేంద్ర, రాష్ట్ర పాలకులకు సోషల్ మీడియా సాయం తో #NoNPS_NoUPS_OnlyOPS అంటూ సాధ్యమైనన్ని ట్వీట్లు, బుధ, గురు, శుక్ర వారాల్లో ఉద్యమ స్పూర్తి తో పెట్టడం ద్వారా మరో మారు పాలకులకు “సీ పీ ఎస్ రద్ధ్ కరో” అని నినాదం చేరేలా ప్రయత్నం చేస్తున్నాము. ముక్త కంఠంతో పాత పెన్షన్ పద్దతి పునరుద్దరణకు ప్రతీ ఒక్కరి ఘోష, భాగస్వామ్య పింఛను పథకం కంఠశోష ఇక నైనా అర్థం చేసుకునేలా ప్రయత్నం జరుగుతోంది.
(వ్యాస రచయిత సీ పీ ఎస్ టీ ఈ ఏ టీ ఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...