తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

Date:

దివ్యంగులకు ఆర్ధిక భరోసా పెంపు
గురుకులాల్లో డైట్ చార్జీలనూ పెంచిన కె.సి.ఆర్.
హైదరాబాద్, జులై 23 :
దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి వేదికగా నిలచింది. ఆసరా అవసరమైన దివ్యాంగులకు నేనున్నానంటూ ఆర్థిక భరోసాగా అందిస్తున్న మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింతగా పెంచింది. ఈ మేరకు దివ్యాంగుల పింఛన్ ను రూ. 1,000 పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలా రూ. 3,016 పెన్షన్ ను అందుకుంటున్న దివ్యాంగులు, ఈ పెంపుతో రూ. 4,016 పెన్షన్ ను అందుకోబోతున్నారు. మంచిర్యాల సభ వేదికగా దివ్యాంగుల పింఛన్ను పెంచబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు, సంబంధిత ఫైల్ ను ఆమోదించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
గురుకులాల్లో డైట్ చార్జీల పెంపు
రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాలు సహా పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టల్లలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతులను అందించేందుకు ప్రస్థుతం అందిస్తున్న డైట్ ’ చార్జీలను పెంచుతూ సంబంధిత ఫైలు మీద శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్ లో సిఎం కేసీఆర్ సంతకం చేశారు. పెరిగిన డైట్’ చార్జీలు జులై నెలనుండి అమలులోకి రానున్నాయి.
పెరిగిన డైట్’ చార్జీల వివరాలు ఇలా ఉన్నాయి
3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు అందిస్తున్న రూ. 950 ల డైట్ చార్జీలు రూ. 1200 కు పెరిగాయి.
8 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నెలకు అందిస్తున్న డైట్’ చార్జీలు రూ.1100 నుంచి రూ.1400 లకు పెరిగాయి.


11 వ తరగతి నుండి పీ.జీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్థుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు రూ.1500 నుంచి రూ.1875 లకు పెరిగాయి.
ఏడున్నర లక్షల విద్యార్థులకు ప్రయోజనం
పెరిగిన డైట్ చార్జీల ద్వారా… ట్రైబల్ వెల్పేర్, ఎస్సీ వెల్పేర్, బిసి వెల్పేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సిఎం తెలిపారు. అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నది.
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్లల్లో చదువుకుంటున్న విద్యార్థులకోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించుదుకు అందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం స్పష్టం చేశారు.
డైట్ చార్జీలు పెంచుతూ ఫైలు పై సంతకం చేసిన సందర్భంగా గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సిఎం కేసీఆర్ కు కృతజ్జతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...