సి.హెచ్.వి.ఎం. కృష్ణారావుకు నడింపల్లి శ్రద్ధాంజలి
(నడింపల్లి సీతారామరాజు, సీనియర్ పాత్రికేయులు)
కృష్ణారావు అందరితోనూ కలివిడిగా ఉండే మంచి జర్నలిస్ట్ ఎవరినైనా సరే ఒప్పించి మెప్పించే తప్ప … తప్పుడు వార్తలు రాయడం తెలియదు కృష్ణారావు రాస్తే ఆ వార్తకు ఎంతో విలువ ఉండేది . ఏదైనా సబ్జెక్ట్ రావాలంటే మంచి నైపుణ్యం కావాలి… అలా రాసే పెన్ను ఆయన చేతిలో ఉంది. రాజకీయాలు పండిపోయిన వారు సైతం కృష్ణారావును చాలా గౌరవించి చూసేవారు. అటువంటి వ్యక్తి మనందరికీ దూరం అవటం చాలా బాధాకరం. మనం ఏ వార్త రాసిన రాష్ట్ర ప్రజలకు రాష్ట్రానికి మంచి చేసేదిగా ఉండాలని భావించేవారు. ఈ మధ్యనే నేను ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడాను. ఎలా ఉన్నారు ఏంటి అంటూ చాలా మర్యాదగా పలకరించుకున్నాం. మేమందరం ఒకేసారి జర్నలిజన్లోకి వచ్చాం. ఇరిగేషన్ కు సంబంధించి కృష్ణారావుకి ఉన్నంత పరిజ్ఞానం చాలా మంది తక్కువ జర్నలిస్టులకు ఉంటుంది. పెద్ద పెద్ద ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఆయన సలహాలు తీసుకోవటం నేను. చాలాసార్లు చూశాను.. విన్నాను. ప్రాజెక్టులపై ఏదైనా వివాదాస్పద వార్తలు రాసినప్పుడు ఆయన రాసిన వార్తకు ఖండన ఏనాడు నేను చూడలేదు. పరిశోధనాత్మక జర్నలిజంలో మేమిద్దరం పోటీ పడేవాళ్ళం అటు “ఈనాడు ఇటు -ఉదయం దినపత్రికలు ఆనాడు వార్తా రంగంలో పోటీపడి మెప్పించడంలో ముందంజలో ఉండేవి. నీటిపారుదల రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోమంచి నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రులను తప్ప, ఏ రాజకీయ నాయకుడికైనా ఎంత పెద్ద పెద్ద నాయకులైన సరే “మీరు..సారు ..సార్ ..”అని పిలవటం ఎప్పుడు వినలేదు. మా సహచర మిత్రుడు గిరిజాపతి గారు రాసింది అక్షర సత్యం. రాష్ట్ర ప్రజలు ,తెలుగు పాఠకులు ఒక మంచి జర్నలిస్టును కోల్పోయారు. మా నుండి ఒక మంచి మిత్రుడు దూరమయ్యారు…వారి కుటుంబానికి మా సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
ఇరిగేషన్ పై అద్వితీయ పట్టు
Date: