దిగ్దిగంతాల‌కు తెలంగాణ కీర్తి: కేసీఆర్

Date:

టి హ‌బ్ ప్రోత్సాహం…స్టార్ట‌ప్స్ ఉత్సాహం
ధ్రువ స్పేస్ టెక్ సంస్థ‌కు అభినందన‌
ప్రైవేటు రంగ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగ చరిత్ర‌లో సుదినం
హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 26:
తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా, శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రెండు నానో శాటిలైట్స్ అంతరిక్ష కక్ష్య‌లోకి విజయవంతంగా ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఇస్రోకు చెందిన ‘‘ పిఎస్ ఎల్ వీ -సి 54 ’’ తో పాటుగా హైద్రాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ’ స్టార్టప్ సంస్థ పంపిన ‘‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’’ అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సిఎం పేర్కొన్నారు. ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయం అన్నారు. టి హబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్’ స్టార్ట‌ప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన ‘‘ విక్రమ్ –ఎస్ ’’ శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్ట‌ప్ కంపెనీ మొట్ట మొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సిఎం అన్నారు.
అంత‌రిక్షానికి త‌లుపులు తెరిచిన హైద‌రాబాద్ స్టార్ట‌ప్స్‌
ఈ ప్రయోగాలతో భారత అంతరిక్షరంగంలో హైద‌రాబాద్ అంకుర సంస్థలు ద్వారాలు తెరిచాయని సీఎం అన్నారు. ప్రపంచ స్పేస్ ఎకానమీలో భారత్ వాటాను పెంచేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి మొన్నటి “విక్రమ్ ఎస్” నేటి ‘‘తై బోల్ట్ 1, తై బోల్ట్ 2’’ ప్రయోగాల విజయం శుభారంభాన్ని ఇచ్చిందని సీఎం అన్నారు. విజయం సాధించిన ఈ రెండు ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ కీర్తిని దిగంతాలకు చాటాయన్నారు.
ఈ ఉప గ్రహ ప్రయోగాల ద్వారా స్టార్టప్స్ సిటీగా హైదరాబాద్ కున్న విశిష్టత రెట్టించిందని సీఎం అన్నారు. ఔత్సాహికుల ప్రతిభను వెలికితేయడం, పరిశ్రములు,శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టి హబ్ లు భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్ళు సాధిస్తాయనే నమ్మకం తనకుందని, ఇది ఆరంభం మాత్రమేనని సీఎం పేర్కొన్నారు.
టి హబ్ ప్రోత్సాహంతో, తమ స్టార్టప్ సంస్థల ద్వారా ఉప గ్రహాలను రూపొందించి వాటిని విజయవంతంగా ప్రయోగించి తెలంగాణ కీర్తిని చాటిన ‘స్కైరూట్’, ‘ధృవ’ స్పేస్ స్టాటప్ సంస్థల ప్రతినిధులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలను తెలిపి అభినందించారు. ఇదే స్పూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి భారత దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు వారి అద్భుతమైన ఆలోచనకు తమ అంకుర సంస్థల ద్వారా కార్యరూపమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. శాస్త్ర సాంకేతిక ఐటి రంగాల్లో ఔత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న యువనేత, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావును, ఉన్నతాధికారులను టిహబ్ సిబ్బందిని సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
వివిధ రంగాల్లో దేశానికే ఆద‌ర్శం తెలంగాణ‌
అనతికాలంలోనే ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతూ ఇప్పటికే పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం.. మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా రేపటి తరాల ప్రతిభను వెలికితీసి, ఆకాశమే హద్దు గా తీర్చిదిద్దుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ స్టార్టప్ చరిత్రలో, అంతరిక్షంలోకి ప్రయివేటు ఉప గ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. ఐటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతను ప్రోత్సహించే దిశగా సిఎం కెసిఆర్ దార్శనికతతో, యువనేత మంత్రి కెటిఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్ లో సభ్యులైన యువత తమ ప్రతిభతో పలు రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు. మొన్న, నేడు విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ ఘనకీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయి.
‘‘ స్కైరూట్ ఎరో స్పేస్ ప్రయివేట్ లిమిటెడ్’’ అనే అంకుర సంస్థ, దేశంలో మొట్టమొదటిసారి రూపొందించి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రయివేట్ రాకెట్ ‘‘ విక్రమ్ – ఎస్’’ ప్రయోగం మొన్ననే విజయవంతమైంది. ఇది తెలంగాణ హార్డ్ వేర్ ఇంకుబేటర్ ‘‘టి వర్క్స్’’ సహకారంతో తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహకంతో అభివృద్ది చెందిన హైద్రాబాద్ టి హబ్ స్టార్టప్ సంస్థ.
మొన్నటి ప్రయోగం విజయవంతం కావడాన్ని దేశమంతా చర్చించుకుంటుండగానే నేడు హైద్రాబాద్ కు చెందిన మరో తెలంగాణ స్టాటప్ కంపెనీ చేత అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగం చోటు చేసుకున్నది. శనివారం శ్రీహరి కోటనుంచి ధ్రువ’ స్పేస్ సంస్థ పంపిన మరో రెండు సాటిలైట్లు విజయవంతం అయ్యాయి. దాంతో మరోసారి దేశమంతా హర్షాతిరేకాలు మిన్నుముట్టాయి. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్టార్టప్ కంపెనీలు సాధించిన ఘనతను ప్రపంచమంతా కొనియాడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/