బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్
ప్రభ ఆత్రే, కల్యాణ్ సింగ్‌లకు పద్మవిభూషణ్
సుందర్ పిచయ్, సత్య నాదెళ్ళకు, బుద్ధదేవ్‌లకు పద్మభూషణ్
నలుగురికి పద్మ విభూషణ్
మొత్తం 17 పద్మభూషణ అవార్డులు
107 పద్మశ్రీ అవార్డులు
మొత్తం 128 పద్మ పురస్కారాలు
న్యూఢిల్లీ, జనవరి 25 కేంద్ర ప్రభుత్వం మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన చీప్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మొత్తం నలుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలను ఇవ్వనున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ, బీజేపీ నేత దివంగత కల్యాణ్ సింగ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచర్యలకు పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించారు.
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ ఫౌండర్ డాక్టర్ కృష్ణ ఎల్లాకు పద్మభూషణ్ ఇవ్వనున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి, ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకున్నారు. బారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.
సోనూ నిగమ్, నీరజ్ చోప్రాలకు పద్మశ్రీ ప్రకటించారు. సోనూ నిగమ్ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు. తాజాగా ముగిసిన ఒలింపిక్ క్రీడలలో జావెలిన్ విభాగంలో నీరజ్ చోప్రాభారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించారు.