విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా సాగుతున్నాయి. మూల నక్షత్రం సందర్భంగా సోమవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం ముఖ్యమంత్రి దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు. సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నారు. దుర్గ ఆలయ ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్ సీఎంను అనుసరించారు. అందుకు సంబంధించిన చిత్రాలే ఇవి.




