నిన్నటి వరకూ కలెక్టర్…నేడు ఎమ్మెల్సీ

Date:

నిబద్దత ఆయన ఊరు
నిజాయితీ ఆయన పేరు!
(బండారు రాం ప్రసాద్ రావు)
కొట్ల డబ్బులు ఉన్నా మనిషి బ్రతకాలి అంటే మితాహరమే కావాలి…అలాగే ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెస్తేనే ప్రజామన్ననలు అందుకుంటారు! ఉత్తర తెలంగాణాలో మారుమూల గ్రామంలో పుట్టి, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్‌లో కీలక మైన ప్రభుత్వ పదవులు నిర్వహించి నలుగురు ముఖ్యమంత్రుల మన్ననలు పొందిన ఏకైక బ్యూరో క్రాట్ వెంకట్రామిరెడ్డి! నిన్నటి వరకూ సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసి ఇంకా పదినెల్ల‌ సర్వీస్ ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ చేసి, ఎమ్మెల్సీ గా సరికొత్త రాజకీయ అవతారం ఎత్తిన ఈయన నలుగురు ముఖ్యమంత్రులకు తలలో నాలుకలా వ్యవహరించడం వెనుక ఆయన పనితనం ప్రధాన పాత్ర పోషించింది…! వృత్తి పట్ల నిబద్దత ప్రజాస్వామ్యంలో లోటుపాట్లను సరిదిద్దే పాలనా సామర్థ్యాన్ని, ఒక అడ్మినిస్ట్రేటర్‌గా తన కొలీగ్స్ మనసు నొప్పించకుండా పని తీసుకోవడంలో నేర్పరితనం ఉండడం వల్లే ఆయన కీలకమైన బాధ్య‌తలో కీలకమైన వ్యక్తిగా నిలవగలిగాడు! 58 ఏళ్ళ వయసులో చట్ట సభ లో ప్రముఖ పాత్ర పొషించడానికి తన ముప్ఫై రెండేళ్ళ అధికార పాలనానుభవాన్ని జోడించబోతున్న వెంకట్రామి రెడ్డి రాజకీయనాయకుడుగా సక్సెస్ సాధిస్తాడనడానికి ఒక ప్రభుత్వ అధికారి గా ఆయన సాధించిన విజయాలను ఇక్కడ నెమరువేసుకోవాలి!
1996లో గ్రూప్ -1 అధికారిగా..
పెద్దపల్లి జిల్లా ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రామి రెడ్డి 1996లో గ్రూప్-1 అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. బందరు (మచిలీపట్నం) చిత్తూరు, తిరుపతిల‌లో ఆర్డీవో గా విధులు నిర్వర్తించారు. హుడా సెక్రటరీగా, మౌలిక వసతుల కల్పన సంస్థ, గృహ నిర్మాణ సంస్థలకు ఎండీగా సైతం సేవలు అందించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో వెంకట్రామిరెడ్డికి సుదీర్ఘ అనుబంధం ఉంది! డ్వామా (డిపార్ట్‌మెంట్ ఆఫ్‌…..) పీడీగా, ఉమ్మడి మెదక్ జిల్లా సంయుక్త కలెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. సిద్దిపేట జిల్లా మొదటి కలెక్టర్‌గా బాధ్యలు చేపట్టారు. కొత్త‌ జిల్లాను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెంకట్రామిరెడ్డిని కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు! స్వల్ప కాలం సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్ గా సేవలందించారు. 2018 సాధారణ ఎన్నికల సమయంలో సిరిసిల్ల, దుబ్బాక ప్రాంతాల ఉప ఎన్నిక సమయంలో సంగారెడ్డి కలెక్టర్‌గా ప‌ని చేశారు! నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు ఆర్డీఓగా మంచి నీటి సమస్యకు, తిరుపతి పట్టణ అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. వై ఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రతిష్ఠాత్మ‌క‌మైన ఔటర్ రింగ్ రోడ్డులో ఎన్నో వివాదాలు. భూ సేకరణ సమస్యలు వచ్చినా అందరినీ మెప్పించి భవిష్యత్ హైదరాబాద్‌కు బంగారు బాట వేశారు. దాదాపు ఒక జర్నలిస్ట్‌గా నాకు తెలిసి 25 మంది పారిశ్రామిక వేత్తలు వై ఎస్ పై ఒత్తిడి తెచ్చి వెంకట్రామి రెడ్డిని బదిలీ చేయించే ప్రయత్నాలు చేశారు. వారి డిమాండ్‌ను వై ఎస్ తోసి పుచ్చారు. తరువాత పదమూడు మంది వివిధ జిల్లాల కలెక్టర్లు సమర్థవంతుడైన వెంకట్రామి రెడ్డిని తమ జిల్లాకు అధికారిగా తీసుకుపోవడానికి ప్రయత్నించారు. తనకు అప్పజెప్పిన ప్రతి పనిని పద్దెనిమిది గంటలు నిద్రాహారాలు మాని పని చేస్తాడనే గుడ్‌విల్‌ను వెంకట్రామి రెడ్డి సాధించారు.


తరువాత రోశ‌య్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఐ ఏ ఎస్ గా ప్రమోషన్ పొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయన మైండ్‌సెట్‌ను మార్చిన అధికారుల్లో ఒకరిగా పేరు గాంచారు!!
కెసీఆర్ తో అనుబంధం
కెసీఆర్ దీర్ఘకాలిక ఆలోచనలతో ఒక విజన్ ఉన్న నాయకుడు…! ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా మొక్కవోని ఆత్మ‌స్థ‌యిర్యంతో తెలంగాణ తెచ్చిన ధీరుడు! తన రాజకీయ పరిపాలన అనుభవానికి అనుగుణంగా పరిపాలన దక్షత గల అధికారులను ఎంపిక చేసుకున్నారు. తన సొంత జిల్లా అయిన సిద్ధిపేట నుండి సమర్థవంతుడైన అధికారి కలెక్ట‌ర్‌గా ఉండాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయన మనసుకు వెంకట్రామిరెడ్డి వ్యక్తిత్వం నచ్చి ఆయనను కలెక్టర్ కుర్చీలో కూర్చోబెట్టారు. హైదరాబాద్‌కు తాగు నీరు అందించే ఉస్మాన్ సాగర్, హిమాయ‌త్ సాగర్, కొద్దిపాటి కృష్ణా జలాలు తప్ప వేరే దిక్కే లేదు. కెసీఅర్ నీళ్ళు స‌మృద్ధిగా ఉంటే నిధులు నియామ‌కాలు అవే వస్తాయని మిషన్ భ గీ ర థ కు స్వీకారం చుట్టి అది గజ్వేల్ నుండే ప్రధానమంత్రితో ప్రారంభోత్స‌వం చేయించారు.. అది మొదలు… వెంకట్రామిరెడ్డి గారి పాత్ర ఇక మొదలయింది.పెద్దపల్లి, కరీంనగర్ అటు రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ల తో సమన్వయం చేస్తూ గోదావరి జలాలను రాష్ట్రంలో మంచి నీళ్ళు ఇచ్చే ఘనతలో వెంకట్రామిరెడ్డి పాత్ర గ‌ణ‌నీయంగా ఉంది! ఆయన మాట తీరు, మర్యాద వ్యవహారం బ్యూరోక్రాట్లు ఫిదా అవుతారు! తరువాత మిషన్ కాకతీయ మొత్తం చెరువులు, నీటి నిలువ అంతా సిద్ధిపేట జిల్లాలోనే.
మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ ఇలా మొత్తం భూసేకరణ బాధ్యత అంతా కలెక్టర్ పైనే అది సిద్ధిపేట జిల్లాలో గజ్వేల్ ఆర్ డి వో…హుస్నాబాద్ ఆర్ డి వో లను సమన్వయం చేస్తూ భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇస్తూ ముందుకుసాగారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో 22, 500 ఎకరాల భూ సేకరణ లో ఎనిమిది గ్రామాల ప్రజల నుండి వచ్చిన అసంతృప్తి వెల్లువను, విపక్షాలు రాజకీయ రంగు పులిమి, కళ‌క్ట‌ర్‌ను బాధ్యుని చేసినా చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో అన్ని గ్రామాల ప్రజలకు పునరావాసం క‌ల్పించి, చివరికి కలెక్ట‌ర్‌పై ఆరోపణలు చేసిన రాజకీయ నాయకుడు కూడా టి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకొని క‌లెక్ట‌ర్‌కు అభినందనలు తెలిపారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక పీఠం వారిని కూడా ఒప్పించి మెప్పించి ఇవ్వాళ సాగునీరు, త్రాగు నీరు తెలంగాణ అంతటా వచ్చేలా చేసిన కెసీఆర్ కలలను వెంకట్రామిరెడ్డి నిజం చేశారు!
ఆయ‌న హ‌యాంలో ఎన్నో అభివృద్ధి ప‌థ‌కాల అమ‌లు
ఆరోపణలను దాటుకొని దేశం మొత్తం మీద అందరి క‌లెక్ట‌ర్ల‌కు స్కేచ్ఛ ఉండదు. అధికార పీఠం మీద ఎవరున్నా వారికి అనుగుణంగా పనిచేయాలి. కానీ వెంకట్రామిరెడ్డి గారి విషయంలో అందరూ ముఖ్య మంత్రులు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారు. అది దుర్వినియోగం కాకుండా తనపైపెట్టిన బాధ్యతలను ఆయన రెట్టింపుగా చూపెట్టారు. కెసీఆర్ దత్తత గ్రామాలలో మూకుమ్మడిగా గృహప్రవేశాలు, రెండు చండీయాగాలు, రాష్ట్రం మొత్తం కలెక్టర్లు తరలి వచ్చి సిద్దిపేట జిల్లా సర్వతోముఖాభివృద్ధి తిలకించడానికి రావడం, ఫారెస్ట్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు, వేలాది భూ నిర్వాసితులకు గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇళ్ళ నిర్మాణాలు, సరికొత్త ఆధునిక హంగులతో మార్కెట్లు, లక్ష‌లాది మొక్కలతో రాజీవ్ రహదారి నందనవనం చేయడం, కలెక్టరేట్ల నిర్మాణాలు… స్టేడియంల‌ నిర్మాణాలు, గజ్వేల్ చుట్టుప‌క్క‌ల‌ కాకుండా జిల్లా అంతటా స్వర్గ‌ధామాలు, కొన్ని కోట్ల విలువైన పరిశ్రమల స్థాపన, రైతు వేదికలు, ఎమ్మెల్యేల‌ క్యాంపు ఆఫీసులు, సమీకృత భవనాలు, గజ్వేల్ లో అండర్ డ్రైనేజీ సిస్టమ్ ఒక‌టా రెండా లక్షల కోట్ల నిధులతో సిద్ధిపేట జిల్లా సమగ్ర అభివృద్ధికి వెంకట్రామిరెడ్డి గారి హ‌యాంలో కార్యరూపం దాల్చాయి. ఇవన్నీ ఒకెత్తు… మూడు ప్రధాన మానవ నిర్మిత కృత్రిమ సరస్సులు, నీటిని నిల్వ ఉంచే ఆనకట్టను నిల్వ ఉంచిన జలాశయాల నిర్మాణం, సాగు నీరు, తాగునీరు కొరకు ఆయన కెసీఆర్ కు అందించిన అద్భుత కార్యశీలత బహుమతులు!! ఇందులో మంత్రిగా హరీష్ రావు గారు వెంకట్రామిరెడ్డికి అండగా నిలిచాడు! అన్నింటి కన్నా సిద్ధిపేట వరకూ మనొహరబాద్ నుండి రైల్వే లైన్ నిర్మాణం గజ్వెల్ వరకూ వెంకట్రామిరెడ్డి గారి హయాంలో పూర్తి అయింది…ఇవి కాక 153 చెర్వుల్లొ సమరుద్దిగా నీరు ఉండడమే కాక ఎడారి గా మారిన నిజాం సాగర్ వరకూ గజ్వేల్ మీదుగా నీళ్ళు నింపే బ్రుహత్తర పథకం అమల్లో ఆయన పాత్ర అమోఘం!! ఇవన్నీ కేవలం ఐదేళ్ల లో అంటే 1865 రోజుల్లో…అందులో 96 రోజులు సిరిసిల్ల, సంగారెడ్డి కి బదిలీ!! ఇన్ని కార్యాలు..దాదాపు 600 ప్రారంభొత్సవ ఫలకాలపై కె సి ఆర్, హరీష్ రావు తో పాటు సిద్ధిపేట జిల్లా అంతటా వెంకట్రామిరెడ్డి పేరూ ఉంటుంది.. అది అయన శ్రమ ఫలితం! ఈ అభివ్రుద్ది వెనుక 32, 000 గంటల శ్రమ ఉంది…అంటే రోజుకు సుమారు 18 గంటలు పని చేశారన్న మాట!


కుటుంబ‌మంతా విద్యాధికులే
వ్యక్తిగతం రాజపుష్ప ల సంతానం లో అందరూ విద్యాధికులు… ఆగర్భ శ్రీ మంతులే! ఎనిమిది మంది సంతానం లో ఇద్దరు కలెక్టర్లు…తండ్రి ఉస్మానియా లో ఉర్దులో లా పట్టా తీసుకొని కూడా స్వగ్రామానికి రైతు గా వచ్చారు… కన్న తల్లి ని ఉన్న ఊరిని వదిలి వెళ్ళ లేదు! అంతటి సంస్కారం ఇచ్చిన తల్లి దండ్రుల పేరిట రాజారెడ్డి – పుష్ప ల పేరు మీద “రాజా పుష్ప” ఇండస్ట్రీ స్థాపించి ముప్ఫై ఏళ్లుగా వ్యాపార రంగంలో ఉన్నారు…తమ్ముళ్లు…వాళ్ళ పిల్లలు, మనవలు అంతా కలిసి హైదరాబాదు నడిబొడ్డున 24 బెడ్ రూమ్ లలో అందరూ ఒకటై ఆదర్శ కుటుంబం గా పలువురికి ఆదర్శ ప్రాయం అయ్యారు! 86 తల్లిని ఇప్పటికీ గుండెల్లో పెట్టు కొని చూస్తున్న వీరి మానవత.
హృదయం వెనుక కఠోర శ్రమ ఉంది… 30 ఏళ్ళ క్రితం మంఖల్ లో పౌల్ట్రీ ఫామ్ కు అంకితం అవుతాననుకున్న వెంకట్రామిరెడ్డి వయసు అప్పుడు 24 ఏళ్ళు…! ఇవ్వాళ చట్టసభ ల్లో అడుగు పెట్టడం వెనుక స్వచ్చమైన వ్యక్తిత్వం ఉంది…రాజకీయ నాయకుల “వరి రాజకీయాలు”…”పాద నమస్కారాల” రాజకీయాలు…తెరమరుగయి…భవిష్యత్ లో పరిపక్వత గల రాజకీయ నాయకుడి గా వారికి ధీటైన జవాబు చెప్పే రోజు త్వర లోనే ఉంది…తెలంగాణా బిడ్డగా కెసీఅర్ కు దండాలు పెట్టడం సంస్కారం! మన్మోహన్ సింగ్ ను పివీ నరసింహ రావు తన మంత్రి వర్గంలో కి తీసుకున్నప్పుడు ఆయన ఒక బ్యూరో క్రాట్ ఆయన అనుభవం జోడించి పివీ ఆర్థిక సంస్కరణలు తెచ్చారు…ఇవ్వాళ వెంకట్రామిరెడ్డి అనుభవం జోడించి కె.సీ ఆర్ ధరణి లోనూ…రెవెన్యూ లో విప్లవాత్మక మార్పు తెచ్చే రోజులు త్వరలో నే ఉన్నాయి!! (వ్యాస ర‌చ‌యిత సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...