హైదరాబాద్ లో టెక్నాలజీ డెవెలప్​మెంట్​ సెంటర్

Date:

ప్రకటించిన ఛార్లెస్ స్క్వాబ్ సంస్థ
సీఎంతో కంపెనీ ప్రతినిధుల చర్చలు
హైదరాబాద్, ఆగష్టు 08 :
ఫైనాన్షియల్ సర్వీసెస్లో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. భారత్లోనే ఈ కంపెనీ నెలకొల్పే మొదటి సెంటర్‌ ఇదే కావటం విశేషం.


అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు. తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

డాక్టర్ నోరి జీవనయానం

మంటాడా నుంచి మన్ హటన్ దాకావిజయవాడ: ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి...

టాస్ ఓడి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన రోహిత్

భారత్ చేతిలో కివీస్ చిత్తువరుసగా 15 వ సారి టాస్ ఓడిపోయిన...

ఈనాడులో నేను చూసిన మేనేజర్లు

అత్త్యుత్తమ మేనేజర్ ఎవరంటే…ఈనాడు - నేను: 42(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) ఈనాడులో నేను...

ఆందోళనలో ఉన్నా సంస్థ గురించే ఆలోచించాలట

మన పక్కనే గుర్తించలేని బల్లేలుంటాయిఈనాడు - నేను: 41(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం) ఈనాడులో...