(వాడపల్లి శ్రీధర్)
ఏరువాక సాగారోరన్నొ చిన్నన్న’ అంటూ తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన అలనాటి అందాల తార ‘వహీదా రెహ్మాన్’ గురించి చాలామందికి తెలుసు. ఒకప్పుడే తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ముద్ర వేసుకున్న వహీదా రెహ్మాన్ 1955లో తెరకెక్కిన ‘రోజులు మారాయి’ తెలుగు చిత్రంతో తెరంగెట్రం చేశారు. ఆమె ఓ అందాల తార తొలుత హీరోయిన్ గా నటించిన ఆమె తర్వాత అందాలబామ్మ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆమె ఎవరో కాదు వహీదా రెహమాన్.. 1938 ఫిబ్రవరి 3న తమిళనాడులోని చెంగల్పట్టు లో జన్మించిన ఆమె నటి అవ్వడానికి ఎన్నో కష్టాలు పడింది.. చిన్నప్పుడే నాట్యం నేర్చుకున్న ఆమె మొదటినుంచి డాక్టర్ కావాలని కలలు కన్నారు కానీ తండ్రి మరణంతో ఆమెకు ఆమె నేర్చుకున్న నాట్యమే ఎస్సెట్ గా మారింది.
ఎన్టీఆర్ సొంత సంస్థ ఎన్ ఏ టి పతాకంపై అప్పటికే కొన్ని చిత్రాలు తీసి నష్టపోగా, తర్వాత ప్రయత్నంగా ఓ భారీ జానపద చిత్రం చేయాలని ఎన్టీఆర్ తన మిత్రులు భావించారు. అందుకు జయసింహ అనే కథను కూడా సిద్ధం చేసుకున్నారు.. అందులో ఓ నాయికగా అంజలీదేవిని ఎంచుకోగా, రాజకుమారి పాత్రలో ఓ కొత్త నటిని తీసుకోవాలనుకున్నారు..
అప్పుడు తన మిత్రుల ద్వారా వహీదా గురించి తెలుసుకొని ఆమెను తమ చిత్రంలో నటింపచేశారు..అలా అలా ఒక్కో చిత్రం చేసుకుంటూ తన నాట్యంతో అందర్నీ ఫాన్స్ గా మార్చుతుంది వహీదా.. 1971లో రేష్మా ఔర్ శేరా చిత్రానికి ఆమెకు జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా గెలిచారు.. 1972 లో పద్మశ్రీ, 2011 లో పద్మవిభూషణ్ అందుకున్నారు వహీదా.. చివరికి ఆమె 2006లో సిద్ధార్థ హీరోగా రూపొందిన చుక్కల్లో చంద్రుడు సినిమా లో ఏఎన్నార్ తో కలిసి నటించారు. జయసింహ, బంగారు కలలు, సింహాసనం, చుక్కల్లో చంద్రుడు చిత్రాల్లో నటించారు. 2018లో కమల్‌హాసన్ తెరకెక్కించిన ‘విశ్వరూపం-2’ చిత్రంలో కశ్మీరీ మదర్‌గా నటించారు. అయితే ఆమె కెరీర్‌లో ఎక్కువ హిందీ చిత్రాల్లో నటించారు.1956లో సీఐడీ (CID) చిత్రంతో బాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడ ‘ప్యాసా’, ‘గైడ్’ వంటి పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల కాలంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు. 1971లో ఉత్తమ నటిగా వహీదా జాతీయ అవార్డును అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి.
నీ పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను బాలీవుడ్ ప్రముఖ నటి వహీదా రెహమాన్ కు ‘దాదా సాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ వరించింది. (వ్యాస రచయిత ప్రముఖ సినీ విమర్శకుడు)