ఆహ్వానాన్ని అందజేసిన జియర్ స్వామి
అమరావతి, నవంబర్ 20: త్రిదండి చిన జియర్ స్వామి శనివారం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.
అమరావతిలోని జగన్ స్వగృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు.
ఆశ్రమంలో జరిగే ఓ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి జగన్కు అందజేశారు.
ఈ సందర్భంగా చిన జియర్తో జనగ్ కొద్దిసేపు మాట్లాడారు. పాద నమస్కారం చేసి, తన గౌరవాన్ని ప్రకటించుకున్నారు. జియర్తో భేటీ సందర్భంగా తీసిన చిత్రాలు ఇవి. చిన జియర్ వెంట మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.