Home Breaking News మాదిగ… ఉపకులాలకూ రిజర్వేషన్ల అమలు

మాదిగ… ఉపకులాలకూ రిజర్వేషన్ల అమలు

0
మాదిగ… ఉపకులాలకూ రిజర్వేషన్ల అమలు

సుప్రీమ్ తీర్పుపై సీఎం హర్షం
ధర్మాసనానికి కృతజ్ఞతలు చెప్పిన రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 01 :
ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని ప్రకటించారు. ఎస్సి వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు తీర్పుపై ఆయన స్పందించారు. సుప్రీ కోర్టుకు ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మాదిగ, మాదిగ ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకేట్ జనరల్ ను సుప్రీంకోర్టుకు పంపించారని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించిందని రేవంత్ చెప్పారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు లో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here