హైదరాబాద్, జనవరి 14 పౌరాణిక వాచస్పతి మల్లాది చంద్రశేఖరశాస్త్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. వయోభారంతో బాధపడుతూ ఆయన అస్తమించారు. 1925 ఆగస్టు 28న శాస్త్రి క్రోసూరులో జన్మించారు. పురాణ ప్రవచనాలలో ఆయనకు ఆయనే సాటి. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీగారితో కలిసి పాల్గొన్నారు. ఆయన వయసు 96 సంవత్సరాలు. భారతము ధర్మసుక్ష్మ దర్శనము, క్రుష్ణలహరి (సేచ్చాంధ్రానువాదము), రామాయణ రహస్య దర్శిని, తదితర గ్రంథాలను రచించారు. వేదాలు, శ్రౌతస్మార్త, వ్యాకరణతర్క వేదస్త సాహిత్యాలను చదివారు.
మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం
Date: